ఈ వాహనాలు విడుదలైతే ఇక ఎస్‌యువి సెగ్మెంట్ పూర్తిగా మహీంద్రా ఆధీనంలోకే...!!

By Anil

భారతీయ ఎస్‌యువి సెగ్మెంట్లో అత్యధిక ఉత్పత్తులను అందిస్తున్న ఏకైక దేశీయ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. విరివిగా ఎస్‌యువిలను అందించడంలో నూతన ఉత్పత్తులకు శ్రీకారం చుడుతూ ఏ సంస్థ కూడా ఊహించని రీతిలో ఎస్‌యువిలను అందిస్తోంది.

మహీంద్రా రానున్న 2016-17 ఏడాదిలో దేశీయంగా అందుబాటులోకి తీసుకురానున్న ఎస్‌యువి‌ల గురించి క్రింది కథనంలో......

మహీంద్రా స్కార్పియో పెట్రోల్

మహీంద్రా స్కార్పియో పెట్రోల్

దేశ వ్యాప్తంగా డీజల్ కార్ల వినియోగదారుల సంఖ్య నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. అందుకు కొన్ని నగరాలలో డీజల్ వాహనాల బ్యాన్‌ కూడా ఒక బలం చేకూర్చింది. దీని వలన పెట్రోల్ మరియు డీజల్ వాహనాల మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. మహీంద్రా వారికి ఉత్తమంగా అమ్మకాలు సాధించి పెడుతున్న వాహనాలలో పెట్రోల్ ఆప్షన్‌ లేకపోయే సరికి అమ్మకాలు కాస్త తగ్గాయి. అందుకోసం తమ స్కార్పియోను పెట్రోల్ వేరియంట్‌లో అందివ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది.

2016-17 మధ్య విడుదల కానున్న మహీంద్రా వారి కొత్త కార్లు

పెట్రోల్ స్కార్పియో కోసం సాధారణ స్కార్పియోను పోలి ఉండే డిజైన్‌ను అందిస్తూ స్వల్ప మార్పులను మాత్రమే జోడించారు. మహీంద్రా అందిస్తున్న పెట్రోల్ స్కార్పియోలో 2.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

2016-17 మధ్య విడుదల కానున్న మహీంద్రా వారి కొత్త కార్లు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 140బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర అంచనా 8 నుండి 12 లక్షలు

విడుదల అంచనా ఆగష్టు-సెప్టెంబర్ 2016

మహీంద్రా ఎక్స్‌యువీ500 పెట్రోల్

మహీంద్రా ఎక్స్‌యువీ500 పెట్రోల్

మహీంద్రా వారి మరొక బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువి ఎక్స్‌యువీ500. ఇది కూడా డీజల్ బ్యాన్ దెబ్బకు కొద్దిగా నేల చూపులకు పరిమితం అయ్యింది. కాని డీజల్ ఎస్‌యువిలలో ఈ ఎక్స్‌యువీ500 మంచి అమ్మకాలను సాధించేది. మహీంద్రా ఇపుడు దీనిని కూడా పెట్రోల్ వేరియంట్లో అందబాటులోకి తీసుకువస్తోంది.

2016-17 మధ్య విడుదల కానున్న మహీంద్రా వారి కొత్త కార్లు

మహీంద్రా ఈ సరికొత్త పెట్రోల్ వేరియంట్ ఎక్స్‌యూవీ500లో 2.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనుంది. ఇది సుమారుగా 140బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 మహీంద్రా ఎక్స్‌యువీ500 పెట్రోల్ ధర మరియు విడుదల వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువీ500 పెట్రోల్ ధర మరియు విడుదల వివరాలు

  • ధర అంచనా 11 నుండి 15 లక్షలు
  • విడుదల అంచనా ఆగష్టు-అక్టోబర్ 2016
  •  మహీంద్రా ఎక్స్‌యువి ఏరో

    మహీంద్రా ఎక్స్‌యువి ఏరో

    మహీంద్రా అండ్ మహీంద్రా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఈ ఎక్స్‌యువీ ఏరో కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. వాహన ప్రదర్శన వేదిక మీద దీని డిజైన్ చూసి ప్రదర్శకులు ఎంతో ఆశ్చర్యపోయారు. దీనిని ఎక్స్‌యువీ500 యొక్క కూపే కారుగా అభివర్ణించారు.

    2016-17 మధ్య విడుదల కానున్న మహీంద్రా వారి కొత్త కార్లు

    మహీంద్రా నుండి ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్‌యువిలలో ఏరో ఒకటి. ఇందులో 2.2 లీటర్ సామర్థ్యంతో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లను అందివ్వనున్నారు. దీని ద్వారా సుమారుగా 200 బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి అవుతుంది.

