ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

By Anil

భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ మరియు ఎకో ఫ్రెండ్లీ కార్లను పూర్తి స్థాయిలో వినియోగించే దిశగా చట్టం తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. నానాటికీ పెరుగిపోతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రజలు కాలుష్య రహిత వాహనాలను కొనుగోలు చేసే దిశగా అవగాహన కల్పిస్తోంది.

డీజల్ మరియు పెట్రోల్ వాహనాల కన్నా తక్కువ కాలుష్యంతో ఎక్కువ మైలేజ్‌నిచ్చే వాహనాలలో సిఎన్‌జి (సంపీడన సహజ వాయువు) ఇంధనంతో నడిచే వాహనాలు అందుబాటులో ఉన్నాయి. మీ వంతు కాలుష్యాన్ని నిర్మూలించాలి అనుకుంటే ఈ సిఎన్‌జి వాహనాలను కొనుగోలు చేయండి. మీ కోసం నేడు ఎనిమిది ఉత్తమ సిఎన్‌జి కార్ల గురించి ఈ కథనం ద్వారా అందిస్తున్నాము.

08. మారుతి సుజుకి ఎర్టిగా

08. మారుతి సుజుకి ఎర్టిగా

సిఎన్‌జి ఇంధన ఆప్షన్‌ను మనం కేవలం హ్యాచ్‌బ్యాక్ మరియు ఎంట్రీలెవల్ ఎక్కువగా చూసుంటాం కాని ఎమ్‌పివి సెగ్మెంట్లో సిఎన్‌జి ఇంధనంతో నడిచే ఏకైక కారు మారుతి సుజుకి ఎర్టిగ. ఎమ్‌పివి సెగ్మెంట్లో సిఎన్‌జితో నడిచే వాహనాన్ని ఎంచుకునే వినియోగదారుల కోసం మారుతి సుజుకి ఈ ఎర్టిగాను ప్రవేశపెట్టింది. ఇందులో పూర్తి స్థాయిలో సిఎన్‌జి కిట్‌ను అందించింది.

ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

మారుతి సుజుకి తమ ఎర్టిగా వివిటి పెట్రోల్ ఇంజన్‌లో సిఎన్‌జి కిట్‌ను అమర్ఛింది. ఇందులో 1373 సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను అందించింది. లగేజ్‌ స్పేస్‌లో సిఎన్‌జి ట్యాంకును అమర్ఛడం వలన ఇందులో లగేజ్‌ స్పేస్ లేదు అని చెప్పవచ్చు.

ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

  • ఎర్టిగా సిఎన్‌జి మైలేజ్ 22.08 కిమీ/కేజి
  • ఎర్టిగా పెట్రోల్ మైలేజ్ 16.02 కిమీ/లీ
  • ఎర్టిగా సిఎన్‌జి ధర సుమారుగా రూ. 8.13 లక్షలు ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)
  • 07. హ్యుందాయ్ జెంట్ సిఎన్‌జి

    07. హ్యుందాయ్ జెంట్ సిఎన్‌జి

    హ్యుందాయ్ మోటార్స్ తమ జెంట్ కాంపాక్ట్ సెడాన్ కారులో సిఎన్‌జి కిట్‌ను అందించారు. అయితే ఢిల్లీ వంటి కొన్ని నగరాలకు మాత్రమే వీటిని అందుబాటులో ఉంచారు. హ్యుందాయా తన గ్రాండ్ ఐ10 లో వినియోగించిన సిన్‌జి వ్యవస్థను ఇందులో వినియోగించింది.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    హ్యుందాయ్ వారి జెంట్ సిఎన్‌జి వ్యవస్థను తమ సాధారణ 1.2-లీటర్ కప్పా ఇంజన్‌లో అమర్చారు. ఇది 70 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    హ్యుందాయ్ మోటార్స్ తమ జెంట్ సిఎన్‌జి వేరియంట్ మీద రెండు సంవత్సరాల వరకు అన్‌లిమిటెడ్ కిలోమీటర్ వారంటీని ప్రకటించింది. సాధారణ జెంట్ పెట్రోల్ వేరియంట్ కన్నా దీని ధర 70,000 వరకు అదనంగా ఉండే అవకాశం ఉంది.

