ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్: పూర్తి వివరాలు

By Anil

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ దేశీయ లగ్జరీ సెడాన్‌ల విపణిలోకి తమ ఎక్స్‌ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసింది. దీనిని 49.5 లక్షలు ప్రారంభం ధర ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేసింది.

దీనిని సుమారుగా 80 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశాలు ఉండేవి. అయితే ఊహించని విధంగా 49.5 లక్షల రుపాయల ధరతో విడుదల చేసింది. లగ్జరీ వసతులకు ఏ మాత్రం తీసిపోకుండా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది జాగ్వార్.

ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

  • జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.0 డీజల్ ప్యూర్ ధర రూ. 49.5 లక్షలు
  • జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.0 డీజల్ ప్రెస్టేజ్ ధర రూ. 55.9 లక్షలు
  • జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.0 డీజల్ పోర్ట్‌ఫోలియో ధర రూ. 62.10 లక్షలు
  • ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

    • జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.0 పెట్రోల్ ప్రెస్టేజ్ ధర రూ. 55.65 లక్షలు
    • జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.0 పెట్రోల్ పోర్ట్‌ఫోలియో ధర రూ. 62.10 లక్షలు
    • గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      సాంకేతికంగా చూస్తే ఇందులో 2.0 లీటర్ సామర్థ్యం గల ఇంజీనియమ్ అనే డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌లు కలవు. ఈ రెండింటికి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      జాగ్వార్ ఎక్స్ఎఫ్ లోని 2.0-లీటర్ ఇంజీనియమ్ డీజల్ ఇంజన్ సుమారుగా 177బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      జాగ్వార్‌లో ఎక్స్ఎఫ్ సెడాన్‌లో ఉన్న 2.0-లీటర్ ఇంజీనియమ్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 237బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      పనితీరు పరంగా డీజల్ ఇంజన్ ఎక్స్ఎఫ్ సెడాన్ కేవలం 8.1 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      జాగ్వార్ ఎక్స్ఎఫ్ లోని పెట్రోల్ ఇంజన్ సెడాన్ కేవలం 7 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రెండు సెడాన్‌లు కూడా రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలవు.

      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్‌లో డ్రైవర్ ఎంచుకోదగ్గ నాలుగు డ్రైవింగ్ మోడల్‌ కలవు. అవి,

      స్టాండర్డ్

      ఎకో,

      డైనమిక్,

      రెయిన్/స్నో/ఐస్

      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్‌లోని ఫీచర్లను చూస్తే, ఇందులో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, బై-ఫోకల్ జెనాన్ హెడ్ లైట్లు, ఎనిమిది లేదా పది అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు సీట్లను ఎలక్ట్రిక్ ద్వారా 14 రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం కలదు.

      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్‌ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్, ఆడి ఏ6 మరియు వోల్వో ఎస్90 లకు పోటీగా నిలిచింది.

      ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

      • దీని విడుదలతో ఈ సారి మేమే నెంబర్ వన్: హ్యుందాయ్
      • కవాసకి లోని ఆ మోడల్‌కు ఇండియాలో భలే గిరాకీ
      • మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల
      • ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్

        ఫ్రాన్స్‌లో ఉన్న ఈ రహదారి రోజులో కేవలం రెండు సార్లు మాత్రమే ఉంటుంది. మిగతా సమయంలో నీటితో కప్పబడి ఉంటుంది. రెండు ద్వీపాలను కలిపే ఈ రహదారి మిగిలిన సమయంలో 13 అడుగుల మేర మునిగిపోతుంది. సహజ సిద్దంగా జరిగే ఈ చర్య అద్బుతం కదా....?

Most Read Articles

English summary
Read In Telugu: Jaguar Launches The New XF Sedan In India — Here’s More Details
Story first published: Thursday, September 22, 2016, 13:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X