ఇండియన్ మిలిటరీలో మారుతి జిప్సి స్థానాన్ని ఆక్రమించిన టాటా సఫారి

ఇండియన్ ఆర్మీలో ఎన్నో ఏళ్ల పాటు మారుతి సుజుకి జిప్సి సేవలందించింది. అయితే ఇప్పుడు దాని స్థానంలోకి టాటా మోటార్స్‌కు చెందిన సఫారి స్టార్మ్ వచ్చి చేరింది.

By Anil

ఇండియన్ మార్కెట్లోకి చాలా వరకు ఎస్‌యువిలు విడుదలవుతూనే వచ్చాయి. అయితే ఇండియన్ ఆర్మీ ఎంతో కాలంగా మారుతి సుజుకి జిప్సీనే వినియోగిస్తూ వచ్చింది. ఎన్నో అధునాతన సాంకేతిక ఫీచర్లతో చాలా ఎస్‌యువిలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే ఎందుకు వినియోగిస్తోంది అనే ప్రశ్న చాలా మందికే మెదులుంటింది. అయితే జిప్సీ సేవలకు పుల్‌స్టాప్ పెట్టి. దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన సఫారీ స్టార్మ్ ఎస్‌యువిని ఎంచుకుంది.

మారుతి సుజుకి జిప్సి

ప్రాథమిక ఒప్పందం ద్వారా ఇండియన్ ఆర్మీ టాటా మోటార్స్‌కు సుమారుగా 3,200 సఫారీ స్టార్మ్ ఎస్‌యువిలకు ఆర్డర్ ఇచ్చింది. ప్రత్యేకించి ఆర్మీ అవసరాల కోసం తయారు చేయబడుతున్న వీటిని భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో ఎంచుకోనుంది.

మారుతి సుజుకి జిప్సి

దేశీయంగా ఉత్పత్తి గావింపబడుతున్న మహీంద్రా స్కార్పియో మరియు టాటా సఫారి ఎస్‌యువిలకు ఇండియన్ ఆర్మీ అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించింది. అయితే స్కార్పియో ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో సఫారిని ఎంచుకోవడం జరిగింది.

మారుతి సుజుకి జిప్సి

పనితీరు పరంగానే కాకుండా టాటా గ్రూప్ అత్యుత్తమ డీల్‌ను ఆర్మీ ముందు ఉంచడంతో ఆర్డర్ ఖాయమైంది. దీంతో జవాన్లను మరియు ఆర్మీ అధికారులను తరలించడానికి ఇకపై మారుతి సుజుకి జిప్సీల స్థానంలో సఫారీ స్టార్మ్ ఎస్‌యువిలను ఎంచుకున్నట్లు స్పష్టమైంది.

మారుతి సుజుకి జిప్సి

ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ వద్ద మొత్తం 30,000 వరకు జిప్సీలు ఉన్నాయి. ఇందులో వచ్చే ఏడాది నుండి సుమారుగా సఫారీ స్టార్మ్ ఎస్‌యువిలతో మార్పు చేయించనున్నారు. ప్రాథమికంగా 3,198 సఫారీ ఎస్‌యువిలకు టాటాతో డీల్ కుదిరింది.

మారుతి సుజుకి జిప్సి

అన్ని భూభాగాల్లో శక్తివంతమైన పనితీరు మరియు దీని సామర్థ్యం పరంగా ఇండియన్ ఆర్మీకి మారుతి జిప్సీ ఫేవరేట్ వెహికల్ అని చెప్పాలి.

మారుతి సుజుకి జిప్సి

అయితే కాలం మారుతున్న కొద్దీ మెరుగైన ఫీచర్లతో నిండిన యుద్ద వాహనాలు ఎంతైనా అవసరం కాబట్టి ప్రత్యేకంగా ఆర్మీ కోసం అభివృద్ది చేస్తున్న సఫారీ స్టార్మ్‌లను ఎంచుకోవడం తప్పనిసరి అయ్యింది.

మారుతి సుజుకి జిప్సి

ఫైళ్ల మీద నుండి ఈ డీల్ పూర్తి స్థాయిలో చేతులు మారితే, ఇండియన్ ఆర్మీ నుండి టాటా మోటార్స్ పొందిన రెండవ అతి పెద్ద ఒప్పదం అవుతుంది. ఈ ఏడాదిలో పెద్ద ట్రక్కుల కోసం 13,000 కోట్ల విలువైన డీల్ కుదిరింది.

మారుతి సుజుకి జిప్సి
  • జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!
  • బాలీవుడ్ కు ఏమీ తీసిపోమంటున్న సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు...
  • సంవత్సరాంతపు ఆఫర్ల మీద గురి పెట్టిన టయోటా

Most Read Articles

English summary
Tata Safari Storme To Replace Maruti Gypsy As The New Army Vehicle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X