అమ్మకాల్లో అత్యధిక డబ్బును వసూలు చేస్తున్న టాప్-10 కార్లు

Written By:

మార్కెట్లోకి ఒక్క కారు విడుదలైతే అందులో కోకొల్లలు వేరియంట్లు అందుబాటులోకి వస్తాయి. డిజైన్ పరంగా అన్నీ ఒకేలా ఉంటాయి. కాని అందులో అందించే సదుపాయాలు మరియు ఫీచర్లన బట్టి వాటి ధరలలో హెచ్చు తగ్గులు ఉంటాయి.

ఇలా ఫీచర్లను అందించి గరిష్ట ధరలకు అమ్మినపుడు కార్ల తయారీ సంస్థలు లాభాలను చవిచూస్తారు. ఇప్పట్లో ఎన్ని కార్లను అమ్మినాము అని కాకుండా ఎంత సంపాదించాము అనే ఫార్ములాతో సాగిపోతున్నాయి కార్ల సంస్థలు. క్రింది కథనంలో జూన్ 2015 నుండి జూన్ 2016 కాలంలో అత్యధిక అమ్ముడుపోయి గరిష్ట డబ్బును వసూలు చేసిన టాప్-10 కార్ల గురించి అందివ్వడం జరిగింది.

10. రెనో క్విడ్

10. రెనో క్విడ్

గత జూన్ 2015 నుండి జూన్ 2016 మధ్య కాలంలో రెనో క్విడ్ లోని టాప్ వేరియంట్ల అమ్మకాల ద్వారా సుమారుహా 338 కోట్ల రుపాయలను ఆర్జించింది.

రెనో క్విడ్ ఫీచర్లు

రెనో క్విడ్ ఫీచర్లు

దీనికి పోటీగా ఉన్న మారుతి ఆల్టోకు ముచ్చెమటలు పట్టిస్తున్న రెనో క్విడ్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఎంతో ముఖ్యంగా నిలిచింది. ఇందులో మీడయానవ్, బ్లూటూత్, యుఎస్‌బి మరియు ఏయుఎక్స్-ఇన్ ఫీచర్లున్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

9. మారుతి సుజుకి ఆల్టో

9. మారుతి సుజుకి ఆల్టో

ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారుగా గత కొన్నేళ్లపాటు ఈ ఆల్టోనే మొదటి స్థానంలో నిలిచింది. టాప్ వేరియంట్లోని ఆల్టో అమ్మకాల ద్వారా మారుతి సుమారుగా 510 కోట్ల రుపాయలను ఆర్జించింది.

ఆల్టో ఫీచర్లు

ఆల్టో ఫీచర్లు

మారుతి ఇందులో ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచం చేసింది. అయితే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ల గురించి చూస్తే సేల్స్ తరువాత ఉత్తమ సర్వీసింగ్ మరియు తక్కువ ధరలో స్పేర్ పార్ట్స్ అదే విధంగా మంచి రీసేల్ వ్యాల్యూ వంటివి దీనికి బాగా కలిసొచ్చిన అంశాలు.

8. మారుతి సుజుకి బాలెనొ

8. మారుతి సుజుకి బాలెనొ

గత ఏడాదిలో దేశీయ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి మారుతి విడుదల చేసిన బాలెనొ ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. టాప్ ఎండ్ వేరియంట్ల బాలెనొ అమ్మకాల ద్వారా మారుతి సుమారుగా 530 కోట్ల రుపాయలను ఆర్జించింది.

బాలెనొ ఫీచర్లు

బాలెనొ ఫీచర్లు

బాలెనొలో స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్ ప్లే మరియు ఇంకా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

7.మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్

7.మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్

మారుతి వారి పాత మోడల్స్‌లో వ్యాగన్ఆర్ ఒకటి. కాని ఏ మాత్రం తడబడకుండా మంచి నిలకడగా అమ్మకాలు సాధింస్తోంది. వ్యాగన్ఆర్ టాప్ ఎండ్ వేరియంట్ల అమ్మకాల ద్వారా మారుతి సుమారుగా 557 కోట్ల రుపాయలను సంపాదించిది.

వ్యాగన్ఆర్ లోని ఫీచర్లు

వ్యాగన్ఆర్ లోని ఫీచర్లు

మారుతి వ్యాగన్ఆర్ టాప్ ఎండ్ వేరియంట్లో ఉత్తమ స్టోరేజ్ సామర్థ్యం, యుఎస్‌బి సపోర్ట్ గల మ్యూజిక్ సిస్టమ్, ఆప్షనల్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఉత్తమ మైలేజ్ దీని సొంతం.

6. మారుతి సుజుకి స్విఫ్ట్

6. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి వారి స్విఫ్ట్ మారుతిలోని బాలెనొతో గట్టి పోటీని ఎదుర్కుంటోంది. అయినప్పటికీ స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌ల విభాగంలో మంచి అమ్మకాలు సాధిస్తోంది. స్విఫ్ట్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ల అమ్మకాల ద్వారా సుమారుగా 582 కోట్ల రుపాయలను ఆర్జించింది.

