టాటా నుండి వస్తున్న పది కొత్త కార్లు మరియు ఎస్‌యూవీలు

టాటా మోటార్స్ ఎన్నో సంవత్సరాల నుండి పాత మోడళ్లతోనే ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో అరకొర విక్రయాలతో కాలాన్ని నెట్టుకొట్టూ వచ్చింది. అయితే, విదేశీ సంస్థలు వెల్లువ అధికమవ్వడంతో పోటీ మరింత పెరిగి టాటా

By Anil

టాటా మోటార్స్ ఎన్నో సంవత్సరాల నుండి పాత మోడళ్లతోనే ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో అరకొర విక్రయాలతో కాలాన్ని నెట్టుకొట్టూ వచ్చింది. అయితే, విదేశీ సంస్థలు వెల్లువ అధికమవ్వడంతో పోటీ మరింత పెరిగి టాటా కార్ల సేల్స్ దాదాపు పడిపోయాయి.

టాటా కొత్త కార్లు

సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్ల చరిత్ర గల టాటా మోటార్స్ విపణి నుండి వైదొలగకుండా ఉండేందుకు చివరి ప్రయత్నంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు టియాగో టాటా లైనప్‌లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

Recommended Video

[Telugu] 2017 Skoda Octavia RS Launched In India - DriveSpark
టాటా కొత్త కార్లు

టియాగో సక్సెస్‌తో పడిలేచిన టాటా మోటార్స్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రెండేళ్ల వ్యవధిలోనే హెక్సా, టిగోర్ మరియు నెక్సాన్ అనే మూడు విభిన్న మోడళ్లను విడుదల చేసి విజయాన్ని అందుకొంది.

ఇప్పుడు అత్యుత్తమ విక్రయాలతో టాటా మోటార్స్ భారతదేశపు నాలుగవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా నిలిచింది. అంతే కాకుండా, టియాగో లక్ష యూనిట్ల ప్రొడక్షన్ మైలు రాయి చేధించింది. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకెళుతున్న టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి మరో పది కొత్త మోడళ్లను విడుదలకు సిద్దం చేసింది. ఆ పది కార్ల గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

టాటా కొత్త కార్లు

Q501

టాటా మోటార్స్ కేవలం స్మాల్ హ్యాచ్‌కార్ల విభాగంలోనే కాదు ప్రతి సెగ్మెంట్లో రాణించడానికి ప్రణాళిక సిద్దం చేసుకుంది. అందులో భాగంగా మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కు గట్టి పోటీనిచ్చేలా క్యూ501 అనే కోడ్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది. టాటా మోటార్స్ మరియు జాగ్వార్ ల్యాండ్ రోవర్(జెఎల్ఆర్) భాగస్వామ్యంలో రూపొందుతున్న తొలి మోడల్ కూడా ఇదే.

టాటా కొత్త కార్లు

డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీ బాడీతో టాటా మోటార్స్ ఈ మోడల్‌ను పలుమార్లు పరీక్షించింది. డిస్కవరీ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీ కోసం జెఎల్ఆర్ ఉపయోగించిన ఎల్ఆర్550 ఫ్లాట్‌ఫామ్‌ను ఈ క్యూ501 కోసం వినియోగించనుంది. ఫియట్ నుండి సేకరించే 2.0-లీటర్ మల్టీ జెట్ డీజల్ ఇంజన్ టాటా ఇందులో అందివ్వనుంది.

టాటా క్యూ501 విడుదల అంచనా: 2018 మలిసగంలో

టాటా కొత్త కార్లు

09.క్యూ502(Q502)

క్యూ502 మోడల్ టాటా మోటార్స్ లైనప్‌లోనే అత్యంత ముఖ్యమైన మోడల్ కానుంది. టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా పూర్తి స్థాయి ఫుల్ సైజ్ ఎస్‌యూవీ రూపంలో 7-సీటింగ్ కెపాసిటి రానుంది. దీనిని క్యూ501 మోడల్‌కు కొనసాగింపు అని చెప్పుకోవచ్చు.

picture: Car Blog India

టాటా కొత్త కార్లు

అదే 2-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లో వస్తున్నప్పటికీ విభిన్నమైన ఫీచర్లతో ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో విడుదలవ్వనుంది. టాటా మోటార్స్‌ విక్రయించే వాటిలో అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలవనున్న ఇది 2019 తొలిసగంలో విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

picture credit: Car Blog India

టాటా కొత్త కార్లు

08.ఎక్స్451(X451)

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టియాగో హ్యాచ్‌బ్యాక్ మంచి ఫలితాలే సాధిస్తోంది. అయితే, ఇప్పటి వరకు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో టాటా నుండి ఒక్క మోడల్‌ కూడా లేదు. ఈ విభాగం మీద టార్గెట్ పెట్టుకున్న టాటా ఎక్స్451 అనే కోడ్ పేరుతో మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి మోడళ్లకు పోటీని సృష్టిస్తోంది.

Picture Credit: Rushlane

టాటా కొత్త కార్లు

టాటా అడ్వాన్స్‌డ్ మోడ్యులర్ ఫ్లాట్‌ఫామ్ మీద టాటా వారి ఇండియన్ మరియు యూరోపియన్ డిజైన్ బృందాలు ఎక్స్‌451 కారును డిజైన్ చేస్తున్నారు. సాంకేతికంగా ఇది నెక్సాన్‌లో లభించే 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది.

టాటా ఎక్స్451 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ 2019 విడుదలయ్యే అవకాశం ఉంది.

Picture Credit: Auto Car India

టాటా కొత్త కార్లు

07. నెక్సాన్ ఆటోమేటిక్

టాటా మోటార్స్‌కు మంచి సక్సెస్ తెచ్చిపెట్టిన మోడల్‌గా నెక్సాన్ నిరూపించుకుంది. ఇప్పటి వరకు ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో రాని, లేని ఫీచర్లను టాటా తొలిసారిగా నెక్సాన్‌లో అందించింది. అయితే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లను మాత్రం పరిచయం చేయలేదు.

టాటా కొత్త కార్లు

ఈ మధ్య తాజాగా టాటా నెక్సాన్ ఆటోమేటిక్ ఇండియన్ రోడ్ల పరీక్షిస్తుండగా మీడియాకు చిక్కింది. ప్రస్తుతం నెక్సాన్ కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. ఇక నెక్సాన్ ఏఎమ్‌టి వేరియంట్లోకూడా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రానుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వెర్షన్ విడుదల నవంబర్ చివరిలో ఉండనుంది.

టాటా కొత్త కార్లు

06. టియాగో స్పోర్ట్

టాటా మోటార్స్ సేల్స్ విపరీతంగా పెరగడానికి ప్రదాన కారణం టియాగో హ్యాచ్‌బ్యాక్ సేల్స్. టాటా ఈ మధ్యనే టియాగోను ఆటోమేటిక్ వేరియంట్లో విడుదల చేయడంతో విక్రయాలు ఊపందుకున్నాయి. మంచి విజయాన్ని అందుకున్న టియాగోను స్పోర్ట్ వెర్షన్‌లో విడుదల చేయడానికి టాటా సిద్దమవుతోంది.

టాటా కొత్త కార్లు

డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగకపోయినా... ఎక్ట్సీరియర్ బాడీ స్టైలింగ్ కిట్ ద్వారా రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు స్పోర్టివ్ తరహా మెరుగులు దిద్దనుంది. సాంకేతికంగా అదే 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ రానుంది. భవిష్యత్తులో నెక్సాన్ స్పోర్ట్ కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

టియాగో స్పోర్ట్ 2018లో విడుదలయ్యే చాన్స్ ఉంది.

టాటా కొత్త కార్లు

05. నానో ఎలక్ట్రిక్

టాటా మోటార్స్ భారీ అంచనాలతో నానో స్మాల్ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే, అనుకున్న ఫలితాలను సాధించకపోవడంతో పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రతన్ టాటా గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోకుండా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేస్తున్నారు.

టాటా కొత్త కార్లు

విపణిలో ఉన్న మహీంద్రా ఇ20 ఎలక్ట్రిక్ కారుకు గట్టి పోటీనిచ్చే విధంగా నానో ఎలక్ట్రిక్ కారును టాటా ప్రతినిధులు నిర్మిస్తున్నారు. గతంలో జరిగిన ఆటో షో వేదిక మీద ప్రదర్శించిన నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌నే అభివృద్ది చేస్తున్నారు. నానో ఎలక్ట్రిక్ కారును ఇండియన్ రోడ్ల మీద ఇప్పటికే పలుమార్లు పరీక్షించారు.

నానో ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల అంచనా 2018 ప్రారంభం నాటికి

టాటా కొత్త కార్లు

04. పెలికాన్

టాటా నానో పెద్ద సక్సెస్ అందుకుని ఉంటే, దాని నెక్ట్స్ జనరేషన్‌ను పెలికాన్ రూపంలో విడుదల చేయాలని టాటా భావించింది. కస్టమర్లను ఆకర్షించడానికి విభిన్న డిజైన్ శైలి మరియు అధునాతన ఫీచర్లతో గతంలో జరిగిన ఓ ఆటో షో లో ప్రదర్శించింది.

టాటా కొత్త కార్లు

ఇప్పుడు టాటా విడుదల చేయాలని చూస్తున్న నానో ఎలక్ట్రిక్ మంచి సక్సెస్ అందుకుంటే, టాటా పెలికాన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టాటా పెలికాన్ గురించిన సమాచారం మేరకు, 2018 చివరికి విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

టాటా కొత్త కార్లు

03. మిడ్ సైజ్ సెడాన్ (సిటి, సియాజ్, వెర్నా కార్లకు పోటీగా)

టాటా మోటార్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ఎక్స్451 అనే కోడ్ పేరుతో సరికొత్త మోడల్‌ను అభివృద్ది చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే మోడల్ ఆధారంగా ప్రీమియమ్ సెడాన్ కారును అభివృద్ది చేస్తోంది.

టాటా కొత్త కార్లు

ఇండియన్ సెడాన్ సెగ్మెంట్లో టాటా ఇప్పటి వరకు సరైన సక్సెస్ అందుకోలేపోయింది. గతంలో వచ్చిన మాంజా, ఇండియా వంటివి విపణిలో కేవలం నామమాత్రంగా మిగిలిపోయాయి. ప్రీమియమ్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలకు పోటీగా సరికొత్త సెడాన్ అభివృద్ది చేస్తోంది.

దీని విడుదల అంచనాగా 2019లో ఉండవచ్చు.

టాటా కొత్త కార్లు

02. టిగోర్ ఎలక్ట్రిక్

టాటా మోటార్స్ కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EESL)కు టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసే వేలాన్ని దక్కించుకుంది. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లో లభించే టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కారును టాటా బృందం ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేసి, కేంద్రం నుండి భారీ ఆర్డర్ సొంతం చేసుకుంది.

టాటా కొత్త కార్లు

విడతల వారీగా ఆర్డర్ ప్రకారం మొత్తం కార్లను డెలివరీ చేసి, తరువాత దేశీయంగా టిగోర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ కార్లను లాంచ్ చేయనుంది. 85కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో రానున్న దీని పరిధి 100 కిలోమీటర్లుగా ఉంది మరియు గరిష్ట వేగం గంటకు 135కిమీలుగా ఉంది.

టిగోర్ ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల 2019 ప్రారంభంలో ఉండనుంది.

టాటా కొత్త కార్లు

01. టియాగో ఎలక్ట్రిక్

టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారుతో భారీ విజయాన్ని అందుకుంది. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన టియాగో‌ను టాటా ఇంగ్లాండ్ బృందం ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేసింది.

టాటా కొత్త కార్లు

85కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల టియాగో గరిష్టంగా 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 11 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల టియాగో గరిష్ట వేగం 135కిమీలుగా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: 10 NEW Tata cars And SUVs for India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X