    06. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

    06. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

    హ్యుందాయ్ మోటార్స్ తమ గ్రాండ్ ఐ10 శ్రేణి కార్లలో 2013 లో సిఎన్‌జి వ్యవస్థను అందించింది. దీంతో గ్రాండ్ ఐ10 శ్రేణిలో పెట్రోల్, డీజల్ మరియు సిఎన్‌జి వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    70 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌‌కు హ్యుందాయ్ సిఎన్‌జి కిట్‌ను అమర్ఛింది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసందానం చేసింది.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    ఇదే పెట్రోల్ ఇంజన్ గల హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు ధర కన్న గ్రాండ్ ఐ10 సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 70,000 ల వరకు అదనంగా ఉంటుంది. ఈ సిఎన్‌జి వేరింట్ కార్లను ఢిల్లీ వంటి కేవలం కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంచారు.

    05. మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి

    05. మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి

    మారుతి సుజుకి సంస్థ సుమారుగా దశాబ్ద కాలం పాటు సిఎన్‌జి, పెట్రోల్ మరియు డీజల్ వంటి ఎంట్రీ లెవల్ కార్ల మీద ఆధిపత్యం చెలాయిస్తూనే వచ్చింది. ఈ మధ్య వచ్చి చేరుతున్న రెనో క్విడ్ వంటి కొత్త కార్లు కూడా వీటిని తాకలేకపోతున్నాయి. మారుతి వారు అత్యంత శక్తివంతమైన కె10 కారులో సిఎన్‌జిని పరిచయం చేశారు.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    ఆల్టో కె10 లో సిఎన్‌జి వేరియంట్ కోసం 998 సీసీ పెట్రోల్ ఇంజన్‌ను వినియోగించారు. ఇది పెట్రోల్ ఇంధనాన్ని వినియోగించుకుంటే 68 పిఎస్ పవర్ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ అధేవిదంగా సిఎన్‌జి ఇంధనంగా వినియోగించుకుంటే 59 పిఎస్ పవర్ మరియు 78 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    ఆల్టో కె10 లోని పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 24.07 కిలోమీటర్లు మరియు సిఎన్‌జి వేరియంట్ మైలేజ్ 32.26 కిలోమీటర్/కిలోగా ఉంది. మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి ధర సుమారుగా రూ. 4.8 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

    04. మారుతి వ్యాగన్ ఆర్ సిఎన్‌జి

    04. మారుతి వ్యాగన్ ఆర్ సిఎన్‌జి

    స్మాల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మరొక అత్భుతమైన ఛాన్స్ మారుతి వ్యాగన్ ఆర్. ఇప్పుడు ఇది కూడా సిఎన్‌జి వేరింయట్లో కలదు. మారుతి తమ వ్యాగన్‌ ఆర్ కారులోని ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్లో ఉన్న 998 సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌కు ఈ సిఎన్‌జ్‌ కిట్‌ను అమర్చారు.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    వ్యాగన్‌ ఆర్ లోని ఇంజన్ పెట్రోల్ ఇంధనాన్ని వినియోగించుకుంటే 67.04 బిహెచ్‌పి పవర్‌ను అదే విధంగా సిఎన్‌జి ఇంధనాన్ని వినియోగించుకుంటే 58.16 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    మారుతి సుజుక లోని వ్యాగన్ ఆర్ కారు మైలేజ్‌కు రారాజు అని చెప్పవచ్చు. అది పెట్రోల్ గాని లేదంటే సిఎన్‌జి గానీ అత్భుతమైన మైలేజ్ దీని నైజం. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఎల్‌ఎక్స్ఐ సిఎన్‌జి ధర రూ. 4.66 లక్షలు మరియు వ్యాగన్ ఆర్ ఎల్‌ఎక్స్ఐ సిఎన్‌జి (ఒ) ధర రూ. 4.85 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

    03. మారుతి సుజుకి సెలెరియో

    03. మారుతి సుజుకి సెలెరియో

    మారుతి సుజుకి సెలెరియో కారును ఇండియాలోకి లాంచ్ చేసినప్పుడు వీటి బుకింగ్ సంభందించి తీవ్రమైన సునామి రేగింది. ఎంట్రీ కార్ల విభాగంలోకి వచ్చిన ఇందులో భారీ స్థాయిలో ఫీచర్లు రావడం మరియు ఫ్యాక్టరీ నుండే సిఎన్‌జి ఆప్షన్‌ గల కార్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఈ కారణాల రిత్యా అప్పట్లో భారీ బుకింగ్స్ నమోదయ్యాయి.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    సెలెరియో గ్రీన్ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన సెలెరియో సిఎన్‌జి వేరియంట్లో సాధారణ 1.0-లీటర్‌ పెట్రోల్ ఇంజన్‌ను వినియోగించారు. ఇందులోని సిఎన్‌జి వ్యవస్థలో ఎమ్‌ఎస్ఐ పేటెంట్ పొందిన ఐజిపిఐ సిస్టమ్‌ను అందించారు. దీనిని మనం వ్యాగన్‌ ఆర్ మరియు ఎర్టిగాలలో గమనించవచ్చు.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    ఇందులోని సిఎన్‌జి ఇంజన్ కిలో గ్యాస్‌కు సుమారుగా 31.7 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇవ్వగలిగింది. మారుతి సెలెరియో సిఎన్‌జి ధర రూ. 4.99 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

