స్కోడా సూపర్బ్ మరియు టయోటా క్యామ్రి మధ్య పోలికలు చూసారా ?

Written By:

స్కోడా ఈ మధ్యనే సరికొత్త 2016 సూపర్బ్ కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి కారు కూడా ప్రత్యర్థిని ముందుగానే వెతుక్కుంటుంది. మరి 2016 స్కోడా సూపర్బ్ ఏ కారును ప్రత్యర్థిగా ఎంచుకుందో తెలుసా ? సూపర్బ్ కారుకు తగ్గ ఈడు, జోడు గల టయోటా క్యామ్రి మీద పోటిగా విడుదల అయ్యింది.

కాబట్టి 2016 స్కోడా సూపర్బ్ 2015 టయోటా క్యామ్రి కారుకు ధర, స్పెసిఫికేషన్లు ఫీచర్లు మరియు భద్రత పరంగా ఎలా పోటిపడనుందో తెలుసుకోవలంటే క్రింది గల స్లైడర్లను తిరగేయాల్సిందే.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ధర

ధర

 • 2016 స్కోడా సూపర్బ్ ధర రూ. 26 లక్షలు
 • 2015 టయోటా క్యామ్రి ధర రూ. 34 లక్షలు

గమనిక రెండు ధరలు దాదాపుగా ఆన్‌-రోడ్ ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఇవ్వబడ్డాయి.

స్కోడా సూపర్బ్ డిజైన్

స్కోడా సూపర్బ్ డిజైన్

స్కోడా వారి 2016 సూపర్బ్ కారు మునుపటి తరం కారు కన్నా ఎంతో యాంగులర్‌గా డిజైన్ చేయబడి ఉంది. మరియు ఎక్కువగా స్కోడా ఆక్టావియాలోని వివిధ డిజైన్‌లను దీనికి జోడించారు. అయితే ముందు వైపున పొడవైన స్లాట్లు గల పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు పదునైన హెడ్‌లైట్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

టయోటా క్యామ్రి డిజైన్

టయోటా క్యామ్రి డిజైన్

టయోటా మోటార్స్ క్యామ్రి ముందు వైపున తక్కువ క్రోమ్ పూత పూయబడిన చిన్న ఫ్రంట్ గ్రిల్ అందించారు. అయితే ఇంతకు ముందు గల క్యామ్రి కారుకు దీనికి మద్య పెద్దా డిజైన్ మార్పులు చోటు చేసుకోలేదు. మన చూడగలిగిన వాటి ఫ్రంట్ గ్రిల్ మరియు రీ డిజైన్డ్ బంపర్ మరియు వెనుక వైపున ఎక్కువగా క్రోమ్ డిజైన్‌ను కల్పించారు.

స్కోడా సూపర్బ్ ఇంజన్ వివరాలు

స్కోడా సూపర్బ్ ఇంజన్ వివరాలు

2016 స్కోడా సూపర్బ్ కారులో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లు కలవు. అవి 1.8-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్

 స్కోడా సూపర్బ్ పవర్ మరియు టార్క్

స్కోడా సూపర్బ్ పవర్ మరియు టార్క్

స్కోడా సూపర్బ్ కారులో గల పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 177 బిహెచ్‌‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. అదే విధంగా డీజల్ ఇంజన్ దాదాపుగా 174 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

స్కోడా సూపర్బ్ ట్రాన్స్‌మిషన్ వివరాలు

స్కోడా సూపర్బ్ ట్రాన్స్‌మిషన్ వివరాలు

పెట్రోల్ ఇంజన్ గల వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి గేర్ బాక్స్ అదేవిదంగా డీజల్ వేరియంట్ 6-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.

టయోటా క్యామ్రి ఇంజన్ వివరాలు

టయోటా క్యామ్రి ఇంజన్ వివరాలు

టయోటా మోటార్స్ క్యామ్రి కారును పెట్రోల్ మరియు హైబ్రిడ్ వేరియంట్లో కారును రూపొందించింది. క్యామ్రి 2.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు ఇదే ఇంజన్‌ను కలిగి ఉన్న హైబ్రిడ్ వెర్షన్‌ ద్వారా అందుబాటులో కలదు.

క్యామ్రి పవర్ మరియు టార్క్

క్యామ్రి పవర్ మరియు టార్క్

క్యామ్రిలో గలపెట్రోల్ వేరియంట్ 178 బిహెచ్‌పి పవర్ మరియు 233 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా హైబ్రిడ్ వేరియంట్ 158 బిహెచ్‌పి పవర్ మరియు 213 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.

