మారుతి సుజుకి డిజైర్ వర్సెస్ వోక్స్‌వ్యాగన్ అమియో

By Anil

వోక్స్‌వ్యాగన్ వారు దేశీయ మార్కెట్లోకి ఈ నెల మొదటి వారంలో తమ కాంపాక్ట్ సెడాన్ అమియో కారును ప్రదర్శించింది. దీని రాకతో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న సెడాన్ కార్ల మధ్య పోటి మరింత పెరగనుంది. బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కార్లలలో మారుతి సుజుకి వారి స్విఫ్ట్ డిజైర్ కారు మొదటి స్ఠానంలో ఉంది.
Also Read: మారుతి సుజుకి బ్రిజా ముందు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఆటలు ఇక మీదట సాగవు
అయితే అమియో కారు స్విఫ్ట్ సెడాన్ కారుకు పోటిగా నిలవనుందని మార్గెట్ వర్గాల అంచనా. అందుకోసం ఈ రెండింటి మధ్య గల తేడాలను క్రింది కథనం ద్వారా అందివ్వడం జరిగింది. మరిన్ని వివరాలకు క్రింది స్లైడర్లను గమనించండి.

 ధర

ధర

  • మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ధర రూ. 5,46,063 నుండి 8,19,481 (ఎక్స్ షో రూమ్ ముంబాయ్)గా ఉంది.
  • అమియో - వోక్స్‌వ్యాగన్ వారు దీని ధర ను ఇంకా ప్రకటించలేదు.
  • డిజైర్ డిజైన్

    డిజైర్ డిజైన్

    దేశ వ్యాప్తంగా అత్యంత అధికంగా అమ్ముడుపోతున్న సెడాన్ కార్లలో మారుతి సుజుకి వారి డిజైర్ కారు మొదటి స్థానంలో ఉంది. దీనికి డిజైర్ డిజైన్ ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు. కారు మొత్తం ఎటువంటి పదునైన డిజైన్ లేకుండా అందంగా ప్రతి మూలలను కూడా చక్కగా డిజైన్ చేశారు.

    అమియో డిజైన్

    అమియో డిజైన్

    వోక్స్‌వారు మార్కెట్లోకి అందించిన ఈ అమియో కాంపాక్ట్ సెడాన్ కారు ముందు వైపు అచ్చం పోలో కారు డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇంటీరియర్ కూడా దాదాపుగా పోలో కారు నుండి గ్రహించినదే అని చెప్పవచ్చు. కాని వెనుకవైపున ఉన్న సెడాన్ తరహా డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    డిజైర్ ఇంజన్ వివరాలు

    డిజైర్ ఇంజన్ వివరాలు

    మారుతి సుజుకి వారి డిజైర్ సెడాన్ 1.2-లీటర్ పెట్రోల్ వివిటి మరియు 1.3-లీటర్ డీజల్ డిడిఐఎస్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇవి రెండు కూడా నాలుగు సిలిండర్లతో ఉన్నాయి.

    పవర్

    పవర్

    డీజల్ ఇంజన్ 84 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ మరియు పెట్రోల్ ఇంజన్ 74 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

     ట్రాన్స్‌మిషన్ మరియు గేర్ బాక్స్

    ట్రాన్స్‌మిషన్ మరియు గేర్ బాక్స్

    మారుతి సుజుకి సంస్థ తమ డిజైర్‌లోని పెట్రోల్ వేరియంట్లను 4-స్పీడ్ ఆటోమేటిక్ మరియు డీజల్ వేరియంట్లో ఆటే గేర్ షిఫ్ట్ ట్రాన్‌మిషన్ ను అందించారు.

     అమియో ఇంజన్ వివరాలు

    అమియో ఇంజన్ వివరాలు

    అమియో కాంపాక్ట్ సెడాన్ కారు 1.2-లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఎమ్‌పిఐ మరియు 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ టిడిఐ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

     పవర్

    పవర్

    పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును మరియు డీజల్ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్ మరియు 230 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

     ట్రాన్స్‌మిషన్ మరియు గేర్ బాక్స్

    ట్రాన్స్‌మిషన్ మరియు గేర్ బాక్స్

    అమియో కాంపాక్ట్ సెడాన్ కారులోని పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మరియు డీజల్ ఇంజన్ 7-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండు కూడా డైరెక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్‌ను కలిగి ఉన్నాయి.

