2016 లో విడుదలకు సిద్దమైన ఎయమ్‌టి ఆప్షన్ గల టాప్-5 కార్లు

By Anil

ఆటో మొబైల్ ప్రపంచంలో ప్రతి రోజూ ఒక కొత్త ఆవిష్కరణ బయట పడుతునే ఉంటుంది. ఆ ఆవిష్కరణ కాస్త ఎన్నో రకాల సంస్థలకు చేతి నిండా డబ్బును సంపాదించి పెడుతుంది. ఆటోమొబైల్ ప్రపంచం ఈ నూతన సంవత్సరంలో మనకు ఏయమ్‌టి ఆప్షన్‌ పరిచయం చేయనుంది.

ఆటోమేటిక్‌ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్ ఆప్షన్‌‌తో కొన్ని కార్లు సందడి చేయనున్నాయి. పెద్ద పెద్ద కార్లలో ఈ ఎయమ్‌టి ఆప్షన్ ఉండటం సాధారణమే అదే ఎంట్రీ లెవల్ కార్లలో ఈ గేర్ బాక్స్‌ను ప్రవేశ పెడితే ఎలా ఉంటుందంటారు. అచ్చం ఇలాంటి ప్రయత్నమే కొన్ని కార్ల సంస్థలు చేయనున్నాయి.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో 2016 విడుదల అవుతున్న టాప్-5 కార్లు

5. మహీంద్రా క్వాంటో ఫేస్‌లిఫ్ట్

5. మహీంద్రా క్వాంటో ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా వారి క్వాంటో కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ను అందించారు. దీనిని 2016 ప్రారంభంలో దీనిని అందివ్వనున్నారు. ఈ క్వాంటో ఫేస్ లిఫ్ట్ కారును సరికొత్త అవతారంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

క్వాంటో సాంకేతిక వివరాలు

క్వాంటో సాంకేతిక వివరాలు

ఇందులో 1.5-లీటర్ కెపాసిటిల గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ అందుబాటులో ఉండనుంది. ఇది దాదాపుగా 100 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.మరియు అభివృద్దిపరిచిన డిజైన్ మరియు సస్పెన్షన్ ఇందులో కలవు.

4. మారుతి సుజుకి డిజైర్

4. మారుతి సుజుకి డిజైర్

భారత దేశంలో ఉన్న కార్ల తయారీ సంస్థలలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అన్ని మోడల్స్‌లో అందించాలని ప్రయత్నిస్తున్న ఏకైక సంస్థ మారుతి సుజుకి. తమ ఎంట్రీ లెవల్ కార్లలో విజయవంతంగా ఏయమ్‌టి గేర్ బాక్స్‌ను అందించింది. అందులో సెలెరియో మరియు ఆల్టో కె10 కార్లు ఈ ఆప్షన్‌తో వచ్చాయి. ఇప్పుడు మారుతి సుజుకిలో ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు డిజైర్ సెడాన్‌ కార్లలో ఎయమ్‌టి ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానున్నారు.

డిజైర్ సాంకేతిక వివరాలు

డిజైర్ సాంకేతిక వివరాలు

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారులో దాదాపుగా ముందు ఫీచర్లు ఇందులో రానున్నాయి. ఇందులో 1,248 సీసీ కెపాసిటి గల డిడిఐయస్ డీజల్ ఇంజన్ మరియు ఆటేమేటిక్ ట్రాన్స్‌‌మిషన్ గల గేర్ బాక్స్‌తో ఇది మన ముందుకు 2016 జనవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎయమ్‌టి స్విఫ్ట్ డిజైర్ ధర సాధారణ స్విఫ్ట్ డిజైర్ కన్నా 35,000 నుండి 40,000 రుపాయల వరకు ఎక్కువగా ఉండనుంది.

3. డాట్సన్ రెడి గో

3. డాట్సన్ రెడి గో

చౌక ధరలకు కార్లను అందించే సంస్థగా బాగా పేరు తెచ్చుకున్న డాట్సన్ సంస్థ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అందిస్తోంది. కామన్ మాడ్యులర్ ఫ్యామిలీ వేదిక మీద తమ డాట్సన్ ‌రెడి గో కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

ఇందులో ప్రస్తుతం మూడు సిలిండర్లు గల పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో అందుబాటులో కలదు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో మరియు హ్యూందాయ్ ఇయాన్ వంటి కార్లకు గట్టి పోటీగా నిలవనుంది. దీని ధర దాదాపుగా మూడు లక్షల వరకు ఉండనుంది.

02. టాటా జికా ఎయమ్‌టి

02. టాటా జికా ఎయమ్‌టి

టాటా జికా కారులో కూడా ఏయమ్‌టి ఆప్షన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అప్పుడే పుకార్లు కూడా మొదలయ్యాయి. అయితే ఈ ఎయమ్‌టి ని పెట్రోల్ లేదా డీజల్ ఏ వెర్షన్‌లో అందిస్తారో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రెండింటిలో కూడా ఏయమ్‌టి ఆప్షన్ అందించే అవకాశం కూడా లేకపోలేదు.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి సెలెరియో, హ్యుందాయ్ ఐ 10 మరియు షెవర్లే బీట్ వంటి కార్లకు పోటిగా వచ్చిన టాటా జికా కారులో 1.2-లీటర్ మూడు సిలిండర్ల డిఒహెచ్‌సి ఆల్యూమినియం పెట్రోల్ ఇంజన్ కలదు ఇది దాదాపుగా 83.3 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మరియు ఇందులో 1.0-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు ఇది దాదాపుగా 69 బిహెచ్‍‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

01. రెనో క్విడ్ ఎయమ్‌టి

01. రెనో క్విడ్ ఎయమ్‌టి

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రనో భారత్‌లో విడుదల చేసిన క్విడ్ కారు ద్వారా విశిష్ఠ గుర్తింపును తెచ్చుకుంది. రనో వారు విడుదల చేసిన ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ కారు ఏకంగా 75,000 బుకింగ్స్‌ను నమోదు చేసుకుని కనీవిని ఎరుగని విజయపరంపరను కొనసాగిస్తోంది. అందుకోసం రెనో వారు ఈ క్విడ్ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వనున్నారు.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

1.0-లీటర్ కెపాసిటి గల ఇంజన్ గల రెనో ఆటోమేటిక్ కారును 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనునన్నారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800 మరియు హ్యుందాయ్ ఇయాన్ కార్లకు ప్రత్యక్ష పోటిని ఇవ్వనుంది.

2016 లో ఎయమ్‌టి ఆప్షన్‌తో విడుదల కానున్న టాప్-5 కార్లు

ఈ కథనం గురించి మీ స్పందను కామెంట్ల రూపంలో క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. మరియు ఇది మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి.

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో జరగనుంది దీనికి సంభందించిన మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.మరియు అక్కడ ప్రదర్శించేే అత్యాధునిక వాహనాల గురించి తెలుసుకోవడానికి మాతో కలసి ఉండండి

Most Read Articles

English summary
Upcoming Affordable Cars With Amt In India
Story first published: Friday, January 1, 2016, 14:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X