2017 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల: ప్రారంభ ధర రూ. 49.10 లక్షలు

రేంజ్ రోవర్ ఇండియన్ మార్కెట్లోకి 2017 ఎవోక్ ను విడుదల చేసింది. ఎంబర్ అనే పేరుతో స్పెషల్ ఎడిషన్‌న కూడా విడుదల చేసింది. 2017 ఎవోక్ ప్రారంభ ధర రూ. 49.10 లక్షలుగా ఉంది.

By Anil

బ్రిటీష్‌ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ ఇండియన్ మార్కెట్లోకి 2017 ఎవోక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ 2017 ఎడిషన్‌తో పాటు ఎంబర్ అనే స్పెషల్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ 2017 ఎడిషన్ రేంజ్ రోవర్ ఎవోక్ ప్రారంభ ధర రూ. 49.10 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

2017 ఎవోక్ ధరల శ్రేణి

2017 ఎవోక్ ధరల శ్రేణి

  • ఎవోక్ ప్యూర్ ధర రూ. 49.10 లక్షలు
  • ఎవోక్ ఎస్ఇ ధర రూ. 54.20 లక్షలు
  • ఎవోక్ ఎస్ఇ డైనమిక్ ధర రూ. 56.30 లక్షలు
  • ఎవోక్ హెచ్ఎస్ఇ ధర రూ. 59.25 లక్షలు
  • ఎవోక్ హెచ్ఎస్ఇ డైనమిక్ ధర రూ. 64.65 లక్షలు
  • ఎవోక్ హెచ్ఎస్ఇ డైనమిక్ ఎంబర్ ఎడిషన్ ధర రూ. 67.90 లక్షలు
  • 2017 ఎవోక్ ఇంజన్ మరియు పవర్ వివరాలు

    2017 ఎవోక్ ఇంజన్ మరియు పవర్ వివరాలు

    ప్రత్యేకించి 2017 ఏడాది కోసం విడుదల చేసిన 2017 ఎడిషన్ ఎవోక్ లో 2.0-లీటర్ సామర్థ్యం గల ఇంజీనియమ్ డీజల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే కలదు. ఇది గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

    2017 ఎవోక్ ట్రాన్స్‌మిషన్ వివరాలు

    2017 ఎవోక్ ట్రాన్స్‌మిషన్ వివరాలు

    మునుపటి ఎవోక్ కన్నా ఈ 2017 ఎడిషన్ ఎవోక్ 20 కిలోల వరకు తక్కువ బరువుతో ఉంది. ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

    2017 ఎవోక్ ఫీచర్లు

    2017 ఎవోక్ ఫీచర్లు

    సరికొత్త 2017 రేంజ్ రోవర్ ఎవోక్ లో పూర్తి స్థాయి ఎల్ఇడి అడాప్టివ్ హెడ్ లైట్లు కలవు. ఈ లైట్లు స్టీరింగ్ వీల్‌ను తిప్పడం ద్వారా మలుపులను బట్టి కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. న్యావిగేషన్ సిస్టమ్ గల హెడ్ అప్ డిస్ల్పే, పవర్ గెశ్చర్ టెయిల్ గేట్ మరియు సరికొత్త 10-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్ కలదు.

    2017 రేంజ్ రోవర్ ఎవోక్

    2017 ఎవోక్ లోని అన్ని వేరియంట్లలో కూడా లెథర్ అప్‌హోల్‌స్ట్రే కలదు. మరియు టార్క్ వెక్టరింగ్ అనే ఫీచర పరిచయం చేసింది. ఈ వ్యవస్థ వాహనంలోని నాలుగు చక్రాలకు సరైన మొత్తంలో టార్క్ సరఫరా చేస్తుంది. తద్వారా వాహనం ఆన్ లేదా ఆఫ్ రోడ్ మీద ఉన్నపుడు కూడా అత్యుత్తమ గ్రిప్‌ను కలిగి ఉంటుంది.

    2017 ఎవోక్ ఎంబర్ ఎడిషన్

    2017 ఎవోక్ ఎంబర్ ఎడిషన్

    స్పెషల్ ఎంబర్ ఎడిషన్ మోడల్ ఎక్ట్సీరియర్ ఎరుపు మరియు నలుపు రంగుల్లో ఫినిషింగ్ చేయబడింది. ఎవోక్ నుండి దీనిని ప్రత్యేకం చేయడానికి స్వల్ప డిజైన్ మార్పుల్లో రేంజ్ రోవర్ ఈ ఎంబర్ స్పెషల్ ఎడిషన్‌ను అభివృద్ది చేసింది.

    2017 రేంజ్ రోవర్ ఎవోక్

    ఈ ఎంబర్ స్పెషల్ ఎడిషన్ ఎవోక్ లోని హెఎస్ఇ డైనమిక్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఎక్ట్సీరియర్‌లో ఉన్న అవే రంగులను ఇంటీరియర్‌లో కూడా అందించింది. ఎబోనీ బ్లాక్ రంగులో ఉన్న సీట్లు కాంట్రాస్టింగ్ పిమెంట్ రెడ్ కలర్‌ అల్లికలతో ఉన్నాయి.

    2017 రేంజ్ రోవర్ ఎవోక్

    2017 ఎడిషన్ ఎవోక్ శ్రేణి వాహనాలను విడుదల చేసిన రేంజ్ రోవర్ తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే ఏడాది ఈ 2017 ఎవోక్ వేరియంట్‌ను 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఎస్ఐ4 పెట్రోల్ వేరియంట్లో విడుదల చేయనుంది.

    2017 రేంజ్ రోవర్ ఎవోక్

    2017 ఎవోక్‌లో పరిచయం కానున్న ఎస్ఐ4 టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 233బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

    2017 రేంజ్ రోవర్ ఎవోక్

    • మరో మైలు రాయిని కైవసం చేసుకున్న ఫార్చ్యూనర్
    • 2017 మారుతి స్విఫ్ట్ బ్రోచర్ లీక్: ఇండియన్ వేరియంట్ల వివరాలు
    • మూడు బైకుల మధ్య తీవ్రమైన పోటీ: ఇందులో మీ ఎంపిక ఏది ?

Most Read Articles

English summary
2017 Range Rover Evoque Launched In India Along With The ‘Ember’ Special Edition Model
Story first published: Tuesday, December 20, 2016, 16:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X