పది లక్షలలోపు ధరతో జీప్ నుండి కాంపాక్ట్ ఎస్‌యువి

Written By:

అమెరికా ఆధారిత ప్రముఖ ఖరీదైన ఎస్‌యువి వాహనాల తయారీ సంస్థ జీప్ ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి పరిచయం అయ్యింది. అయితే దేశీయంగా రెనో డస్టర్ మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఎస్‌యువిలు సాధిస్తున్న విజయాన్ని దృష్టిలో ఉంచుకుని విపణిలోకి 10 లక్షలలోపు ధరతో సరికొత్త ఎస్‌యువిని విడుదల చేస్తామని ప్రకటించింది.

జీప్ సంస్థ అధ్యక్షుడు మైక్ మేన్లీ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జీప్ సంస్థ ఎదుర్కుంటున్న సమస్యాత్మక మార్కెట్లలో ఇండియన్ మార్కెట్ ఒకటని తెలిపాడు.

దేశీయంగా విజయాన్ని అందుకోవడానికి టాటా మోటార్స్ తో చేతులు కలపడానికి జీప్ సంస్థ సిద్దంగా ఉన్నట్లు అతను విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. టాటాతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇంజన్, ట్రాన్స్‌మిషన్, ఇతర సాంకేతిక సహకారంతో పాటు మార్కెటింగ్ వంటి అవసరాలను తీర్చుకోనుంది.

ప్రస్తుతం వాహన పరిశ్రమకు మంచి అవకాశాలున్న చైనా, బ్రెజిల్, ఇండియాతో పాటు మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఆధిపత్యం కోసం జీప్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఇండియా కోసం జీప్ ప్రమాణం చేసిన చిన్న ఎస్‌యువి ఇంకా డ్రాయింగ్ టేబులు మీదనే ఉంది. ఇది అందుబాటులోకి వస్తే జీప్ ఫోర్ట్‌ఫోలియోలోనే అతి చిన్న ఎస్‌యువిగా నిలవనుంది.

జీప్ సంస్థ తమ చిన్న ఎస్‌యువిని ముఖ్యంగా రెనో డస్టర్ మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఎస్‌యువిలకు దగ్గర పోలికలతో రానుంది. ముఖ్యంగా ఫోర్డ్ కాంపాక్ట్ ఎస్‌యువి మీద ఎక్కువ శ్రద్ద చూపుతున్నట్లు సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ రోడింగ్ వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాల్లో జీప్ సంస్థకు మంచి రికార్డులే ఉన్నాయి. గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల ఆఫ్ రోడ్ వాహనాలను విక్రయించింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ మీద జీప్ సంస్థ దృష్టి పెట్టింది.

మైక్ మైన్లీ చేసిన సూచనల ప్రకారం ఇండియన్ మార్కెట్లో ఉన్న టాటా మోటార్స్ లేదా టాటా చెందిన ల్యాండ్ రోవర్ సంస్థతో జట్టు కట్టి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మైన్లీ తన మాటల్లో టాటా గురించి ఇలా అన్నాడు, " జీప్ సంస్థ ఇండియ్ మార్కెట్లో ఉన్న టాటా మోటార్స్ తో మంచి సంభాదాన్ని కలిగి ఉంది, టాటా మోటార్స్ తో కలిసి పనిచేసి మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాం అని స్వయంగా తెలిపాడు.

 

Read more on: #జీప్ #jeep
English summary
Jeep To Launch Compact SUV For Under Rs 10 Lakh In India
Story first published: Monday, November 21, 2016, 19:11 [IST]
Please Wait while comments are loading...

Latest Photos