క్యామ్రి ట్రాన్స్‌మిషన్ వివరాలు

క్యామ్రి ట్రాన్స్‌మిషన్ వివరాలు

క్యామ్రిలో గల పెట్రోల్ మరియు హైబ్రిడ్ రెండు వేరియంట్లు కూడా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలవు.

స్కోడా సూపర్బ్ మైలేజ్

స్కోడా సూపర్బ్ మైలేజ్

 • స్కోడా సూపర్బ్ పెట్రోల్ లీటర్‌కు 14.12 కిలోమీటర్లు
 • స్కోడా సూపర్బ్ డీజల్ లీటర్‌కు 18.19 కిలోమీటర్లు
టయోటా క్యామ్రి మైలేజ్

టయోటా క్యామ్రి మైలేజ్

 • టయోటా క్యామ్రి పెట్రోల్‌ లీటర్‌కు 12.98 కిలోమీటర్లు
 • టయోటా క్యామ్రి హైబ్రిడ్ లీటర్‌కు 19.16 కిలోమీటర్లు
స్కోడా సూపర్బ్‌లోని ఫీచర్లు

స్కోడా సూపర్బ్‌లోని ఫీచర్లు

 • త్రీ జోన్ క్లేమేట్ కంట్రోల్
 • 5-అంగుళాల తాకే తెర
 • ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
 • ఆపిల్ కార్ ప్లే
 • ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటి
 • స్కోడా మిర్రర్ లింక్ సిస్టమ్
 • ముందు డోర్‌ దగ్గర గొడుగుల కోసం ప్రత్యేకం డిజైన్
స్కోడా సూపర్బ్‌లోని ఫీచర్లు

స్కోడా సూపర్బ్‌లోని ఫీచర్లు

పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు

ఎల్‌ఇడి టెయిల్ లైట్లు

ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు

కెమెరా గైడెన్స్

క్రూయిజ్ కంట్రోల్

ఎలక్ట్రిక్ ద్వారా డ్రైవర్ సీట్ అడ్జెస్ట్

లెథర్ ఇంటీరియర్

కూల్డ్ గ్లూవ్స్

సింగల్ టచ్ తో మూయు మరియు తెరిచే సౌలభ్యం గల కిటికీ అద్దాలు

టయోటా క్యామ్రిలోని ఫీచర్లు

టయోటా క్యామ్రిలోని ఫీచర్లు

 • ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సీట్లు
 • నియంత్రికలు గల ఆర్మ్ రెస్ట్
 • వెనుక వైపున అద్దానికి పవర్ ద్వారా సన్‌షేడ్
 • 17-అంగుళాల చక్రాలు
 • వెనుక మరియు మూలలను పర్యవేక్షించే సెన్సార్లు
 • మెమొరీ గల డ్రైవర్ బాహ్యపుటద్దాలు
 • ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ సిస్టమ్
 • ముందు వైపు ప్యాసింజర్‌కు హెడ్‌రెస్ట్
స్కోడా సూపర్బ్‌లోని భద్రత ఫీచర్లు

స్కోడా సూపర్బ్‌లోని భద్రత ఫీచర్లు

 • ఎనిమిది ఎయిర్ బ్యాగులు
 • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
 • ఎలక్ట్రానికి బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
 • హిల్ హోల్డ్ కంట్రోల్
 • ట్రాక్షన్ కంట్రోల్
 టయోటా క్యామ్రిలోని భద్రత ఫీచర్లు

టయోటా క్యామ్రిలోని భద్రత ఫీచర్లు

 • ఏడు ఎయిర్ బ్యాగులు
 • ఇంపాక్ట్ అబ్జార్వింగ్ బాడీ
 • హిల్ స్టార్ట్ అసిస్ట్
 • వెహికల్ స్టెబిలిటి కంట్రోల్
తీర్పు

తీర్పు

ధర, మైలేజ్, ఇంజన్ వివరాలు, ఫీచర్లు మరియు భద్రత వంటి విషయాలలో క్యామ్రి మీద స్కోడా సూపర్బ్ అన్ని విధాలా పై చేయి సాధించిందని చెప్పవచ్చు. కాని టయోటా క్యామ్రి హైబ్రిడ్ కారు కాబట్టి పర్యావరణ అనుకూలమైంది. అదే విధంగా వోక్స్‌వ్యాగన్ ఎమిషన్ కుంభకోణం జరిగిన తరువాత ఎక్కువ మంది 2.0-లీటర్ డీజల్ ఎంచుకోవడం మానేశారు. అయితే మా ప్రకారం క్యామ్రి కన్నా స్కోడా సూపర్బ్ నిజంగానే సూపర్.

English summary
2016 Skoda Superb vs 2015 Toyota Camry Comparison
Story first published: Monday, February 29, 2016, 17:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark