2017 ఎస్60 మరియు వి60 పోల్‌స్టార్ కార్లను విడుదల చేసిన వోల్వో

Written By:

వోల్వో 2017 సంవత్సరానికి గాను ఎస్60 మరియు వి60 కార్లను విడుదల చేసింది. ఈ రెండింటిని పోల్‌స్టార్ బ్యాడ్జి పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. పోల్‌స్టార్ అనగా వోల్వో వారి ఫెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ వెర్షన్ కార్లు అని తెలిపారు.

వోల్వో 2017 ఎస్60 మరియు వి60 పోల్‌స్టార్ కార్లు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

వోల్వో ఎస్60 మరియు వి60 పోల్‌‌స్టార్ రెండు కార్లు కూడా 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల సూపర్ ఛార్జ్‌‌డ్ మరియు టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌లను కలిగి ఉన్నాయి.

విడుదల చేయు పవర్ మరియు టార్క్ వివరాలు

విడుదల చేయు పవర్ మరియు టార్క్ వివరాలు

ఈ రెండు కార్లలోని ఇంజన్‌లు దాదాపుగా 326 బిహెచ్‌పి పవర్ మరియు 470 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంజన్ పరంగా ఆధునిక మార్పులు

ఇంజన్ పరంగా ఆధునిక మార్పులు

వోల్వో ఈ అధిక పనితీరు కనబరిచే ఇంజన్‌లో పెద్దగా ఉన్నటువంటి టర్బో, కొత్త కనెక్టింగ్ రాడ్, నూతన క్యామ్ షాఫ్ట్‌లు. పెద్దగా ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు ఇంజన్ నుండి ఎక్కువ అవుట్ పుట్‌ను పొందడానికి అధిక సామర్థ్యం గల ఇంధన పంపును ఇందులో వినియోగించారు.

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ సిస్టమ్

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ సిస్టమ్

ఇందులోని ఇంజన్ విడుదల చేసే మొత్తం శక్తి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు అందుతుంది.

తగ్గిన బరువు

తగ్గిన బరువు

వోల్వో సంస్థ ఈ కార్ల బరువులు తగ్గించడానికి ముందు వైపు ఉన్న యాక్సిల్ నందు 24 కిలోలు మరియు వెనుక వైపున గల యాక్సిల్ నందు 20 కిలో బరువును తగ్గించారు.

వేగం

వేగం

ఈ రెండు కార్లు కేవలం 4.7 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.

వీల్స్ అండ్ బ్రేక్స్

వీల్స్ అండ్ బ్రేక్స్

250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ కారును ఆపడానికి వోల్వో 371 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకులను 20-అంగుళాల గల అల్లాయ్ వీల్స్‌కు వెనుక వైపున అందించారు.

రెంట్టింపు అయిన ఉత్పత్తి

రెంట్టింపు అయిన ఉత్పత్తి

వోల్వో ప్రారంభంలో ఈ పోల్‌స్టార్ బ్యాడ్జ్ గల కార్లును ఏడాదికి కేవలం 750 చొప్పున మాత్రమే ఉత్పత్తి చేసేది. కాని ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యాన్ని 1500 కు పెంచింది.

మరిన్ని దేశాలకు అందుబాటులోకి

మరిన్ని దేశాలకు అందుబాటులోకి

వోల్వో ప్రారంభంలో ఈ బ్లూ బ్యాడ్జి గల పోల్‌స్టార్ కార్లను కేవలం 13 దేశాలలో మాత్రమే అందించేది, ఇప్పుడు ఈ కార్లు అందుబాటులో ఉండే దేశాల సంఖ్య 13 నుండి 47 కు పెంచింది.

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo Unveils 2017 S60 And V60 Polestar
Story first published: Monday, April 4, 2016, 13:58 [IST]
Please Wait while comments are loading...

Latest Photos