బడ్-ఇ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్

By Anil

వోక్స్‌వ్యాగన్ మోటార్స్ వారు కన్య్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఇఎస్) 2016 లో బడ్-ఇ ఎలక్టానిక్ కారును ప్రవేశ పెట్టారు. పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ మైక్రో బస్ గా పిలువబడే ఈ కాన్సెప్ట్ కారును వోక్స్‌వ్యాగన్ వారు మాడ్యులర్ ఎలక్ట్రిక్ టూల్ కిట్ వేదిక మీద అభివృద్దిపరిచారు.

వోక్స్‌వ్యాగన్ వారి ఎలక్ట్రిక్ కారు బడ్-ఇ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

600 కిలోమీటర్లు

600 కిలోమీటర్లు

వోక్స్‌వ్యాగన్ వారి ఎలక్ట్రిక్ కారలోని బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 600 కిలో మీటర్ల పాటు ప్రయాణం చేయవచ్చు.

బ్యాటరీ

బ్యాటరీ

ఇందులో 101 కె‌డబ్ల్యూహెచ్ బ్యాటరీ కలదు. అయితే ఇదే నమూనా వోక్స్‌వ్యాగన్ డీజల్ మరియు పెట్రోల్ వాహనాలను అందించనుంది.

ఛార్జింగ్ సమయం

ఛార్జింగ్ సమయం

ఇందులో గల బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జింగ్ చేయడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది.

ఫోర్ వీల్ డ్రైవ్

ఫోర్ వీల్ డ్రైవ్

వోక్స్‌వ్యాగన్ బడ్-ఇ ఎలక్ట్రిక్ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ముందు మరియు వెనుకవైపున గల రెండు ఆక్సిల్స్ మీద రెండు మోటార్లు ఉంటాయి. దీని ద్వారా పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

వోక్స్‌వ్యాగన్ ఫోర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు కేవలం 6.9 సెకండ్ల వ్యవధిలో దాదాపుగా గంటకు 0 నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫీచర్లు

ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ కారు కారులో ఫీచర్లు కూడా కొత్తగానే ఉన్నాయి. ఇందులో ఇందులో ఎలక్ట్రిక్ క్లస్టర్, సెంటర్ కన్సోల్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయగలిగే టచ్ మరియు గెస్ట్చర్ కంట్రోల్ వంటి అధునాతనమైన ఫీచర్లు ఉన్నాయి. వీటన్నింటిని స్మార్ట్ కనెక్టివిటి ద్వారా ఆపరేట్ చేయవచ్చు.

విశాలమైన ఇంటీరియర్

విశాలమైన ఇంటీరియర్

మాడ్యులర్ ఎలక్ట్రిక్ టూల్ కిట్ వేదిక మీద రూపుదిద్దుకున్న ఈ ఎలక్ట్రిక్ బడ్-ఇ కారు లోపల ఇంటీరియర్ చాలా విశాలంగా మరియు అందంగా ఉండేట్లు తయారు చేశారు.

కెమెరాలు కూడా

కెమెరాలు కూడా

వెనుక నుండి వచ్చే వాహనాలను గమనించడానికి మనం సైడ్ మిర్రర్లను పరశీలిస్తాం. కానిఈ కారులో వీటి అందివ్వవలేదు. ఈ సైడ్ అద్దాలకు బదులుగా కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వెనుక వాహనాలను గమనించవచ్చు.

మరిన్ని కథనాలు
  1. 2020 లో పరిచయం కానున్న సరికొత్త కార్ టెక్నాలజీలు
  2. చెన్నైలో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి మరియు ఫోర్షే కార్లు వేలం: ప్రారంభ ధర 5 లక్షలు: మరింత సచాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Most Read Articles

English summary
Volkswagen Unveils BUDD-e Concept Microbus At CES 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X