మహీంద్రా కెయువి100 కు జిరాక్స్ కాపీగా మారుతి ఇగ్నిస్

By Anil

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్‌యువిల సెగ్మెంట్లో మహీంద్రా ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. వివిధ రకాలలో ఎస్‌యువిలను అందించడం ద్వారా ఎస్‌యువి వాహనాల స్పెషలిష్ట్‌గా నిలుస్తోంది. వీరి అధునాతన ఉత్పత్తులలో కెయువి100 ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలో కెయువి100 ను అందుబాటులోకి తీసుకువచ్చింది మహీంద్రా అప్పటి నుండి అమ్మకాల పరంగా ఎంతో ఉత్తమంగా నిలిచింది.

క్రాసోవర్‌గా పరిచయం అయిన ఈ కెయువి100 కి పోటీగా దేశీయ అతి పెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సరికొత్త ఇగ్నిస్ క్రాసోవర్‌ను రూపొందిస్తోంది. క్రాసోవర్ సెగ్మెంట్ శైలిని పోలి ఉండే డిజైన్‌తో రానున్న దీనిని కెయువి100తో పోల్చి చూస్తే, కెయువి100 యొక్క జిరాక్స్ కాపీగా ఇగ్నిస్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 ధర వివరాలు

ధర వివరాలు

  • మహీంద్రా కెయువి100 ధర రూ. 4.57 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.
  • మారుతి సుజుకి ఇగ్నిస్ ధర రూ. 4.5 లక్షలు (అంచనాగా)
  • మహీంద్రా కెయువి100 డిజైన్

    మహీంద్రా కెయువి100 డిజైన్

    ఎస్‌యువినే కొంచెం చిన్నగా కుదించి డిజైన్ చేస్తే క్రాసోవర్ పేరు వస్తుంది అనే భావనతో డిజైన్ చేసినట్లు ఉంది. తమ ఎక్స్‌యూవీ500 ఆధారంగా రూపొందించినట్లు అనిపిస్తుంది. దానిలాగే అన్ని వైపులా కొన్ని ప్రత్యేకమైన గీతలను కల్పించారు. ప్రత్యేక ఛాసిస్ మరియు నాలుగు వైపులా ప్లాస్టిక్ క్లాడింగ్ దీనికి మరింత ఆకర్షణగా నిలిచింది. దీని విడుదల తరువాత మహీంద్రా వారి బెస్ట్ సెల్లింగ్ వాహనం బొలెరో అమ్మకాలను అధిగమించింది ఈ కెయువి100.

    మారుతి సుజుకి ఇగ్నిస్ డిజైన్

    మారుతి సుజుకి ఇగ్నిస్ డిజైన్

    మారుతి సుజుకి తమ పురాతణ కాలంనాటి బాక్సీ డిజైన్ అందించినట్లుంది. కాని కొన్ని అధునాతన మెరుగులు దిద్దడం వలన డిజైన్‌లో కొంత మార్పును గుర్తించగలుగుతున్నాం. ఇగ్నిస్‌ క్రాసోవర్‌ను మారుతి సుజుకి కొత్త వేదిక మీద అభివృద్ది చేసింది. తద్వారా ఇది 30 శాతం అదనపు ధృడంగా మరియు 15 శాతం తక్కువ బరువుతో రూపుదిద్దుకుంది.

    మహీంద్రా కెయువి100 సాంకేతిక వివరాలు

    మహీంద్రా కెయువి100 సాంకేతిక వివరాలు

    మహీంద్రా అండ్ మహీంద్రా నూతనంగా పరిచయం చేసిన ఈ కెయువి100 క్రాసోవర్‌‌లో అత్యాధునిక పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేశారు.

    • పెట్రోల్: mFALCON< G80
    • ఇంజన్ సామర్థ్యం: 1198 సీసీ
    • అత్యధిక పవర్: 82(61) bhp(kw)@5500 rpm
    • గరిష్ఠ టార్క్: 115@3500-3600 Nm@rpm
    • ట్రాన్స్‌మిషన్: 5 స్పీడ్ మ్యాన్యువల్
    • మైలేజ్: 18.1 కిమీ/లీ
    • బూట్ స్పేస్: 243 లీటర్లు
    • గ్రౌండ్ క్లియరెన్స్: 170ఎమ్ఎమ్
    • మహీంద్రా కెయువి100 సాంకేతిక వివరాలు

      మహీంద్రా కెయువి100 సాంకేతిక వివరాలు

      మహీంద్రా కెయువి100 లో డీజల్ ఇంజన్‌ను కూడా అందించారు.

