భారతీయ మార్కెట్లోకి వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ కారు విడుదల: ధర రూ. 38.9 లక్షలు

Written By:

అంతర్జాతీయంగా లగ్జరీ మరియు ఖరైదన వాహన ఉత్పత్తి సంస్థగా బాగా పేరుగాంచిన వోల్వో ఇండియన్ మార్కెట్లోకి తమ ఎస్60 క్రాస్ కంట్రీ సెడాన్ కారు ప్రవేశ పెట్టింది. ఈ క్రాస్ కంట్రీ క్రాసోవర్ సెడాన్ ధర రూ. 38.9 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌)గా ప్రకటించింది. వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీకి చెందిన మరిన్ని వివరాలు క్రింది స్లైడర్లలో....

 ఎస్60 క్రాస్ కంట్రీ ఇంజన్ వివరాలు

ఎస్60 క్రాస్ కంట్రీ ఇంజన్ వివరాలు

వోల్వో ఇందులో 2.4-లీటర్ కెపాసిటి గల ఐదు లీటర్ల టర్బో-డీజల్ ఇంజన్‌ను అందించింది.

పవర్ మరియు మైలేజ్ టార్క్ వివరాలు

పవర్ మరియు మైలేజ్ టార్క్ వివరాలు

వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీలోని ఇంజన దాదాపుగా 187 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం మరియు మైలేజ్

వేగం మరియు మైలేజ్

వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ సెడాన్ కారు కేవలం 8.8 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉంది. ఇది లీటర్‌కు 13.7 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

ట్రాన్స్‌మిషన్ వివరాలు

ట్రాన్స్‌మిషన్ వివరాలు

ఇందులో గల శక్తివంతమైన ఇంజన్‌కు వోల్వో పెడల్ షిఫ్టర్స్ గల 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అనుసంధానించింది. తద్వారా ఇంజన్ విడుదల చేయు పవర్‌ను ఆల్ వీల్ డ్రైవ్ ద్వారా నాలుగు చక్రాలకు చేరవేస్తుంది.

 వోల్వో నుండి ఎస్60 క్రాస్ కంట్రీ: ప్రారంభ ధర రూ. 38.9 లక్షలు

వోల్వో తమ ఎస్60 సెడాన్ కారులో ముందు, వెనుక మరయు ప్రక్కవైపుల స్కిడ్ ప్లేట్లను అందించారు అధేవిదంగా 65 ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

లభించు రంగులు

లభించు రంగులు

వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ లభించు రంగులు

 • రిచ్ జావా
 • ఆస్మియమ్ గ్రే
 • ఆనిక్స్ బ్లాక్
 • క్రిస్టల్ వైట్
 • బ్రైట్ సిల్వర్
 వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ ఫీచర్లు

వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ ఫీచర్లు

 • లెథర్ అప్ హోల్‌స్ట్రే
 • వివిధ రకాల నియంత్రికలు గల సెంటర్ కన్సోల్
 • 7-అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
 • వీడియో మరియు రివర్స్ పార్కింగ్ కెమెరాల కోసం రెండు డిస్ల్పేలు
 • ఉష్టోగ్రతకు అనుగణంగా పనిచేసే క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్
 • టిఎఫ్‌టి స్క్రీన్ గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
భద్రత ఫీచర్లు

భద్రత ఫీచర్లు

 • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
 • డైనమిక్ స్టెబిలిటి ట్రాక్షన్ కంట్రోల్
 • వోల్వో సిటి సేఫ్టీ బ్రేకింగ్ సిస్టమ్
 వోల్వో నుండి ఎస్60 క్రాస్ కంట్రీ: ప్రారంభ ధర రూ. 38.9 లక్షలు
 • క్రూయిజ్ కంట్రోల్
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్
 • హిల్ డిసెంట్ కంట్రోల్
 • హిల్ అసిస్ట్ కంట్రోల్
 • స్పీడ్ సెన్సిటివ్ స్టీరింగ్ వీల్
 వోల్వో నుండి ఎస్60 క్రాస్ కంట్రీ: ప్రారంభ ధర రూ. 38.9 లక్షలు
 • టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్
 • ముందు వైపు ఎయిర్ బ్యాగులు
 • ప్రక్కవైపుల మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగులు
 • మెడ బెణకకుండా ఉండే విధంగా ముందు వైపు సీటు డిజైన్
పోటి

పోటి

ప్రస్తుతం వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ సెడాన్ కారుకు ఎటుంవంటి పోటీ లేదు. కాని ఎస్60 కారు మాత్రం బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు ఆడి ఎ4 వంటి కార్లకు పోటిగా ఉంది.

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo S60 Cross Country Crosses Over In To India, Priced At Rs. 38.9 Lakhs
Story first published: Saturday, March 12, 2016, 10:37 [IST]
Please Wait while comments are loading...

Latest Photos