మారుతిని టార్గెట్ చేస్తూ హ్యుందాయ్ నుండి వస్తున్న కొత్త ఎస్‌యువి

By Anil

భారతీయ వాహన పరిశ్రమలో ఉన్న అన్ని సెగ్మెంట్లలో తమ విభిన్నమైన ఉత్పత్తులను విడుదల చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. హ్యుందాయ్. ఈ క్రమంలోనే భారత దేశపు రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

హ్యుందాయ్‌కు చెందిన ఐ20 ఆధారిత ఎస్‌యువి రహస్య నమూనా ఫోటోలు మరియు ఆధారం లేని సమాచారం నెట్టింట్లో తీవ్ర చక్కర్లు కొడుతోంది. హ్యుందాయ్ వారి ఈ సరికొత్త ఎస్‌యువి గురించి ఓ లుక్కేసుకుందాం రండి.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

హ్యుందాయ్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోన్న ఈ ఇంట్రెస్టింగ్ ఎస్‌యువి యొక్క డిజైన్ ఐ20 ఆధారంతో మరియు సాంకేతికంగా ఐ30 అంశాలను పంచుకోనున్నట్లు తెలిసింది.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

హ్యుందాయ్ ఐ30 లో విభిన్న రకాల ఇంజన్‌ ఆప్షన్‌లు కలవు. అవి, మూడు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ 1.0-లీటర్ ఇంజన్, 1.4-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్, 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లు.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

తాజాగా హ్యుందాయ్ మోటార్స్ ఇంట్రాడో అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది, ఇది ఈ హ్యుందాయ్ వారి అప్ కమింగ్ ఎస్‌యువిల డిజైన్‌కు ఊతం కానుంది. ఇదే డిజైన్‌ను ఈ ఐ20 ఆధారిత ఎస్‌యువిలో అందించనున్నారు.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

ఐ20 ఆధారిత ఎస్‌యువి యొక్క డిజైన్‌ గురించి పరిశీలిస్తే ముందు వైపున మలుపులు గల హెక్సా గోనల్ ఫ్రంట్ గ్రిల్ కలదు, ఇలాంటి గ్రిల్‌ను ఐ30 మరియు గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ కార్లలోని ఫ్రంట్ గ్రిల్‌లో గమనించవచ్చు.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఐ20 ఆధారిత ఎస్‌యువిని 2017 నాటికి దేశీయంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. టుసాన్ ఎస్‌యువి కన్నా దిగువ స్థానంలో దీనిని ప్రవేశపెట్టనున్నారు.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఐ20 చిన్న ఎస్‌యువి కోసం ఐఎక్స్45, ఐఎక్స్50, ఐఎక్స్15, ఐఎక్స్25 మరియు ఐఎక్స్30 అనే బ్యాడ్జి పేర్లను రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే హ్యుందాయ్ దీనిని ఇంకా ధృవీకరించలేదు.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

అయితే హ్యుందాయ్ మోటార్స్ తమ ఎస్‌యువి శ్రేణి వాహనాల పేర్లకు ముందు ఐఎక్స్ అనే అనే అక్షరాన్ని అందించడం ఆనవాతీగా వస్తోంది.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

ఇలాంటి పద్దతిని చాలా వరకు కార్ల తయారీ సంస్థలు తమ క్రాసోవర్ వాహనాలను విడుదల చేసినపుడు అవలంభిస్తాయి.

హ్యుందాయ్ వారి ఐ20 ఆధారిత ఎస్‌యువి

  • ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మైక్రాను పరిచయం చేయనున్న నిస్సాన్
  • లేటెస్ట్ అప్‌డేట్స్‌తో 2017 మారుతి వ్యాగన్ఆర్
  • మరింత సురక్షితమైన యమహా ఆర్15

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Developing New Compact SUV Based On The i20 Base
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X