శిథిలమైన టాటా నానో జీవితం: ఊహించని చిత్రాలతో టాటా నానో ప్లాంట్

By Anil

దేశీయ ప్రజలకు అతి తక్కువ ధరకే కారును అందివ్వాలనే లక్ష్యంలో రతన్ టాటా స్వయంగా నానో కారును అభివృద్ది చేయించాడు. పూర్తి స్థాయిలో అభివృద్ది అయిన నానో ఇక ఉత్పత్తి చేయడం ఒకటే ఆలస్యం. అయితే ఒక్క సారిగా కొరడా జులిపించి నానో ప్లాంట్‌ను మూయించి రాష్ట్రం నుండి వెల్లగొట్టింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అక్కడ అప్పట్లో వదిలేసిన టాటా నానోలు మరియు దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 పూర్తిగా వదిలేసిన నానోలు

పూర్తిగా వదిలేసిన నానోలు

మరికొన్ని రోజుల్లో టాటా కార్లను ఉత్పిత్తి చేసి, అమ్మకాలకు అందుబాటులోకి తీసుకు వచ్చే సందర్భంలో సిపిఐ(ఎమ్) పార్టీలు మరియు అక్కడి ప్రాంతీయ రైతులు ఈ ప్లాంటును ప్రారంభంలో మూసివేయాలని ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

తెర మీదకు 1894 చట్టం

తెర మీదకు 1894 చట్టం

దాదాపుగా 997 ఎకరాల్లో రైతులకు ఇబ్బందికరంగా ప్లాంట్‌ను ఎర్పాటు చేసినందుకు 1894 భూ అక్రమ చట్టం ప్రకారం ఉన్నఫలంగా ఈ నానో తయారీ ప్లాంటును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మూసివేయించింది.

పశువుల పాకగా

పశువుల పాకగా

భారీ వ్యవయంతో టాటా మోటర్స్ నానో ప్లాంట్‌ను సింగూరులో అభివృద్దిలోకి తెచ్చింది. అయితే అనర్థాలకు ఇదే కారణం అనే నెపంతో అతి పెద్ద షెడ్డుల నిర్మాణంతో తయారైన ఈ ప్లాంట్ నిరుపయోగంగా ఇలా పశువుల పాకగా మారిపోయింది. ఉన్న వనరులతో అభిృద్దిని ఆశించకుండా ఇలా వనరులను నిరుపయోగంగా మార్చితే అభివృద్ది ఎలా జరుగుతుంది.

ప్లాంట్ ఆరంభంలోని భారీ షెడ్డు

ప్లాంట్ ఆరంభంలోని భారీ షెడ్డు

సింగూరులోని నానో ప్లాంట్‌లో ఉన్న షెడ్డు ఎంత భారీగా ఉందే, అంతే భారీ స్థాయిలో అక్కడి వారికి ఉపాధి మరియు భూముల విలువ అన్నీ కూడా పెరిగాయి. కాని దీని తరలింపుతో ఆ ప్రాంతం అన్ని విధాలుగా బోసిపోయింది.

రబీంద్రనాథ్ భట్టాచార్య

రబీంద్రనాథ్ భట్టాచార్య

తృణమూల్ పార్టీ నాయకుడు మరియు సింగూర్ ప్రాంతం ఉన్న నియోజకవర్గానికి ఎమ్‌ఎల్‌ఎ. ఇతని సమక్షంలో ఈ ప్లాంటు మీద వ్యతికేత పుట్టుకొచ్చింది. ఇతని వెన్నంటే ఉండే ప్రజల ద్వారా భారీ స్థాయిలో ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది.

 వ్యర్థమైన నిర్మాణం మరియు ధనం

వ్యర్థమైన నిర్మాణం మరియు ధనం

భారీ స్థాయిలో పెట్టుబడులతో నిర్మితమైన పెద్ద పెద్ద షెడ్లు మరియు ప్లాంట్ పరిసరాలు నిరుపయోగంగా ఉన్నాయి. దీనికి వెచ్చించిన సొమ్ము ఎటు కూడా పనికిరాకుండాపోయింది.

 ఉద్యోగ అవకాశం కోల్పోయిన యువత

ఉద్యోగ అవకాశం కోల్పోయిన యువత

ఆ ప్రాంతంలో ఈ ప్లాంటు అందుబాటులోకి వచ్చి ఉంటే చుట్టు ప్రక్కల ఉన్న యువత చాలా వరకు ఉపాధిని పొందేది. అయికే ఇప్పుడు ఎప్పటిలాగే చాలా ప్రదేశాల ఉన్న నిరుద్యోగ సమస్యతో అక్కడి యువత ఉంది. ఈ ప్లాంటును ప్రారంభించి ఉంటే ఈ సమస్య తీరిపోయేది.

నానో ప్లాంట్ అంతర్బాగం

నానో ప్లాంట్ అంతర్బాగం

ప్రస్తుతం అక్కడ ఉన్న పొలాల ద్వారా ఏడాదికి మూడు పంటలు తీయొచ్చు. అయితే ఈ ప్లాంటుకు భూములను ఇచ్చిన రైతులు ఇంతా వాటిని తిరిగి పొందలేదు. తద్వారా అక్కడ నానో కార్ల ఉత్పత్తి లేదు పంటలు పండించవలేదు. ఇదిగో ఇలా నిరుపయోగంగా ఉంది.

నిర్జీవమైన పరిసరాలు

నిర్జీవమైన పరిసరాలు

సుమరుగా ఏనిమిది సంవత్సరాల క్రితం దీనిని మూసివేశారు. అప్పటిని నుండి అటు టాటాకు ఇటు రైతులకు ఏ విధంగా ఉపయోగంలోకి రాకుండా నిర్జీవమై ఇలా పశువుల పాకగా దర్శనం ఇస్తోంది.

ప్రపంచ స్థాయి నిర్మాణం

ప్రపంచ స్థాయి నిర్మాణం

అప్పట్లో టాటా సంస్థ ఈ ప్లాంట్ నిర్మాణానికి ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఆధునిక నిర్మాణ శైలిలో నిర్మించారు.

మునిగిపోయిన కలల

మునిగిపోయిన కలల

టాటా మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ ధరకు కారును అందించాలనే ప్రణాలికతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాంటును నిర్మంచింది. అయితే టాటా మోటార్స్ యొక్క భవిష్యత్తు ఇదిగో ఇలా వ్యర్థాలతో మునిగిపోయింది.

 ఊహలకందని నిర్మాణం - ఇపుడు విచారంగా దర్శనం ఇస్తోంది

ఊహలకందని నిర్మాణం - ఇపుడు విచారంగా దర్శనం ఇస్తోంది

ఎనిమిది ఏళ్లు గడిచినా ఇప్పటి టాటా వారి సింగూరు నానో ప్లాంటు భారీ నిర్మాణాలతో కంటికి అలాగే కనబడుతూ ఉంది. ప్రభుత్వం దీనికి తిరిగి అనుమతులు ఇస్తే వ్యర్థం అయిన ఈ ప్లాంటు ద్వారా అక్కడి రైతులు మరియు నిరుద్యోగులు ఉపాధిని పొందుతారు.

Article Source: The Quint

Image credit: Ritam Sengupta

ఊహించిన చిత్రాలతో టాటా నానో ప్లాంట్

వివిధ రకాల రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్ల గురించి తెలుసా ...?

2016 ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన ఎయిర్‌‌‌లైన్స్

ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా ?

Most Read Articles

English summary
Tata Nano Singur Plant: "Shocking!" Images
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X