మారుతి నుండి స్మాల్ కారు

మారుతి సుజుకి రానున్న మూడేళ్లలోపు ఇండియన్ మార్కెట్లోకి చిన్న కారును విడుదల చేయనుంది.

By Anil

మారుతి సుజుకి ఈ మధ్య కాలంలో పెద్ద మోడళ్లయిన వితారా బ్రిజా, సియాజ్ మరియు బాలెనో లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చిన్న కార్ల అభివృద్ది మరియు తయారీ మీద మారుతి దృష్టిసారిస్తోంది.

మారుతి చిన్న కారు

కాంపాక్ట్ సెడాన్, సెడాన్, మరియు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లలో మారుతి గట్టి పునాదులను నిర్మించుకుంది. అయితే మారుతిని మొదటి స్థానంలో నిలబెట్టిన చిన్న కార్ల సెగ్మెంట్లో పట్టును కోల్పోకుండా స్మాల్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయడానికి సిద్దమయ్యింది.

మారుతి చిన్న కారు

ఇండియన్ మార్కెట్లో వితారా బ్రిజా మంచి విజయాన్ని అందుకున్న తరువాత దేశీయ విపణిలో నెక్ట్స్ జెన్ ఆల్టో ను అభివృద్ది చేయడానికి సుజుకి మోటార్ కంపెనీ యొక్క దేశీయ భాగస్వామ్యం మారుతికి సూచించింది.

మారుతి చిన్న కారు

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఆయుకవా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ విపణిలో ఉన్న ఎంట్రీ లెవల్ కార్ మార్కెట్లో చిన్న కారును అభివృద్ది చేస్తున్నట్లు మరియు వచ్చే 2-3 సంవత్సరాల్లోపు దానిని విడుదలకు సిద్దం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశాడు.

మారుతి చిన్న కారు

మారుతి ఇండియా లైనప్‌లో ఉన్న ఆల్టో రెనో క్విడ్ నుండి గట్టి పోటీని ఎదుర్కుంటోంది. మారుతి ఆల్టో అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సంలో మొదటి నెల అమ్మకాలతో పోల్చుకుంటే ప్రస్తుతం వీటి విక్రయాలు 7.4 శాతం తక్కువగా నమోదయ్యాయి.

మారుతి చిన్న కారు

ఎంట్రీ లెవల్ మార్కెట్లో ఆల్టో అమ్మకాలన్నింటిని క్విడ్ తినేస్తోంది. ఏప్రిల్ మరియు ననంబర్ ఆర్థిక త్రైమాసికాల్లో ఆల్టో విక్రయాలు 42 శాతం పడిపోయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

మారుతి చిన్న కారు

ప్రస్తుతం మారుతి రహస్యంగా అభివృద్ది చేస్తున్న స్మాల్ కారుకు వై1కె అనే కోడ్ పేరును కూడా నిర్ణయించినట్లు తెలిసింది. మరియు దీనిని సరాసరి క్విడ్‌కు పోటీగా డెవలప్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

మారుతి చిన్న కారు

ఆధునిక ప్రమాణాలను పాటించేందుకు తరువాత తరం ఆల్టో కారును నూతన ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేస్తోంది మారుతి. మరియు దీనిని 2019 ఏడాదిలో పండుగ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో అమ్మకాలు సిద్దం చేయనుంది.

మారుతి చిన్న కారు

హర్యాణా రాష్ట్రంలోని రోహ్తక్‌లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ సెంటర్ మీద మారుతి సుజుకి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వచ్చే మూడేళ్లలోపు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ‌ను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయనున్నట్లు తెలిసింది.

మారుతి చిన్న కారు

మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ మట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాలను ఎంచుకునే ట్రెండ్ చాలా వరకు మారిపోయింది. నవంబర్‌లో పెద్ద పాత నోట్ల రద్దు కారణంగా 20 శాతం బుకింగ్స్ కోల్పోయాము అయితే డిసెంబర్‌లో బుకింగ్స్ 7 శాతం వరకు పెరిగినట్లు ఆయన వెల్లడించారు.

మారుతి చిన్న కారు

ఈ ఆర్థిక సంవత్సరంలో వర్షపాతం బాగుండటం ద్వారా ప్రాంతీయంగా మారుతి మంచి అమ్మకాలను నమోదు చేసుకుంది. మరియు నోట్ల రద్దు అనంతరం ఇప్పుడు కొత్త నోట్ల లభ్యత బాగుండటం కూడా బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటానికి కారణం అని భార్గవ అన్నారు.

మారుతి చిన్న కారు

  • టయోటా నుండి మరో సంచలనాత్మక మోడల్: ఇన్నోవా క్రిస్టా వెంచురర్
  • టాటా హెక్సా విడుదల, బుకింగ్ మరియు డెలివరీ వివరాలు
  • విజయ పథంలో టయోటా ఫార్చ్యూనర్: ధర ఏ మాత్రం సమస్య కాదంట

Most Read Articles

English summary
Maruti Suzuki Plans To Launch New Small Car Within Three Years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X