ఆగష్టు కార్ల అమ్మకాల్లో చోటు చేసుకున్న విచిత్రం

టాప్ 10 కార్ల అమ్మకాల గురించి విశ్లేషిస్తూ వచ్చినపుడు డ్రైవ్‌స్పార్క్ మీ ముందుకు రెనో క్విడ్ ఎంతో కొంత సమాచారాన్ని ప్రత్యేకంగా తీసుకొస్తోంది. అలాగే ఈ సారి కూడా... ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో లీడర్లుగా ఉన్న ఆల్టో మరియు ఇయాన్‌లకు మునుపటి క్విడ్ మంచి పోటిని ఇచ్చింది. ఇప్పుడు 1.0లీటర్ క్విడ్ రావడంతో ఆల్టో కె10 కు కూడా గట్టి పోటీ తయారైంది. అందులో క్విడ్ తిరుగులేని విజయం సాధించింది.

ఆగష్టులో టాప్ 10 కార్ల అమ్మకాలు

ఇక ఆగష్టు అమ్మకాల గురించి ప్రస్తావిస్తే ఎప్పుడూ లేని విధంగా సుమారుగా 12 సంస్థలు 16 శాతం అమ్మకాల్లో వృద్దిని సాధించి 2,55,000 యూనిట్ల అమ్మకాలు జరిపాయి. గడిచిన ఆగష్టు 2016 అమ్మకాల్లో రెండంకెల వృద్ది నమోదైంది. నేటి కథనంలో ఆగష్టు లో అమ్ముడైన టాప్ 10 కార్లను పరిశీలిద్దాం రండి.

10. మారుతి సియాజ్

10. మారుతి సియాజ్

పదవ స్థానంలో నిలిచిన మారుతి సియాజ్ గత ఆగష్టు 2016 లో 6,214 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఈ సెడాన్ హైబ్రిడ్ సాంకేతికతో అందుబాటులో ఉండటం వలన మంచి అమ్మకాలకు మార్గం సుగమం అయ్యిందని చెప్పవచ్చు. దీని ఎంట్రీ లెవల్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 9,07,218 లుగా ఉంది.

09. మారుతి సెలెరియో

09. మారుతి సెలెరియో

ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌లో మంచి అమ్మకాలు సాధిస్తున్న మారుతి వారి సెలెరియో గడిచిన నెలలో 8,063 యూనిట్ల అమ్మకాలు సాధించి ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. మారుతి సెలెరియో ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 4,79,125 లుగా ఉంది.

08. మారుతి బాలెనొ

08. మారుతి బాలెనొ

మారుతి సుజుకి గత ఏడాదిలో అందుబాటులోకి తెచ్చిన బాలెనొ గడిచిన ఆగష్టు నెలలో 8,671 యూనిట్ల అమ్మకాలు సాధించింది. మారుతి బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ.6,13,647 లుగా ఉంది.

07. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

07. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

ఇండియన్ మార్కెట్లోకి మొదటి సారిగా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ను ప్రారంభించిన హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారును విడుదల చేసింది. ఇది గడిచిన ఆగష్టు అమ్మకాల్లో ఏకంగా 9,146 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఎలైట్ ఐ20 ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 6,54,418 లుగా ఉంది.

06. రెనో క్విడ్

06. రెనో క్విడ్

కొత్తగా కారు కొనే వారు ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా చాలా వరకు ఇతర ఇదే స్థాయి ఉత్పత్తులకు తీవ్ర పోటీని సృష్టించింది. అంతే కాకుండా క్విడ్ ను 1.0-లీటర్ శ్రేణిలో అందించడంతో అమ్మకాలు మరింత పెరిగాయి. గడిచిన ఆగష్టులో 10,719 యూనిట్ల అమ్మకాలు సాధించింది. రెనో క్విడ్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 3,26,506 లుగా ఉంది.

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన మరొక ఉత్పత్తి గ్రాండ్ ఐ10 గడిచిన ఆగష్టు 2016 లో 12,957 యూనిట్ల అమ్మకాలు జరిపి ఈ జాబితాలో ఎప్పటిలాగే ఐదవ స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 5,74,438 లుగా ఉంది.

04. మారుతి స్విఫ్ట్

04. మారుతి స్విఫ్ట్

ఇండియన్ మార్కెట్లో అత్యంత ఉత్తమమైన మరియు బాగా నమ్మదగిన హ్యాచ్‌బ్యాక్ అంటే మారుతి వారి స్విప్ట్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. గడిచిన ఆగష్టు 2016 లో సుమారుగా 13,027 యూనిట్ల అమ్మకాలు జరిపింది. మారుతి స్విఫ్ట్ ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 5,72,550 లుగా ఉంది.

03. వ్యాగన్ ఆర్

03. వ్యాగన్ ఆర్

మారుతి వారి మరో బెస్ట్ సెల్లింగ్ కారు వ్యాగన్ ఆర్ ఎప్పటిలాగే ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. గడిచిన ఆగష్టు 2016 లో ఇది సుమారుగా 14,571 యూనిట్ల అమ్మకాలు జరిపింది. వ్యాగన్ ఆర్ ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ధర రూ. 4,93,546 లుగా ఉంది.

02. మారుతి డిజైర్

02. మారుతి డిజైర్

ఇండియన్ మార్కెట్లో ఉన్న కాంపాక్ట్ సెడాన్‌లో బెస్ట్ కారు స్విఫ్ట్ డిజైర్. గడిచిన ఆగష్టు 2016 లో సుమారుగా 15,766 మంది దీనిని కొనుగోలు చేసి ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిపారు. స్విఫ్ట్ డిజైర్ ప్రారంభ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 6,12,331 లుగా ఉంది.

01. మారుతి ఆల్టో

01. మారుతి ఆల్టో

మార్కెట్లో ఎన్ని కొత్త ఉత్పత్తులు వచ్చినా ఏ మాత్రం తడబడకుండా నిలకడగా అమ్మకాలు సాధిస్తూ ఎప్పటిలాగే ఈ టాప్ 10 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఆగష్టు నెలలో 20,919 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి ఆల్టో ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 2,98,368 లుగా ఉంది.

ఆగష్టులో టాప్ 10 కార్ల అమ్మకాలు

ప్రతి ఏడాది కూడా పండుగ సీజన్ సెప్టెంబర్ మాసం నుండి ప్రారంభం అవుతుంది. అదే నెల నుండే కార్ల అమ్మకాలు పెరుగుతాయి. అయితే దానికి భిన్నంగా ఈ ఏడాదిలో ఆగష్టు నుండి అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. అయితే టాప్ 10 అమ్మకాల జాబితాలో మారుతి సుజుకికి చెందినవే ఏడు ఉత్పత్తులు ఉన్నాయి.

ఆగష్టులో టాప్ 10 కార్ల అమ్మకాలు

ఆటోమొబైల్ రంగంలో వాహన ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యం... అయితే ఎంతో కాలంగా వినియోగదారులు చాలా వరకు వెహికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవడంలో మోసపోతూనే ఉన్నారు. ఈ విధానాన్ని మార్చడానికి కొత్త పద్దతి అందుబాటులోకి వచ్చింది. మరెందుకు ఆలస్యం ఇక్కడ క్లిక్ చేసి దానిని మీరు కూడా ఫాలో అవ్వండి

Most Read Articles

English summary
Top Ten Best Selling Cars August 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X