హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ప్రథమ ప్రదర్శన: ఫోటోలతో పూర్తి వివరాలు

Posted By:

బ్రెజిల్ కేంద్రంగా జరుగుతున్న 2016 Sao Paulo ఆటో షో వేదిక మీద దక్షిణకొరియా ఆధారిత ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ ఫే‌లిప్ట్ క్రెటా ను ప్రదర్శించింది. ప్రప్రథమంగా ప్రపంచ ప్రదర్శనకు వచ్చిన ఈ వేరియంట్ అంతర్జాయ మార్కెట్ కోసం అభివృద్ది చేసిన ఫేస్‌‌లిఫ్ట్ క్రెటా హ్యుందాయ్ తెలిపింది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

బ్రెజిల్ వెర్షన్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మునుపటి క్రెటా ఎస్‌యువితో పోల్చుకుంటే ముందు వైపు డిజైన్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

నూతనంగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, స్వల్పంగా సవరించిన డిజైన్‌లో హెడ్ ల్యాంప్, రీ డిజైన్ చేసిన ఎయిర్ ఇంటేకర్, సమాంతరాకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ వంటి మార్పులు జరిగాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

ఇక సరికొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెనుక డిజైన్ మీద కూడా హ్యుందాయ్ ప్రత్యేక శ్రద్ద సారించింది. విభిన్నమైన టెయిల్ లైట్ మరియు బంపర్‌ను కలిగి ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

ప్రపంచ మార్కెట్ల దృష్టిని ఆకర్షించే విధంగా ఇంటీరియర్‌ను పూర్తి స్థాయిలో రీ డిజైన్ చేసి కార్పోరేట్ లెవల్‌లో ఫీచర్లను అందించింది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్‌లోని ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ లో స్మార్ట్ ఫోన్ అనుసంధానం ద్వారా ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను వినియోగించుకోవచ్చు. ప్రత్యేకించి క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థను అభివృద్ది చేశారు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

భద్రత పరంగా బ్రెజిల్ లో ప్రదర్శితమైన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, స్టెబిలిటి కంట్రోల్ వంటివి ఉన్నట్లు తెలిసింది, అయితే ఇతర భద్రత ఫీచర్లను గోప్యంగా ఉంచారు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

క్రెటా ఫేస్‌లిఫ్ట్ విభిన్న ఇంధనాన్ని వినియోగించుకునే రెండు రకాల ఇంజన్‌లను కలిగి ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

అందులో ఒకటి 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న వేరియంట్ సుమారుగా 130బిహెచ్‌పి పవర్ మరియు 162ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

అధే విధంగా క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లోని మరో ఇంజన్ ఆప్షన్ 2-లీటర్ వేరియంట్ సుమారుగా 166బిహెచ్‌పి పవర్ మరియు 201ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

2017 జనవరి నుండి బ్రెజిల్ మార్కెట్లో క్రెటా ఫేస్‌లిఫ్ట్ విక్రయాలు ప్రారంభించనుంది. 2017 లో కాస్త ఆలస్యంగా దేశీయ విపణిలోకి క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

2016 Sao Paulo ఆటో షో వేదిక మీద అధికారికంగా ప్రదర్శించబడినహ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

2016 Sao Paulo ఆటో షో వేదిక మీద అధికారికంగా ప్రదర్శించబడిన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ - ఫోటోలు

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

2016 Sao Paulo ఆటో షో వేదిక మీద అధికారికంగా ప్రదర్శించబడిన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ - ఫోటోలు

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

2016 Sao Paulo ఆటో షో వేదిక మీద అధికారికంగా ప్రదర్శించబడిన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ - ఫోటోలు

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

 
English summary
Hyundai Creta Facelift Breaks Cover At 2016 Sao Paulo Auto Show

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark