రహస్యంగా వచ్చిన లగ్జరీ లెక్సస్

Written By:

జపాన్‌కు చెందిన అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ప్రతి సారి ఇండియాకు వస్తున్నానే సమచారం ఇచ్చి రాకుండా ఉసూరుమనిపించేది. అయితే ఎట్టకేలకు తమ మొదటి ఉత్పత్తిని దేశీయంగా దిగుమతి చేసుకుంది. లెక్సస్ మాతృ సంస్థ టయోటా మోటార్స్ సహకారంతో దేశీయంగా మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి సంస్థలపై పోరుకు సిద్దమవుతోంది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్

జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ వచ్చే ఏడాది నుండి దేశీయంగా తమ ఉత్పత్తులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్

దేశీయంగా ఢిల్లీ మరియు ముంబాయ్ నగరాలలో రెండు ప్రాథమిక షోరూమ్‌లను ప్రారంభించనుంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వివిద రకాల పరీక్షలు నిర్వహిస్తోంది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్

తాజాగా లెక్సస్ దిగుమతి చేసుకున్న 450హెచ్ కారు ద్వారా విడుదలకు సమయం ఆసన్నమైంది అనే ఆధారాన్నిస్తోంది. ఇది దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్

ప్రస్తుతం లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్‌లో హైబ్రిడ్ సాంకేతికత గల ఇంజన్‌ను అందివ్వనున్నారు (కారణం 450హెచ్‌లో హెచ్ అనగా హైబ్రిడ్ అనే ఉద్దేశ్యంతో).

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్

3.5-లీటర్ సామర్థ్యం గల వి6 విటివిటి-ఐ పెట్రోల్ ఇంజన్‌కు ఎక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానం చేస్తారు. ఈ రెండింటిని సమ్మేళనాన్ని హైబ్రిడ్ అంటారు. ఇది సుమారుగా 308బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్

డిజైన్ పరంగా ముందు వైపున పెద్ద ఫ్రంట్ గ్రిల్, విశాలమైన బ్యానెట్, కోణీయంగా ఉన్న ఫ్రంట్ ప్యానెల్స్, ఆధుక హంగులతో రహదారుల్లో ఉన్న ఇతర ఉత్పత్తులకు ఏ విధమైన పోలికలేనటువంటి ఆకృతిలో ఉంది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్

క్షణ కాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

  
English summary
Read In Telugu: Spy Pics: Lexus RX450h SUV Spotted In India Ahead Of Launch
Story first published: Wednesday, October 12, 2016, 18:28 [IST]
Please Wait while comments are loading...

Latest Photos