      • డీజల్: mRALCON, D75
      • ఇంజన్ సామర్థ్యం:1198సీసీ
      • అత్యధిక పవర్: 77(57) bhp(kw)@3750 rpm
      • గరిష్ఠ టార్క్: 190 @1750-2250 Nm@rpm
      • ట్రాన్స్‌మిషన్: 5 స్పీడ్ మ్యాన్యువల్
      • మైలేజ్: 25.3 కిమీ/లీ
      • బూట్ స్పేస్: 243 లీటర్లు
      • గ్రౌండ్ క్లియరెన్స్: 170ఎమ్ఎమ్
      •  మారుతి సుజుకి ఇగ్నిస్ పెట్రోల్ ఇంజన్ వివరాలు

        మారుతి సుజుకి ఇగ్నిస్ పెట్రోల్ ఇంజన్ వివరాలు

        • ఇంజన్ సామర్థ్యం: 1.2 లీటర్
        • పవర్: 83 బిహెచ్‌పి
        • టార్క్: 115ఎన్ఎమ్
        • ట్రాన్స్‌మిషన్: 5 స్పీడ్ మ్యాన్యువల్
        • మైలేజ్: 20 కిమీ/లీ
        • బూట్ స్పేస్: 258 లీటర్లు
        • గ్రౌండ్ క్లియరెన్స్: 180ఎమ్ఎమ్
        •  మారుతి సుజుకి ఇగ్నిస్ డీజల్ ఇంజన్ వివరాలు

          మారుతి సుజుకి ఇగ్నిస్ డీజల్ ఇంజన్ వివరాలు

          • ఇంజన్ సామర్థ్యం: 1.3 లీటర్
          • పవర్: 74 బిహెచ్‌పి
          • టార్క్: 190ఎన్ఎమ్
          • ట్రాన్స్‌మిషన్: 5 స్పీడ్ మ్యాన్యువల్
          • మైలేజ్: 25 కిమీ/లీ
          • బూట్ స్పేస్: 258 లీటర్లు
          • గ్రౌండ్ క్లియరెన్స్: 180ఎమ్ఎమ్
          • మహీంద్రా కెయువి100 ఫీచర్లు

            మహీంద్రా కెయువి100 ఫీచర్లు

            • పగటి పూట వెలిగే లైట్లు,
            • 3+3 సీటింగ్ సామర్థ్యం,
            • డ్యాష్ బోర్డ్ అనుసంధానంతో ఉన్న గేర్‌ లీవర్,
            • పియానో బ్లాక్ రంగుల్లో తొడుగులు,
            • మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్,
            • బ్లూటూత్ కనెక్టివిటి,
            • ప్రక్కట్టద్దాల క్రింద ఉన్న లైట్లు (పడ్డిల్ లైట్లు),
            • డ్రైవ్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే వెసులు బాటు,
            • పవర్ విండోలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
            • మారుతి సుజుకి ఇగ్నిస్‌లోని ఫీచర్లు

              మారుతి సుజుకి ఇగ్నిస్‌లోని ఫీచర్లు

              • ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,
              • క్లైమేట్ కంట్రోల్,
              • స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్,
              • లెథర్ అప్‌హోల్ట్సే,
              • పవర్ విండోలు,
              • పగటి పూట వెలిగే లైట్లు,
              • ప్రొజెక్టెడ్ హెడ్‌ల్యాంప్స్
              •  మహీంద్రా కెయువి100 భద్రత ఫీచర్లు

                మహీంద్రా కెయువి100 భద్రత ఫీచర్లు

                మహీంద్రా వారి కెయువి100 లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు రెండు ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్‌గా అందించారు. మరియు టాప్ ఎండ్ వేరియంట్లో నాలుగు ఎయిర్ బ్యాగులను అందించారు.

                 మారుతి సుజుకి ఇగ్నిస్‌ భద్రత ఫీచర్లు

                మారుతి సుజుకి ఇగ్నిస్‌ భద్రత ఫీచర్లు

                కాన్సెప్ట్‌గా ఇగ్నిస్‌ను ప్రదర్శించినపుడు ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు డ్రైవర్ ప్రక్క వైపుల ఎయిర్ బ్యాగును అందించారు. దీని విడుదల తరువాత ఇందులోని మొత్తం భద్రత ఫీచర్లు వెల్లడించనుంది మారుతి.

                తీర్పు

                తీర్పు

                ఉత్తమ క్రాసోవర్‌ కొనాలి అంటే ప్రస్తుతం ఉన్న ఏకైక మోడల్ కెయువి100. ఫీచర్లు ఇంజన్, మైలేజ్, ధర మరియు డిజైన్ పరంగా ఫర్వాలేదనిపిస్తుంది.

                ఇగ్నిస్ కూడా డిజైన్ పరంగా బాగా నమ్మదగిన ఉత్పత్తి మారుతి దీనిని నెక్సా ద్వారా కాకుండా సాధారణ షోరూమ్‌ల నుండి అందిస్తే వితారా బ్రిజా తరహా విజయం ఖాయం.

                మహీంద్రా కెయువి100 Vs మారుతి సుజుకి ఇగ్నిస్

                డాట్సన్ రెడి గొ గురించి మీకు తెలియని పది ముఖ్యమైన విషయాలు

                బ్రిజా ముందు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఆటలు ఇక మీదట సాగవు

Most Read Articles

English summary
Maruti Suzuki Ignis vs Mahindra KUV100 - Compact Crossover Comparison
Story first published: Tuesday, June 28, 2016, 16:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X