విడుదలకు సిద్దమైన మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి సుజుకి 2017 నాటికి స్విఫ్ట్ స్పోర్ట్ రెగ్యులర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

By Anil

ఇంటర్నెట్లో చక్కర్లు కొడతున్న సమచారం ప్రకారం మారుతి సుజుకి తమ తరువాత తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను స్పోర్ట్ వేరియంట్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. 2017 నాటికి ఈ స్విప్ట్ స్పోర్ట్, రెగ్యులర్ వేరియంట్‌ లను విడుదల చేయనున్నట్లు ఆధారం లేని వార్తలు వెల్లువెత్తున్నాయి. ఈ తరుణంలో దీనికి సంభందించిన ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు క్లుప్తంగా....

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి సుజుకి 2005 లో తమ మొదటి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను పరియం చేసింది. అప్పటి నుండి నేటి వరకు అనేక మెరుగులు దిద్దుకుంటూ ఎన్నో రకాల ఫేస్‌లిఫ్ట్‌ల రూపంలో ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల అవుతూనే వచ్చింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

ఇన్నేళ్ల కాలంలో స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్ తయారీ మరియు అమ్మకందారు మారుతి దీనిని స్పోర్టివ్ రూపంలో రూపొందించి అందుబాటులోకి తెచ్చిన పాపాన పోలేదు. అయితే ఇప్పుడు మేలుకున్న మారుతి స్పోర్ట్ ఉత్పత్తుల మీద ఉన్న డిమాండ్ దృష్ట్యా స్విఫ్ట్‌ను స్పోర్టివ్‌ వేరియంట్లో విడుదల చేయనుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

గత కొన్నేళ్ల కాలం నుండి భారతీయ యువ కొనుగోలు దారులు స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌లను అమితంగా ఎంచుకుంటున్నారు. అందులో ఫియట్ అబర్త్ పుంటో మరియు వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ వంటి ఉత్పత్తులు మంచి ఫలితాలను సాధించాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి సుజుకి 2017 నాటికి స్విఫ్ట్ స్పోర్ట్ వేరియంట్‌తో సాధారణ అప్‌డేటెడ్ మోడల్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు వైఎస్‌డి అనే కోడ్‌ పేరును ఖరారు చేసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కన్నా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. వితారా బ్రిజా మోడల్‌కు డిజైన్ ఫ్లోటింగ్ రూఫ్‌ను ఇందులో కూడా పరిచయం చేస్తోంది మారుతి.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

కలర్ ఫుల్ ఇంటీరియర్, స్టైలిష్ స్టీరింగ్ వీల్ మరియు రెండు ఎగ్జాస్ట్ పైపులతో రానుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

ఇందులో ముందు వైపున బాలెనొ ప్రేరిత హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ ల్యాంప్స్ మరియు పగట పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు కలవు.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

సాంకేతికంగా ఇందులో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న డైరెక్ట్ ఇంజెక్షన్ బూస్టర్ జెట్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

స్విఫ్ట్ స్పోర్ట్‌లోని పెట్రోల్ ఇంజన్ 1,500ఆర్‌పిఎమ్ వద్ద 138బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యుల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి సరికొత్త 2017 స్విప్ట్ స్పోర్ట్ వేరియంట్ కేవలం 9 సెకండ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి సుజుకి ఈ 2017 స్విప్ట్ స్పోర్ట్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్‌ను మనేసర్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి సుజుకి ఈ స్విఫ్ట్ స్పోర్ట్ ను 2017 మార్చిలో జరగనున్న 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

  • 2017 ర్యాపిడ్ విడుదలకు వేదిక సిద్దం చేసిన స్కోడా ఇండియా
  • టైగర్ ఎడిషన్ అవతారంలో స్విఫ్ట్: 100 మందికి మాత్రమే
  • ఒక లక్ష మైలు రాయిని దాటిన మారుతి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Swift Sport Launch India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X