నెక్ట్స్ జెనరేషన్ క్రెటా 7 సీటింగ్ సామర్థ్యంతో: హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ తమ రెండవ తరం క్రెటా కాంపాక్ట్ ఎస్‌యువిని అభివృద్ది చేస్తోంది మరియు ఈ క్రెటా ఎస్‌యువిని ఏడు కూర్చునే సామర్థ్యంతో పరిచయం చేయనుంది.

By Anil

కొరియాకు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి గత ఏడాది క్రెటా కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదల చేసింది. అయితే అనతి కాలంలోనే భారీ అమ్మకాలను మూటగట్టుకుంది హ్యుందాయ్.

7-సీటింగ్ సామర్థ్యంతో హ్యుందాయ్ క్రెటా

దేశీయంగా ఎస్‌యువి వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తమ లైనప్‌లోకి మరిన్ని ఎస్‌యువిలను ఉత్పత్తి చేసే ఆలోచనలో ఉంది.

7-సీటింగ్ సామర్థ్యంతో హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ తమ ఎస్‌యువి సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు గాను పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లను, తక్కువ ఫీచర్లు గల డీజల్ ఆటోమేటిక్ వేరియంట్లను మరియు లిమిటెడ్ యానివర్శిరీ ఎడిషన్‌లను అందుబాటులోకి తీసుకురానుంది.

7-సీటింగ్ సామర్థ్యంతో హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ ఇప్పటికే తమ తరువాత తరం క్రెటా కాంపాక్ట్ ఎస్‌యువిని అభివృద్ది చేసే పనిలో నిమగ్నమయ్యింది. 2021 నాటికి ఇది పూర్తి స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కొన్ని అప్‌డేట్స్‌తో రూపొందుతున్న క్రెటాను 2016 Sao Paulo Auto Show లో ప్రదర్శించనుంది.

7-సీటింగ్ సామర్థ్యంతో హ్యుందాయ్ క్రెటా

తాజాగ ఉన్న పరిణామాల పరంగా చూస్తే తరువాత తరం క్రెటా ఐదు మరియు ఏడు మంది ప్రయాణించే సీటింగ్ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు వేరియంట్లు రెండు రకాల అవసరం ఉన్న వినియోగదారులకు అవసరమవుతుందనే నమ్మకంలో హ్యుందాయ్ ఉంది.

7-సీటింగ్ సామర్థ్యంతో హ్యుందాయ్ క్రెటా

క్రెటా ఆధారంతో డెవలప్ అవుతున్న క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ మరిన్ని డిజైన్ మార్పులతో, నూతన ఇంటీరియర్ సొబగులతో త్వరలో విడుదల కానుంది.

7-సీటింగ్ సామర్థ్యంతో హ్యుందాయ్ క్రెటా

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 7-సీటర్ ఎస్‌యువి కోసం ఎదురుచూస్తున్న వారికి హోండా బిఆర్-వి, మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ500, నువోస్పోర్ట్ మరియు టియువి300 వంటి ఉత్పత్తులు ఉన్నాయి. వీటితో 7-సీటర్ క్రెటా పోటీ పడే అవకాశం ఉంది.

7-సీటింగ్ సామర్థ్యంతో హ్యుందాయ్ క్రెటా

ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ ఎస్‌యువి విభాగం మీద ఎక్కువ దృష్టి సారిస్తోంది. హ్యుందాయ్ తమ 7-సీటర్ క్రెటాను పరిచయం చేస్తే హ్యుందాయ్ పుస్తకంలో మరో విజయ చరిత్రను లిఖించడం ఖాయం.

7-సీటింగ్ సామర్థ్యంతో హ్యుందాయ్ క్రెటా

  • లీకైన 2017 బజాజ్ పల్సర్ 180 ఫోటోలు: మార్పులేంటి ?
  • ISIS దాడుల్లో బుల్లెట్ల దాడిని తిప్పికొట్టిన 1990 కాలం నాటి BMW
  • దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

Most Read Articles

English summary
Read In Telugu: Next Generation Hyundai Creta To Be Offered In Seven-Seater Variant
Story first published: Monday, November 7, 2016, 19:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X