అప్‌కమింగ్ రెనో క్విడ్ 1.0-లీ మైలేజ్ ఎంతో తెలుసా ?

By Anil

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియన్ మార్కెట్లోకి తమ క్విడ్ 1.0-లీటర్ కారు విడుదలతో గేర్‌మార్చనుంది. రెనో తమ క్విడ్ 1.0-లీటర్ ను విడుదల చేయకముందే అది విడుదల చేసే మైలేజ్ వివరాలను ప్రకటించింది. దేశీయంగా అత్యంత పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థల్లో ఒకటి ఎదగడానికి ఇది ఎంతో ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయి.

రెనో సంస్థ అందుబాటులోకి తెచ్చిన క్విడ్ 800సీసీ కారు మంచి విజయం సాధించిన నేపథ్యంలో క్విడ్‌ను 1.0-లీటర్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తోంది.

రెనో క్విడ్ 1.0-లీటర్

రెనో క్విడ్ 1.0-లీటర్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల వేరియంట్ లీటర్‌కు సుమారుగా 23.01 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనున్నట్లు తెలిసింది.

రెనో క్విడ్ 1.0-లీటర్

అయితే ఇదే శ్రేణిలో ఉన్నమారుతి ఆల్టో కె10 లీటర్‌కు 24.07 కిమీలు మరియు హ్యుందాయ్ ఇయాన్ 20.3 కిమీలు మైలేజ్ ఇవ్వగలవు.

రెనో క్విడ్ 1.0-లీటర్

రెనో ఈ క్విడ్ 1.0-లీటర్ ఇంజన్‌ను స్మార్ట్ కంట్రోల్ ఎఫిషియన్సీ పరిజ్ఞానంతో అందిస్తున్నారు. ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

రెనో క్విడ్ 1.0-లీటర్

రెనో ఈ క్విడ్ 1.0-లీటర్ ఇంజన్‌కు 5-స్పీడ్ ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

రెనో క్విడ్ 1.0-లీటర్

1000సీసీ సామర్థ్యం శ్రేణిలో ఉన్న వాహనాలతో పోల్చితే ఇది ఉత్తమ పవర్‌ను ఇస్తుంది. బరువు మరియు పవర్ నిష్పత్తిలో దీని పనితీరు అద్భుతం అని చెప్పాలి.

రెనో క్విడ్ 1.0-లీటర్

క్విడ్ లోని 1.0-లీటర్ ఇంజన్ ఒక టన్ను బరువుకు గరిష్టంగా 97బిహెచ్‌పి పవర్‌ను విడుదల చేస్తుంది.

రెనో క్విడ్ 1.0-లీటర్

బయటి వైపున ఉండే సైడ్ మిర్రర్లను సిల్వర్ కోటింగ్ ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు, చుట్టు ప్రక్కల నలుపు మరియు తెలుపులో ఉండే డీకాల్స్ మరియు వెనుక వైపు 1.0-లీటర్ ను సూచించే అక్షరాలను అందిస్తున్నారు.

రెనో క్విడ్ 1.0-లీటర్

రెనో ఇండియా ఈ క్విడ్ 1.0-లీటర్ కారును కేవలం ఆర్ఎక్స్‌టి మరియు ఆర్ఎక్స్‌టి(ఒ)లలో మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు.

రెనో క్విడ్ 1.0-లీటర్

ఫీచర్ల పరంగా ముందున్న 800సీసీ క్విడ్‌లోని 7-అంగుళాల మీడియానవ్ టచ్‌స్క్రీన్ గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‍‌తో పాటు ఫ్రంట్ డ్రైవర్ ఎయిర్ బ్యాగుని ఆప్షనల్‌గా అందిస్తున్నారు.

రెనో క్విడ్ 1.0-లీటర్

రెనో ఈ క్విడ్ 1.0-లీటర్‌ను ఈ ఆగష్టు చివరిలోపు విడుదల చేయనుంది.

రెనో క్విడ్ 1.0-లీటర్

ఈ క్విడ్ 1.0-లీటర్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి ఆల్టో కె10 మరియు హ్యుందాయ్ వారి ఇయాన్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.

రెనో క్విడ్ 1.0-లీటర్

  • రెనో నుండి రెండు సరికొత్త ఉత్పత్తులు

Most Read Articles

English summary
Renault Kwid 1.0-Litre Engine Mileage Revealed
Story first published: Friday, August 19, 2016, 13:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X