సంచలన నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు

జాతీయ మరియు రాష్ట్రీయ రహదారుల వెంబడి ఉన్న అన్ని మద్య దుకాణాలను తొలగించాలని భారత సర్వోన్నత న్యాస్థానం సంచలన తీర్పును వెలువరించింది.

By Anil

కేంద్ర మరియు రాష్ట్ర ఆర్థిక శాఖలకు అతి ముఖ్యమైన ఆదాయ వనరుల్లో "మద్య విక్రయం" ప్రధాన ఆదాయ వనరు. ఈ కారణం చేత అనేక ప్రభుత్వాలు మద్యానికి సంభందించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటాయి. అయితే భారత సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు మద్యం విషయంలో సంచలనాత్మక తీర్పును వెలువరించింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

జాతీయ మరియు రాష్ట్రీయ రహదారుల వెంబడి ఉండే మద్యం దుకాణాలను తొలగించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును దేశీయంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు గాడిలో పెడతాయో వేచి చూడాలి మరి.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

ఇంతకీ సుప్రీం కోర్టు ఈ తీర్పునివ్వడం వెనకున్న కారణం ఏమిటో తెలుసా...? మద్యం సేవించి వాహనాలను నడిపే కేసులను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ తీర్పును వెలువరించింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

సర్వోన్నత న్యాయస్థానంలోని జస్టిస్ టిఎస్ థాకుర్ నేతృత్వంలోని ధర్మాసనం, జాతీయ రహదారులకు సుమారుగా 500 మీటర్ల దూరం వరకు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకూడదని గురువారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

మద్యం దుకాణాల ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టు వెల్లడించిన బ్యాన్ ఏప్రిల్ 2017 నుండి అమలు కానుంది. మరియు రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాలు రెన్యువల్‌ను మార్చి 2017 నుండి నిలిపివేయాలని ఈ మేరకు సూచించింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న రహదారుల మద్యం దుకాణాలను మరియు బార్లను సూచించే అన్ని రకాల బ్యానర్లను మరియు బోర్డులను తొలగించాలని ధర్మాసనం సూచించింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

మద్యానికి సంభందించిన చట్టాల్లో మార్పులు తేవాలని దాఖలైన పిటిషన్లకు గాను రహదారుల వెంబడి కాకుండా రహదారులకు సూచించిన దూరంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సుప్రీం కోర్టు వెల్లడించింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

రహదారుల వెంబడి మద్యం దుకాణాలు కనిపించడం ద్వారా వాహనదారులు మరియు డ్రైవర్ల మద్యం సేవించి ప్రమాదాలకు కారణవుతున్నారని సుప్రీం కోర్టు తెలిపింది. మరియు మద్యం దుకాణాలను సూచించే బోర్డ్‌లు ఉండటం ద్వారా కూడా మద్యాన్ని సేవించే వారికి మార్గం సుగమం చేసినట్లవుతుందని వాటిని తొలగించాలని తెలిపింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

ఎక్సైజ్ చట్టాలను సవరణ చేయాలని దాఖలైన పిటిషన్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా రోజుకు 1,400 రోడ్డు ప్రమాదాలు చోటు చోసుకుంటున్నాయని, అందులో 400 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. అంటే సగటున గంటకు 17 మంది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా మరణిస్తున్నారని తెలిసింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

రహదారుల మీద మద్యం దుకాణాల తొలగింపు, మద్యం దుకాణాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించే భాద్యతలను చీఫ్ సెక్రటరీలు మరియు ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది.

జాతీయ రహదారుల మీద వైన్‌ షాపులను తొలగించండి

  • చుక్కలనంటుతున్న హోండా కార్ల ధరలు
  • ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి ?
  • విదేశాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్ వాడితే ఇవి పాటించండి

Most Read Articles

English summary
No Liquor Shops On National And State Highways: Supreme Court
Story first published: Monday, December 19, 2016, 16:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X