హ్యుందాయ్ క్రెటాకు పోటీగా స్కోడా నుండి కాంపాక్ట్ ఎస్‌యువి

Written By:

సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా దేశీయ మార్కెట్ కోసం సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యువిని ఖాయం చేసినట్లు, ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు ప్రత్యక్షంగా గట్టి పోటీని ఇవ్వనున్నట్లు నెట్టింల్లో ఆధారం లేని వార్తలు వెల్లువెత్తాయి.

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యువి

స్కోడా ఇప్పటికే యెటి మరియు కొడియాక్ ఎస్‌యువిలను ఇండియన్ మార్కెట్ కోసం సిద్దం చేసింది. ఇప్పుడు వాటి సరసన మూడవ ఉత్పత్తి ఈ కాంపాక్ట్ ఎస్‌యువి చేరింది.

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యువి

ఆటోకార్ ప్రచురించిన కథనం ప్రకారం, స్కోడా ఇప్పటికే చిన్న ఎస్‌యువిని అభివృద్ది చేస్తోందని స్కోడా సాంకేతికాభివృద్ది ముఖ్య అధికారి క్రిస్టియన్ స్టర్బ్ తెలిపాడు.

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యువి

స్కోడా శ్రేణిలో ఉన్న వాహనాలలో కెల్లా ప్రస్తుతం అభివృద్ది చెందుతున్న ఎస్‌యువి అత్యంత చిన్నది మరియు యెటి ఎస్‌యువికి చాలా దగ్గర పోలికలతో రానుంది.

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యువి

ఈ కొత్త ఎస్‌యువి వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌నకు చెందిన ఎమ్‌క్యూబి ఏఒ వేదిక ఆధారంగా నిర్మించబడుతోంది. ఇదే వేదిక మీద ఫ్యాబియా మరియు వోక్స్‌వ్యాగన్ పోలో కార్లు కూడా డెవలప్ అవుతున్నాయి.

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యువి

సరికొత్త స్కోడా ఎస్‌యువి ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యువి

చిన్న ఎస్‌యువి కోసం తక్కువ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌లను అభివృద్ది చేస్తోంది. ఈ ఎస్‌యువిని ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల ఇంధన వేరియంట్లను హైబ్రిడ్‌ రూపంలో అందించడానికి వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌తో జట్టుకట్టే అవకాశం ఉంది.

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యువి

మొదట 2018 నాటికి ప్రపంచ ప్రదర్శనకు వచ్చి ఆ తరువాత 2019 లో దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలోకి అమ్మకాలకు విడుదల కానుంది.

చిత్రాలు కేవలం గుర్తుగా మాత్రమే వినియోగించబడ్డాయి.

 
Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu: Skoda Confirms Compact SUV — Is This The Rival For The Creta?
Story first published: Friday, October 28, 2016, 17:44 [IST]
Please Wait while comments are loading...

Latest Photos