    02. మారుతి ఆల్టో 800 సిఎన్‌జి

    02. మారుతి ఆల్టో 800 సిఎన్‌జి

    మారుతి సుజుకి వారి వరుసగా ఐదవ ఉత్పత్తి ఈ ఉత్తమ సిఎన్‌జి కార్ల విభాగంలో చోటు సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే మారుతి విజయంలో ఆల్టో అనే పేరు ఎంతో కీలకం అని చెప్పవచ్చు. మారుతి ఆల్టో పేరుతో అందించిన అన్ని కార్లలో కూడా సిఎన్‌జి ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    మారుతి వారి ఎంట్రీ లెవర్ హ్యాచ్‌బ్యాక్ కారు అయిన ఆల్టో 800లో 800సీసీ కెపాసిటి గల ఎఫ్8డి ఇంజన్‌ను వినియోగించారు. ఇది పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంధనాన్ని వినియోగించినపుడు ఒకే విధమైన పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది అని వెల్లడించినప్పటికీ దీనిని నడిపిన చాలా మంది వినియోగదారులు రెండు ఇంధనాలు విడుదల చేసే పవర్‌ను డ్రైవ్ చేస్తున్నప్పుడు గమనించినట్లు తెలిపారు.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    ఆల్టో 800లో పెట్రోల్ ఇంధనాన్ని వినియోగించినపుడు 22.74 కిమీలు మరియు సిఎన్‌జి ఇంధనాన్ని వినియోగించినపుడు 30.46 కిలోమీటర్లు ఉత్పత్తి చేయును. మారుతి ఆల్టో 800 సిఎన్‌జి ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.77 లక్షలుగా ఉంది.

    01. టాటా నానో ఇమ్యాక్స్

    01. టాటా నానో ఇమ్యాక్స్

    టాటా మోటార్స్ ప్రారంభంలో డీజల్ ఇంజన్‌ల శకానికి నాంది పలికినప్పటికీ ఆ తరువాత కాలంలో పెట్రోల్ మరియు సిఎన్‌‌జి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. సిఎన్‌జి వాహనాలకు చక్కటి రూపం అంటే టాటా వారి నానో ఇమ్యాక్స్ అని చెప్పవచ్చు. అంతే కాదండోయ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చవకైన కారులో రెండు ఇంధన ఆప్షన్లు కూడా ఉన్నాయి. అవి పెట్రోల్ మరియు సిఎన్‌జి.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    ఇంత చిన్న కారులో సిఎన్‌జి ఇంధనం నింపడానికి సిలిండర్‌ను ఎక్కడ అమర్చారు అనే అనుమానం చాలా మందికి ఇప్పటికే కలిగి ఉంటుంది. ప్రయాణికులకు మరియు లగేజ్ పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సిఎన్‌జి సిలిండర్‌ను డ్రైవర్ సీటు క్రింది అమర్చారు. ఇక డ్రైవర్ స్టార్ట్ చేసే ముందు సిఎన్‌జి లేదా పెట్రోల్ అనే ఇంధనాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను ఇందులో కలదు.

    ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

    టాటా నానో ఇమ్యాక్స్‌లో పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంధనాన్ని ఎంపిక చేసుకోవడానికి సీక్విన్షియల్ గ్యాస్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు అడ్వాన్స్‌డ్ ఇంజన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కలదు. తద్వారా ఇంధనాని సులభంగా ఎంపిక చేసుకోవచ్చు.

    • పెట్రోల్ మైలేజ్: 26 కిలోమీటర్/లీటర్
    • సిఎన్‌జి మైలేజ్ : 36 కిలోమీటర్/కేజి
    • ధర సుమారుగా రూ. 2.88 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
    • ఎక్కువ మంది చదివిన కథనాలు...

      • ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు
      • 150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు
      • ఎక్కువ మంది చదివిన కథనాలు...

        • సముద్రంలో ఉన్న దెయ్యం నౌకలు, వాటి వెనక దాగున్న రహస్యాలు ...!!
        • మీ కారు నుండి గరిష్ట మైలేజ్‌ను పొందటం ఎలా....!!

Most Read Articles

English summary
Top 8 Best CNG Cars in India
Story first published: Monday, May 9, 2016, 16:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X