ఎలక్ట్రిక్ రైళ్ల తరహాలో నడిచే ఎలక్ట్రిక్ ట్రక్కులు ఇప్పుడు ఇండియాలో

Written By:

రైల్వే స్టేషన్‌లలో మనం తరచూ ఇలాంటి విద్యుదీకరణ చేయబడిన రైల్వే ట్రాక్‌లను చూస్తుంటాం. స్తంభాల ద్వారా విద్యుతీగలు పట్టాల వెంబడి ఉంటాయి. వాటిని రైలు మీద ఉండే ఇనుప కమ్మీలు నిరంతరం అంటి పెట్టుకుని ఉంటాయి. తద్వారా విద్యుత్ లైన్‌లో ఉండే కరెంట్ ఆ కమ్మీల ద్వారా రైలును చేరి రైలు నడవడానికి ఉపయోగపడుతాయి. అంటే రైలు మొత్తం విద్యుత్ శక్తి మీదనే ఆధారపడుతుంది నడుస్తుంది.

ఎలక్ట్రిక్ హై వే

అచ్చం ఇలాంటి దానినే స్వీడిష్ ప్రభుత్వం నిర్మించింది, అయితే రైలు పట్టాల మీద అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే పట్టాల మీద కాకుండా రహదారి మీద అలాంటి ఎలక్ట్రిక్ లైన్‌ను నిర్మించారు. వాటి ద్వారా పెద్ద పెద్ద ట్రక్కులు నడుస్తాయి.

ఎలక్ట్రిక్ హై వే

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎలక్ట్రిక్ హై వే ని దేశీయంగా నిర్మించడానికి స్వీడిష్ ప్రభుత్వం యొక్క సహకారం కోరడానికి కూడా సిద్దమైనట్లు కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపాడు.

ఎలక్ట్రిక్ హై వే

స్వీడిష్ దేశంలో ఇప్పటికే రెండు కిలోమీటర్ల మేర ఇలాంటి ట్రాఫిక్ ఫ్రీ ఎలక్ట్రిక్ రహదారిని నిర్మించింది. పెద్ద ట్రక్కులు మరియు బస్సులు ఈ విద్యుత్ తీగల ద్వారా కరెంటును పొంది నడుస్తాయి.

ఎలక్ట్రిక్ హై వే

వాహనానికి కావాల్సిన విద్యుత్‌ను పైన వ్రేలాడే తీగల ద్వారా వాహనం యొక్క ఓవర్ హెడ్ విభాగం నుండి నిరంతరం అనుసంధానంలో ఉంటుంది. తీగల నుండి విద్యుత్ వాహనంలోకి ప్రవహిస్తుంది. తద్వారా వాహనం నడవడానికి కావాల్సిన పవర్ చక్రాలకు చేరుతుంది.

ఎలక్ట్రిక్ హై వే

కాలుష్య రహిత రవాణాను అభివృద్ది చేయడానికి స్వీడిష్ ప్రభుత్వం విద్యుధీకరణ చేయబడిన రహదారులను నిర్మించింది. దీనికి కావాల్సిన మొత్తం సాంకేతిక పరిజ్ఞానం సైమెన్స్ ఎలక్ట్రిక్ ఉపకరణాల తయారీ సంస్థ అందించింది.

ఎలక్ట్రిక్ హై వే

ఈ ఎలక్ట్రిక్ జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్న సాధ్యాసాద్యాలను కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పీడిష్ దేశం యొక్క ఎంట్రప్రైస్ మరియు ఇన్నోవేషన్ మంత్రి మైకేల్ డాంబెర్గ్ తో అడిగి తెలుసుకున్నారు.

ఎలక్ట్రిక్ హై వే

భారత-స్వీడెన్ వ్యాపార దిగ్గజాలతో జరగనున్న మొదటి సమావేశంలో దీని గురించి చర్చించనున్నారు.

ఎలక్ట్రిక్ హై వే

స్వీడిష్ ఈ ఎలక్ట్రిక్ రహదారిని ప్రభుత్వ మరియు ప్రయివేట్ భాగస్వామ్యంతో నిర్మించడం జరిగింది. జాతీయ రహదారులలో ఉన్నపుడు ఎలక్ట్రిక్ లైన్ ద్వారా మరియు సాధారణ సమయాల్లో హైబ్రిడ్ పరిజ్ఞానంతో ఈ ట్రక్కులు నడుస్తాయి.

ఎలక్ట్రిక్ హై వే

ఈ ఎలక్ట్రిక్ రహదారి మీద నడిచే ట్రక్కులు మొత్తం స్కానియా సంస్థకు చెందినవే. ఇవి, హైబ్రిడ్ మరియు యూరో 6 ఉద్గార నియమాలను పాటించే బయోఫ్యూయల్ ఇంధనంతో నడిచే ఇంజన్‌లను కలిగి ఉంటాయి.

ఎలక్ట్రిక్ హై వే

స్వీడిష్ ప్రతినిధుల బృందం వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి, విద్యుత్ తీగలు ఉన్న జాతీయ రహదారి మీద ట్రక్కులు ఉన్నపుడు. వాహనం చివరి భాగంలో విద్యుత్ తీగల నుండి పవర్ ను సేకరించడానికి ప్యాంటోగ్రాప్ పవర్ కలెక్టర్ ఉంటుంది. ఇది విద్యుత్ తీగలతో నిరతరం అనుసంధానంలో ఉండి ట్రక్కు నడవడానికి సహాయపడుతుంది.

ఎలక్ట్రిక్ హై వే

విద్యుత్ లైన్ల ద్వారా ఒక్క సారి ట్రక్కు నడిస్తే ఆటోమేటిక్‌గా అంతర్గంగా ఉండే బయో ప్యూయల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో కలిసి పనిచేయడం అపేస్తుంది, అప్పుడు కేవలం ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా మాత్రమే వాహనం నడుస్తుంది.

ఎలక్ట్రిక్ హై వే

ప్రతినిధుల బృందంతో జరిగిన చర్చల అనంతరం గడ్కరీ మాట్లాడుతూ, కాలుష్య రహిత రవాణా కోసం తక్కువ ధరలో రవాణా సదుపాయాన్ని కల్పిస్తూ, ఎలక్ట్రిక్ మరియు బయో ప్యూయల్ వాహనాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపాడు.

English summary
India Might Soon Have An Electric Highway
Story first published: Wednesday, November 16, 2016, 11:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos