అత్యంత సరసమైన కార్ల విడుదలకు సిద్దమవుతున్న హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి భారీ సంఖ్యలో అత్యంత సరసమైన ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

By Anil

ఇండియన్ మార్కెట్లో అత్యంత నాణ్యమైన మరియు కాస్త ఖరీదైన ఉత్పత్తులను విడుదల చేయడంలో హ్యుందాయ్ ప్రముఖ పాత్ర వహిస్తోందని చెప్పాలి. అయితే ఇప్పుడు నాణ్యమైన కార్లను కాస్తంత తక్కువ ధరలో ఉండేట్లు భారీ సంఖ్యలో విడుదల చేయడానికి హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది.

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్ కంపెనీ రానున్న సంవత్సరాల్లో అంర్జాతీయ మార్కెట్లోని వాహన పరిశ్రమలో 15 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది.

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్ ఇండియా గత ఏడాదిలో రికార్డు స్థాయిలో 6,43,270 యూనిట్ల విక్రయాలు జరిపింది. ఇందులో మొత్తం దేశీయ మరియు అంతర్జాతీయంగా ఎగుమతి చేసిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి. 2015 ఏడాదిలో కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్‌కు అంతర్జాతీయ మార్కెట్లలో యూరప్ టాప్ 3 లో నిలిచింది.

హ్యుందాయ్ మోటార్స్

గత ఏడాది హ్యుందాయ్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ అమ్మకాల్లోని 49,64,837 యూనిట్లుగా ఉండగా ఇందులో హ్యుందాయ్ ఇండియా అమ్మకాల వాటా 13 శాతంగా ఉంది.

హ్యుందాయ్ మోటార్స్

ఈ వాటాను 15 శాతానికి పెంచడానికి హ్యుందాయ్ ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం రానున్న రెండు మూడేళ్లలోపు అత్యంత సరసమైన, నాణ్యమైన మోడళ్లను విరివిగా మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తోంది.

హ్యుందాయ్ మోటార్స్

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కార్లినో అనే ఎస్‌యువిని కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. ఇప్పటి వరకూ ఇది కాన్సెప్ట్ రూపంలోనే ఉంది. దీనిని 2018 లో దేశీయ మార్కెట్లలోకి విడుదల చేసే అవకాశాలున్నాయి.

హ్యుందాయ్ మోటార్స్

ఈ మధ్యనే చైనా మార్కెట్లో హ్యుందాయ్ విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యువి ఆధారిత వాహనాన్ని ఇండియన్ మార్కెట్ కోసం హైదరాబాద్ లోని హ్యుందాయ్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ అభివృద్ది చేస్తోంది.

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వైకె కూ మాట్లాడుతూ, ప్రస్తుతం మా వద్ద విభిన్నమైన నూతన ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలకు సిద్దంగా ఉన్నాయి, హ్యుందాయ్ ఖ్యాతిని గడించే విధంగా వీటిని మోడ్రన్ ప్రీమియమ్ బ్రాండ్లుగా పరిచయం చేయనున్నట్లు ఆయన తెలిపాడు. ఇప్పటి ఎలంట్రా మరియు టక్సన్ మోడళ్లను విడుదల చేసినట్లు చెప్పుకొచ్చాడు.

హ్యుందాయ్ మోటార్స్

కొరియా ఆధారిత ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ప్రస్తుతం దేశీయంగా కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోని మారుతి సుజుకి వితారా బ్రిజాకు గట్టి పోటీని సిద్దం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అదే విధంగా 2018 నుండి ఎక్కువ మొత్తంలో హైబ్రిడ్ వాహనాల మీద దృష్టి సారిస్తోంది.

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్స్ 2018 లో జరగనున్న ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద అధిక మొత్తంలో హైబ్రిడ్ వాహనాలను ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా మధ్య స్థాయి సెగ్మెంట్లో మిల్డ్ హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని పరిచయం చేయనుంది.

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ ఇండియా ఈ ఏడాది చివరి నాటికి 0.5 మిలియన్ల కార్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో ఎగుమతులు 25 శాతంగా ఉన్నాయి.

హ్యుందాయ్ మోటార్స్
  • మినీ క్లబ్ మ్యాన్ విడుదల చేసిన మినీ: ధర రూ. 37.9 లక్షలు
  • బజాజ్ డామినర్ 400 విడుదల: ప్రారంభ ధర రూ. 1.36 లక్షలు
  • విమానంలో కూర్చోవడానికి అత్యంత సురక్షితమైన చోటు ఏది ?

Most Read Articles

English summary
Hyundai To Offer More Affordable Cars In India
Story first published: Thursday, December 15, 2016, 21:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X