    మారుతి సుజుకి డిజైర్ ఫీచర్లు

    మారుతి సుజుకి డిజైర్ ఫీచర్లు

    టాప్ఎండ్ వేరింట్లోని డిజైర్ కారులో క్లైమేట్ కంట్రోల్, సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం, ఎలక్ట్రిక్ ద్వారా సైడ్ వ్యూయింగ్ మిర్రర్‌లను అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం, ఎయుఎక్స్, బ్లూటూత్ మరియు యుఎస్‌బి కనెక్టివిటీ కలిగిన ఆడియె సస్టమ్ మరియు ఫ్యాబ్రిక్ సీట్లు ఇందులో కలవు.

    వోక్స్‌వ్యాగన్ అమియో ఫీచర్లు

    వోక్స్‌వ్యాగన్ అమియో ఫీచర్లు

    వోక్స్‌వ్యాగన్ తమ అమియె కాంపాక్ట్ సెడాన్ కారులో గల ఫీచర్లు ఈ సెగ్మెంట్లో వచ్చిన మొదటి ఫీచర్లు అని తెలిపారు. వర్షం వస్తే ఆటోమేటిక్‌గా పని చేసే రెయిన్ వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్, వెనుక సీట్లలో ఉన్న ప్రయాణికులకు ఎ/సి అందే ప్రత్యేక ఏర్పాట్లు, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్, ముంజేతులకు విశ్రాంతిని కలిగించే ఆర్మ్ రెస్ట్‌లను ముందు వైపు అందించారు మరియు ఇంకా ఎన్నో కొత్త ఫీచర్లు కల్పించారు.

    డిజైర్‌లోని సేఫ్టీ ఫీచర్లు

    డిజైర్‌లోని సేఫ్టీ ఫీచర్లు

    రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానికల్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వీటితో పాటు సెంటర్ లాకింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి

    అమియోలోని ఫీచర్లు

    అమియోలోని ఫీచర్లు

    అమియోలోని అన్ని వేరియంట్లలో కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు డ్యూయల్ ఎయిర్ బ్యాగులతో రానున్నాయి. మరిన్ని ఫీచర్ల తెలుసుకోవడానికి దీని విడుదల వరకు వేచి చూడాలి మరి.

    తీర్పు

    తీర్పు

    వోక్స్‌వారి అమియో కారు చూడానికి డిజైర్ కన్నా బాగా ఉంటుందని ఆటోమొబైల్ నిపుణుల అంచనా. అంతే కాకుండా వోక్స్ వ్యాగన్ ఇండియా ఈ కాంపాక్ట్ సెడాన్ కారులో అత్యంత నూతన ఫీచర్లను పరిచయం చేయనున్నారు. అయితే ఇది మొత్తానికి డిజైర్ కారుకు ఒక ఛాలెంజ్‌ని విసిరిందని చెప్పవచ్చు

     మారుతి సుజుకి డిజైర్ వర్సెస్ వోక్స్‌వ్యాగన్ అమియో

    మారుతి సుజుకి వారు స్విఫ్ట్ డిజైర్ కారును విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు తిరుగులేని అమ్మకాలను సాధిస్తు, దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న సెడాన్ కార్లలో కూడా ఇదే మొదటి స్థానంలో ఉంది. అయితే డిజైర్ మీద అమియో పై చేయి సాధిస్తో లేదో వేచి చూడాలి....

     మారుతి సుజుకి డిజైర్ వర్సెస్ వోక్స్‌వ్యాగన్ అమియో
    • కార్ల పండుగ: ఇండియన్ మార్కెట్లోకి వరుసగా విడుదల కానున్న 20 కార్లు
    • ISIS తీవ్రవాదుల అంతానికి ప్రత్యేక యుద్ద వాహనాలతో బయలుదేరిన ఫ్రాన్స్

Most Read Articles

English summary
Volkswagen Ameo vs Maruti Dzire
Story first published: Saturday, February 20, 2016, 11:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X