ఇండియన్ మార్కెట్లోకి లెక్సస్ కార్ల విడుదల వివరాలు

Written By:

టయోటా మోటార్స్ అనుబంధ సంస్థ జపాన్‌కు చెందిన లెక్సస్ 2017 ఏడాదితో దేశీయంగా తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే కొన్ని కార్లు దేశీయంగా అక్కడక్కడ కెమరాల కంటికి చిక్కుతున్న. రహదారుల మీద వీటికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 2017 నాటికి పూర్తి స్థాయిలో లెక్సస్ తమ ఉత్పత్తులను విడుదల చేయనుందనే సమాచారం కూడా నెట్టింట్లో తెగ చక్కర్లుకొడుతోంది.

లెక్సస్ కార్ల విడుదల వివరాలు

లెక్సస్ దేశీయంగా ఇప్పటికే సుమారుగా 50 నుండి 60 కార్లను దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. తక్కువగా ఉన్న తమ డీలర్ల వద్దకు వాటిని చేర్చింది. కస్టమర్ల ప్రదర్శనకు మరియు ఆసక్తి ఉన్న కస్టమర్లకు టెస్ట్ డ్రైవ్ అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

లెక్సస్ కార్ల విడుదల వివరాలు

లెక్సస్ ముందుగా తమ ఆర్ఎక్స్450హెచ్ మరియు ఇఎస్300హెచ్ మోడళ్లను మార్చి 2017 నాటికి విపణిలోకి విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది. మొదటి రెండు ఉత్పత్తులు కూడా హైబ్రిడ్ కార్లే. అదే మార్చిలోనే డీలర్ షిప్‌లను ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లెక్సస్ కార్ల విడుదల వివరాలు

మొదటి దశలో దేశవ్యాప్తంగా నాలుగు షోరూమ్‌లను ప్రారంభించనుంది. వీటిని ముంబాయ్, బెంగళూరు మరియు కేంద్ర రాజధాని ఢిల్లీ లో రెండు షోరూమ్‌లను ప్రారంభించనుంది. ప్రస్తుతం టయోటా డీలర్లను భవిష్యత్తులో భాగస్వామ్యంగా ఎంచుకోవడానికి లెక్సస్ సుముఖత చూపే అవకాశం ఉంది.

లెక్సస్ కార్ల విడుదల వివరాలు

లెక్సస్ ఓ ప్రకటనలో తెలిపిన వివరాల మేరకు తమ రెండు కొత్త ఉత్పత్తులను తమ నూతన షోరూమ్‌ల నుండే అందుబాటులోకి తీసుకురానుంది. మరియు వీటి కోసం సర్వీసింగ్ బే లను కూడా ఏర్పాటు చేయనుంది.

లెక్సస్ కార్ల విడుదల వివరాలు

2017 చివరి నాటికి లెక్సస్ మరిన్ని ఉత్పత్తులను విడుదల చేయనుంది. అందులో ముఖ్యంగా ఎల్ఎక్స్450 డీజల్, ఎల్ఎక్స్570 పెట్రోల్ మరియు ఎన్ఎక్స్ వంటి ఉత్పత్తులు వరుసలో ఉన్నాయి. అయితే లెక్సస్ లోని ఆర్‌సి ఎఫ్ స్పోర్ట్స్ కారు విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

లెక్సస్ కార్ల విడుదల వివరాలు

ప్రారంభంలో లెక్సస్ అన్ని కార్లను కూడా కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా దిగుమతి చేసుకోనుంది. కాబట్టి వీటి ధరలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఆర్ఎక్స్ 450హెచ్ ధర అంఛనా రూ. 90 లక్షలు మరియు ఇఎస్300హెచ్ ధర అంఛనా రూ. 60 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది.

లెక్సస్ కార్ల విడుదల వివరాలు

2016 లో విపణిలోకి విడుదలైన అత్యుత్తమ కార్లు:

2016 ఏడాదిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన అత్యుత్త కార్లు - దేశీయ ఆటోమొబైల్ అమ్మకాల మీద అత్యంత ప్రభావం కనబరిచిన కార్లకు గురించిన ప్రత్యేక జాబితా...

 
English summary
Lexus To Launch Its Cars In India In March 2017
Story first published: Monday, December 26, 2016, 18:56 [IST]
Please Wait while comments are loading...

Latest Photos