బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

Written By:

2016 ఐఐటి ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 11 వ ర్యాంకు సాధించినందుకు తన్మయ షెఖావత్ అనే విధ్యార్థికి, తాను చదివిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు బిఎమ్‌డబ్ల్యూ కారును ప్రధానం చేశారు. అయితే దానిని వెనక్కిచ్చేశాడు షెఖావత్.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

రాజస్థాన్ లోని సికర్ లో గల ప్రముఖ ఐఐటి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తమ స్టూడెండ్ ఇండియా లెవల్‌లో ఐఐటి ఫలితాల్లో 11 వ ర్యాంక్ సాధించినందుకు సుమారుగా 31 లక్షల ఖరీదైన బిఎమ్‌బ్ల్యూ కారును బహుకరించారు.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

ఇప్పుడు ఈ విద్యార్థి ఐఐటి పట్టా పొందాడు. ఆ స్టూడెంట్ తండ్రి రాజేశ్వర్ సింగ్ షెఖావత్ సాధారణ ఉపాధ్యాయుడు. తమ కుమారిడికి బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

సుమారుగా ఆరు నెలల తరువాత ఈ కారును అధిక నిర్వహణ భారం కారణంగా మరియు సర్వీస్ ధర రూ. 85,000 లు అదే విధంగా తక్కువ మైలేజ్ వంటి కారణాలతో వెనక్కిచ్చేయాలని బావిస్తున్నారట.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

విద్యార్థి తండ్రి ప్రముఖ దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ, కారును వెనక్కి తీసుకుని దానికి సరిపడా డబ్బును ఇవ్వండి లేదా దాని బదులు ఏదైనా గిఫ్ట్ కనీసం ల్యాప్‌టాప్ అయినా ఫర్వాలేదని కోచింగ్ ఇన్‌స్ట్యూట్ డైరెక్టర్‌ను కోరినట్లు తెలిపాడు.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

దీని గురించి సమర్పన్ కెరీర్ ఇన్‌స్ట్యూట్ డైరెక్టర్ మాట్లాడుతూ దీని గురించి మరో కథనం వల్లిస్తున్నాడు, "ప్రారంభంలో ఈ కారును తమ వద్దే ఉంచుకుంటామని తెలిపారు. తరువాత అబ్బాయి తల్లికి కిడ్నీ సమస్య కారణంగా డబ్బు అవసరమైందని తద్వారా కారును తీసుకుని దానికి సరిపడా డబ్బును ఇవ్వమని కోరుతున్నారని" చెప్పుకొచ్చాడు.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఇప్పుడు ఖరీదైన కార్లతో వల వేస్తున్నారని చెప్పవచ్చు. ర్యాంకుల, కోసం దేశంలో తమ ప్రాబల్యం కోసం స్టూడెంట్స్‌కు జర్మనీ కార్లను గిఫ్ట్‌లుగా ఇవ్వజూపి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి కోచింగ్ సెంటర్లు. ఇప్పుడు విద్యారంగంలో ఇదో నయా ట్రెండ్ అని చెప్పవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

2016 జెఇఇలో 100 లోపు ర్యాంకులు సాధించిన ఐఐటి విద్యార్థుల్లో ఈ కోచింగ్ సెంటర్ నుండి మొదటి మరియు ఏకైక విద్యార్థి తన్మయ కావడం వలన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఈ బిఎమ్‌డబ్ల్యూ కారును బహుకరించారు.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

షెఖావత్ కథ ఏమైనప్పటికీ అచ్చం ఇలాంటి సమస్యనే భారత దేశపు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా ఎదుర్కొంది. 2016 రియో ఒలంపిక్స్ లో అపూర్వ ప్రతిభ కనబరిచినందుకు బిఎమ్‌డబ్ల్యూ కారును బహుమానంగా పొందారు.

బిఎమ్‌డబ్ల్యూ కారుని తిరస్కరించిన ఐఐటి టాపర్

తను నివసించే అగర్తలా మరియు త్రిపురాలలో ఒక్క బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్ కూడా ఉండేది కాదు మరియు దీని నిర్వహణ భారం ఎక్కవ కారణంగా వెంటనే దీనిని బహుకరించిన వారికి వెనక్కిచ్చేసింది

 
English summary
IIT Topper Rejects BMW, Wants Laptop Instead — Find Out Why
Story first published: Wednesday, December 14, 2016, 20:10 [IST]
Please Wait while comments are loading...

Latest Photos