ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ విడుదలను ఖరారు చేసిన నిస్సాన్

Written By:

నిస్సాన్ ఇండియా తమ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ప్రీమియ్ ఎస్‌యువిని మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శిచింది. అప్పటి నుండి దీని విడుదల ఇప్పుడిప్పుడే అంటూ ఊరిస్తూ వచ్చిన నిస్సాన్, తాజాగా తమ సూపర్ కారు జిటి-ఆర్ విడుదల వేదిక మీద ఈ ఎక్స్-ట్రయల్ విడుదలకు సంభందించి నోరు మెదిపి వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు స్పష్టంగా ప్రకటించింది.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

2017 ఏడాదిలో దేశీయ ఎస్‌యువి సెగ్మెంట్లో ఈ ప్రీమియమ్ ఎక్స్-ట్రయల్ విడుదలను నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ Guillaume Sicard అధికారికంగా ప్రకటించాడు. కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిని విడుదల చేయనున్నట్లు సికార్డ్ తెలిపాడు.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

నిస్సాన్ ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు దీనికి జతగా 32కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ ను అనుసంధానం చేశారు.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

ఇందులో పరిచయం చేసిన అధునాతన డ్యూయల్ క్లచ్ ప్యార్లల్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ విడుదల చేసే పవర్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

దేశీయంగా విడుదల కానున్న ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్‌లోని ఇంజన్‌కు ఎక్స్-ట్రానిక్ సివిటి గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు, దీని గుండా ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్ ముందు వైపు చక్రాలతో పాటు నాలుగు చక్రాలకు అందుతుంది.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

ప్రస్తుతం విడుదలకు అన్ని కార్యక్రమాలను వడివడిగా పూర్తి చేసుకుంటున్న ఎక్స్-ట్రయల్ ఎస్‌యువి నిస్సాన్ నాలుగవ తరానికి చెందినది. ఇది వరకే దీనిని 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో కూడా ప్రదర్శించారు.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

మునుపటి తరానికి చెందిన ఎస్‌యువితో పోల్చుకుంటే దీని క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. 5-సీటింగ్ సామర్థ్యంలో డిజైన్ చేయబడిన దీనిని సిఎన్ఎఫ్-సి ఫ్లాట్ ఫామ్ మీద అభివృద్ది చేశారు.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

ప్రస్తుతం విడుదలకు అన్ని కార్యక్రమాలను వడివడిగా పూర్తి చేసుకుంటున్న ఎక్స్-ట్రయల్ ఎస్‌యువి నిస్సాన్ ఎక్స్-ట్రయల్ శ్రేణిలో నాలుగవ తరానికి చెందినది.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

నిస్సాన్-డాట్సన్ భాగస్వామ్యంతో దేశీయంగా తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఇందులో నిస్సాన్ ప్రీమియమ్ (ఖరీదైన) ఉత్పత్తుల మీద మరియు డాట్సన్ అత్యంత సరసమై ఉత్పత్తుల మీద దృష్టిసారిస్తోంది.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి

నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఇండియాకు కొత్త కాదు, మొదటి ఎక్స్-ట్రయల్‌ 2005 లో పరిచయం అయ్యింది మరియు 2014 వరకు అమ్మకాల్లో ఉంది. అదే తరహా ఫీచర్లతో హైబ్రిడ్ లక్షణాలతో వచ్చే ఏడాది మళ్లీ పరిచయం కానుంది. తెలుగులో నిరంతరం ఆటోమొబైల్ వార్తలను పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

 
English summary
Nissan X-Trail Hybrid India Launch Slated For Early 2017
Story first published: Monday, December 5, 2016, 14:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos