ఇండియన్ ఇగ్నిస్‌లో హైబ్రిడ్ టెక్నాలజీ

మారుతి సుజుకి నుండి ఇండియన్ మార్కెట్లోకి విడుదలవ్వడానికి సిద్దంగా ఉన్న కారు ఇగ్నిస్.అంచనాలను మించిన ఫలితాలను సాధించేందుకు మారుతి ఇందులో హైబ్రిడ్ సాంకేతికత గల ఇంజన్‌ను పరిచయం చేయనుంది.

By Anil

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఇగ్నిస్ మిని ఎస్‌యువిని ప్రదర్శించింది. తాజా నివేదికల ప్రకారం ఇగ్నిస్‌ను స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ఫ్రమ్ సుజుకి (SHVS) మిల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ ను ప్రవేశపెట్టి మార్కెట్లోకి విడుదల చేయడానికి సుజుకి సన్నాహాలు చేస్తోంది. ఈ మిల్డ్ హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సాధారణ మైలేజ్ కాస్త రెట్టింపు అవుతుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి తమ ఇగ్నిస్‌లో హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లింపు మినహాయింపు అవుతుంది. గతంలో మారుతి తెలిపిన ఓ కథనం మేరకు భవిష్యత్తులో తమ చిన్న కార్లలో తక్కువ ధర గల హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేయనున్నట్లు తెలిపింది.

మారుతి సుజుకి ఇగ్నిస్

జపాన్ మరియు యూరోపియన్ మార్కెట్లలో విడుదలవుతున్న ఇగ్నిస్‌లో ఎస్‌హెచ్‌విఎస్ హైబ్రిడ్ టెక్నాలజీ గల వేరియంట్లను పరిచయం చేయనుంది మారుతి. అయితే దేశీయంగా విడుదలయ్యే హైబ్రిడ్ ఇగ్నిస్ కార్లు అదే తరహాలో ఉండనున్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్

జపాన్ మరియు యూరోపియన్ మార్కెట్లలలో విడుదలయ్యే ఇగ్నిస్‌ హైబ్రిడ్ వేరియంట్లలో 1.25-లీటర్ సామర్థ్యం గల ఇంజన్‌ అందివ్వనున్నారు.

మారుతి సుజుకి ఇగ్నిస్

దేశీయంగా పరిచయమయ్యే ఇగ్నిస్‌లో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లు రానున్నాయి. వీటికి మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గల రెండు రకాల గేర్‌బాక్స్‌లు పరిచయం కానున్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్

పలు మార్లు ప్రదర్శించబడిన ఇగ్నిస్‌లో డిజైన్ పరంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకోలేదు. బాలెనోని రూపొందించిన అదే లైట్ వెయిట్ ఫ్లాట్‌ఫామ్ మీద ఇగ్నిస్ ను అభివృద్ది చేశారు.

మారుతి సుజుకి ఇగ్నిస్

దేశీయంగా బాక్సీ డిజైన్ ఆకారంలో ఉన్న కార్లకు డిమాండ్ బాగానే ఉంది. అందుకు ఉదాహరణ వ్యాగన్ ఆర్ అని చెప్పవచ్చు.

మారుతి సుజుకి ఇగ్నిస్

ఈ బాక్సీ డిజైన్ ఇగ్నిస్‌లో స్పోర్టివ్ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు, రూఫ్ రెయిల్స్, ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ మరియు అల్లాయ్ వీల్స్ వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్

ఇంటీరియర్ పరంగా సరికొత్త ఇగ్నిస్‌లో నూతన స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

మారుతి సుజుకి ఇగ్నిస్

ఐదు మంది సౌకర్యవంతంగా ప్రయాణించే వీలును కల్పిస్తూ 5-సీటింగ్ కోసం విశాలమైనబాడీ లేఅవుట్ ను నిర్మించింది. ఇది మహీంద్రా వారి కెయువి100 మోడల్‌కు సరాసరి పోటీనివ్వనుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి తమ ఇగ్నిస్ క్రాసోవర్ ఎస్‌యువి వేరియంట్లలో సరసమైన ధరతో హైబ్రిడ్ సాంకేతికతను పరిచయం చేస్తే మారుతి సుజుకి యొక్క మరో బెస్ట్ సెల్లింగ్ కార్ల విభాగంలోకి తప్పకుండా చేరిపోతుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్

  • ఇగ్నిస్ ను విడుదల కంటే ముందుగా డెలివరీ ఇవ్వనున్న సుజుకి
  • ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన టక్సన్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు విడుదల వివరాలు
  • మారుతి సుజుకి ఇగ్నిస్

    • జపనీస్ బ్యూటీ కోసం 2 కోట్లు వెచ్చిస్తున్న బాలీవుడ్ నటుడు
    • రోజులు దగ్గరపడుతున్నాయ్...!!
    • సరిగ్గా 5 లక్షల బడ్జెట్లో కారు కావాలా...?

Most Read Articles

English summary
Maruti Suzuki Ignis Likely To Get Mild Hybrid System
Story first published: Tuesday, November 15, 2016, 10:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X