    మహీంద్రా ఏరో ధర మరియు విడుదల వివరాలు

    మహీంద్రా ఏరో ధర మరియు విడుదల వివరాలు

    • ధర అంచనా 20 నుండి 25 లక్షల మధ్య ఉండవచ్చు
    • విడుదల అంచనా 2017 నాటికి
    • మహీంద్రా ఎక్స్‌యువి500 హైబ్రిడ్

      మహీంద్రా ఎక్స్‌యువి500 హైబ్రిడ్

      మహీంద్రా ఇప్పుడు హైబ్రిడ్ వాహనాల అభివృద్ది మీద దృష్టి సారించింది. అందుకోసం తమ ఎక్స్‌యువి500 ను హైబ్రిడ్ రూపంలో ప్రదర్శిస్తోంది. డీజల్ ఇంజన్‌లు పెట్రోల్ ఇంజన్‌ల కన్నా ఎక్కువ బరువులను లాగుతాయి. డీజల్ మరియు పెట్రోల్ రెండింటి ధరలు కాస్త అటు ఇటుగా ఒకే విధంగా ఉంటాయి. అందుకోసం మహీంద్రా డీజల్ స్థానంలో హైబ్రిడ్ ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుడుతోంది.

      2016-17 మధ్య విడుదల కానున్న మహీంద్రా వారి కొత్త కార్లు

      మహీంద్రా ఎక్స్‌యువి500 ను హైబ్రిడ్ రూపంలో అందివ్వనుంది. దీని కోసం 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ మరియు దీనికి అదనంగా ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానం చేయనున్నారు. మైలేజ్ పరంగా ఇది ఉత్తమంగా నిలుస్తుంది.

      ఎక్స్‌యువి500 హైబ్రిడ్ ధర మరియు విడుదల వివరాలు

      ఎక్స్‌యువి500 హైబ్రిడ్ ధర మరియు విడుదల వివరాలు

      • ధర అంచనా రూ. 15 నుండి 17 లక్షల మధ్య
      • విడుదల అంచనా 2017 నాటికి
      • శాంగ్‌యాంగ్ టివోలి

        శాంగ్‌యాంగ్ టివోలి

        మహీంద్రా సంస్థ దేశీయంగా ఉన్న అన్ని రకాల ఎస్‌యువిలకు పోటిగా తమ ఉత్పత్తులను తీసుకువచ్చింది. అయినప్పటికీ హ్యుందాయ్ వారి క్రెటా మరియు రెనో వారి డస్టర్‌కు పోటిని తీసుకురాలేకపోయింది. దీనికోసం కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ సంస్థకు ఇండియాలో చేయూతగా నిలిచిన మహీంద్రా శాంగ్‌యాంగ్ వారి ఉత్పత్తులను దేశీయంగా విడుదల చేయాలని చూస్తోంది.

        2016-17 మధ్య విడుదల కానున్న మహీంద్రా వారి కొత్త కార్లు

        శాంగ్‌యాంగ్ వారి టివోలి ఎస్‌యువిలో 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్ రానుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ 126బిహెచ్‌‌పి పవర్ మరియు 160ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదేవిధంగా డీజల్ ఇంజన్ 113బిహెచ్‌‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

        శాంగ్‌యాంగ్ టివోలి ధర మరియు విడుదల వివరాలు

        శాంగ్‌యాంగ్ టివోలి ధర మరియు విడుదల వివరాలు

        • ధర అంచనా 8 నుండి 12 లక్షలు
        • విడుదల అంచనా 2016 చివరి నాటికి లేదా 2017 ప్రారంభం నాటికి
        • శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్

          శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్

          మహీంద్రా వారి ఆధ్వర్యంలో ఇప్పటికే శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఎస్‌యువిని అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ, దీనిని మరింత అప్ డేటెడ్ వర్షెన్‌లో తీసుకురానుంది. ఈ 2017 శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ మునుపటి రెక్ట్సాన్ కన్నా చాలా వరకు తక్కువ బరువుతో తయారుకానుంది.

          2016-17 మధ్య విడుదల కానున్న మహీంద్రా వారి కొత్త కార్లు

          మహీంద్రా శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ లో 2.0 లీటర్ టర్భో పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ డీజల్ ఇంజన్ రానుంది. ఈ రెండు ఇంజన్‌లకు మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

           శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ధర మరియు విడుదల వివరాలు

          శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ధర మరియు విడుదల వివరాలు

          • ధర అంచనా 25 నుండి 30 లక్షలు
          • విడుదల అంచనా 2017 నాటికి
          • మరిన్ని కథనాల కోసం.....

            మారుతి వారి 2016-17 అప్ కమింగ్ కార్లు ఇవే

            హ్యుందాయ్ మోటార్స్‌ యొక్క 2016-17 అప్‌కమింగ్ కార్ల వివరాలు

Most Read Articles

English summary
Here Are The Upcoming Cars From Mahindra In 2016-17
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X