ఉత్తమ మైలేజ్ అదే విధంగా మంచి రీసేల్ వ్యాల్యూ దీనికి విజయానికి బాగా కలిసొచ్చిన అంశాలని చెప్పవచ్చు.

మారుతి స్విప్ట్ లోని ఫీచర్లు

మారుతి స్విప్ట్ లోని ఫీచర్లు

ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీ లెస్ ఎంట్రీ మరియు ఆటో ఇండస్ట్రీలో అత్యంత ఉత్తమమైన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఇందులో కలవు.

5. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

5. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మోటార్స్ దేశీయ మార్కెట్లోకి పరిచయం చేసిన మొదటి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20. భద్రత, ఫీచర్లు, హ్యాండ్లింగ్ మరియు స్టెబిలిటి పరంగా ఇది ఎంతో ఉత్తమంగా నిలిచింది. ఎలైట్ ఐ20 లోని టాప్ ఎండ్ వేరియంట్ల ద్వారా జరిగిన అమ్మకాల్లో 787 కోట్ల రుపాయలను సంపాందించింది.

ఎలైట్ ఐ20 లోని ఫీచర్లు

ఎలైట్ ఐ20 లోని ఫీచర్లు

ఇందులో టచ్ స్క్రీన్ ఆడియో మరియు వీడియో సిస్టమ్, ఆటోమేటిక్ ఏ/సి కంట్రోల్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కూల్డ్ గ్లూవ్ బాక్స్ లతో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ఇందులో ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం కావాల్సి ఉంది. ఈ కారణం చేతనే దీనికి పోటీగా ఉన్న బాలెనో దీని సేల్స్‌ను హరించివేస్తోంది.

4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ ఫోర్ట్ ఫోలియోలో నిలకడగా అమ్మకాలు సాధిస్తున్న వాటిలో గ్రాండ్ ఐ10 ఒకటి. గ్రాండ్ ఐ10 టాప్ ఎండ్ వేరియంట్ల అమ్మకాల ద్వారా గరిష్టంగా 842 కోట్ల రుపాయలను ఆర్జించింది.

గ్రాండ్ ఐ10 లోని ఫీచర్లు

గ్రాండ్ ఐ10 లోని ఫీచర్లు

ఇందులో ఆప్షనల్ డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ గల స్మార్ట్ కీ, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల ఓఆర్‌విఎమ్స్ కలవు.

3. హ్యుందాయ్ క్రెటా

3. హ్యుందాయ్ క్రెటా

రెనో వారు మొదటి సారిగా డస్టర్ ద్వారా కాంపాక్ట్ ఎస్‌యువిని పరిచయం చేసినప్పటికీ, హ్యుందాయ్ మోటార్స్ అందుబాటులోకి తెచ్చిన క్రెటా ఈ సెగ్మెంట్లో మొదటి స్థానంలో నిలిచింది. క్రెటా టాప్ ఎండ్ వేరియంట్ల అమ్మకాల ద్వారా సుమారుగా 952 కోట్ల రుపాయలను సంపాదించింది.

హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు

హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు

టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏ/సి, ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్ క్లైంబ్ కంట్రోల్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2.మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

2.మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

ఇండియన్ మార్కెట్లో సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ సెడాన్‌లు చాలానే ఉన్నాయి. కాని స్విఫ్ట్ డిజైర్ తరహాలో లేవు. ఎంతో కాలంగా ఈ సెగ్మెంట్లో మొదటి స్థానంలో నిలుస్తూనే వచ్చింది. స్విఫ్ట్ డిజైర్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ల అమ్మకాల ద్వారా సుమారుగా 1,103 కోట్ల రుపాయలను మారుతి ఆర్జించింది.

స్విఫ్ట్ డిజైర్‌లోని ఫీచర్లు

స్విఫ్ట్ డిజైర్‌లోని ఫీచర్లు

ఇందులో ఇంజన్ పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు.

1. టయోటా ఇన్నోవా

1. టయోటా ఇన్నోవా

అమ్మకాల్లో అత్యధిక డబ్బును వసూలు చేసే ఉత్పత్తుల్లో ఇన్నోవా మొదటి స్థానంలో ఉంది. టయోటా ఇన్నోవాలోని టాప్ వేరియంట్ల అమ్మకాల ద్వారా సుమారుగా 1,449 కోట్ల రుపాయల బిజినెస్ జరిగింది, ఇందులో టయోటా ఇన్నోవా క్రిస్టాలోని టాప్ ఎండ్ వేరియంట్ల అమ్మకాలు బాగా కలిసొచ్చాయి.

ఇన్నోవా లోని ఫీచర్లు

ఇన్నోవా లోని ఫీచర్లు

పడల్ ల్యాంప్స్, ఆంబియంట్ ఎల్‌ఇడి ఇల్యుమినేషన్, ప్రీమియమ్ లెథర్ సీట్లు, డిజిటల్ డిస్ల్పే గల రియర్ ఏ/సి, కప్ హోల్డర్ గల ఫోల్డబుల్ సీట్లు, ఏడు ఎయిర్ బ్యాగులు, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

 
English summary
Top 10 Selling Cars In Terms Of Value — Is Your Car On The List?
Story first published: Wednesday, August 10, 2016, 14:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos