2017 హోండా సిఆర్-వి ఆవిష్కరణ

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ తమ ఐదవ తరానికి చెందిన సిఆర్-వి ఎస్‌యూవీని దేశీయ విడుదలకు సిద్దం చేస్తున్నట్లు పరోక్షంగా సూచనలిస్తోంది. గతంలో ఉత్తర అమెరికాలో విడుదల కావాల్సిన మోడల్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే, ఇప్పుడు ఆసియా దేశాల కోసం అభివృద్ది చేసిన మోడల్ వివరాలు ఇంటర్నెట్లో కనిపించాయి.

ప్రస్తుతం అందిన సమాచారం మేరకు, ఆసియా మోడల్ సిఆర్-వి 7-సీటింగ్ సామర్థ్యం గల లేఔట్‌తో రానుంది. గతంలో దేశీయంగా సిఆర్-వి 5-సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులో ఉండేది.

ఐదవ తరానికి చెందిన పెట్రోల్ వేరియంట్ సిఆర్-వి విషయానికి వస్తే, 2.4-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్ ద్వారా పవర్ మరియు టార్క్ ఉత్పత్తి అవుతుంది. దీనికి కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్(సివిటి) గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

హోండా సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీ డీజల్ వేరియంట్ విశయానికి వస్తే, 158బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌తో రానుంది.

ట్రాన్స్‌మిషన్ పరంగా ఈ డీజల్ ఇంజన్ జడ్ఎఫ్ 9-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో అదే విధంగా ఈ వేరియంట్‌ను 2-వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఎంచుకోవచ్చు.

డిజైన్ విషయానికి వస్తే, సిఆర్-వి మునుపటి వేరియంట్‌నే పోలి ఉంటుంది. గతంలో ఉన్న మోడల్ కన్నా ఈ అప్ కమింగ్ వేరియంట్ ఎక్ట్సీరియర్ డిజైన్ చాలా పదునైన లక్షణాలను కలిగి ఉంటుంది.

దేశీయ విపణిలో హోండా సిఆర్-వి కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. డీజల్ ఆప్షన్ లేకపోవడంతో అమ్మకాలపై తీవ్ర దెబ్బపడుతోంది. హోండా నాలుగవ తరానికి చెందిన సిఆర్-వి లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది.

తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం, హోండా మోటార్స్ తమ సిఆర్-వి ఎస్‌యూవీని నాలుగవ తరం యొక్క ఫేస్‌లిఫ్ట్ రూపంలో ప్రవేశపెట్టడానికి బదులుగా ఒకే సారి ఐదవ తరానికి చెందిన సిఆర్-విని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

మీ నగరంలో మీకు నచ్చిన హోండా కార్ల ధరలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.... మరియు అన్ని హోండా కార్ల ఫోటోల కోసం

 

English summary
India-Spec CR-V Revealed — Has Honda Finally Cracked The Indian SUV Code?
Story first published: Tuesday, February 28, 2017, 13:03 [IST]
Please Wait while comments are loading...

Latest Photos