2017 పికంటో ను ఆవిష్కరించిన కియా మోటార్స్, ఇండియా విడుదల వివరాలు

Written By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్ కోసం సరికొత్త 2017 పికంటో హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరిచింది. అంతర్జాతీయ విపణిలోకి కియా మోటార్స్ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారు పికంటో హ్యాచ్‌బ్యాక్.

కియా మోటార్స్‌కు చెందిన ఈ పికంటో పూర్తిగా హ్యుంద్యా గ్రాండ్ ఐ10 ప్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది. మరియు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కియా మోటార్స్ ఈ పికంటో కారును 2017 చివరి నాటికి లేదా 2018 ప్రారంభం దేశీయ విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.

కొలతల పరంగా 2017 పికంటో అచ్చం గ్రాండ్ 10 హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంటుంది. మునుపటి పికంటో తో పోల్చుకుంటే ఇది అనేక మార్పులకు గురైంది. జిటి లైన్ ప్రేరిత పికంటో కు సంబంధించిన ఫోటోలను కొన్నింటిని కియా మోటార్స్ విడుదల చేసింది.

ఎక్ట్సీరియర్ పరంగా స్పోర్టివ్ బాడీ కిట్‌తో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కిడ్నీ గ్రిల్,ఎర్రటి రంగులో పెద్ద పరిమాణంలో ఉన్న లార్జ్ ఎయిర్ ఇంటేకర్ కలదు. పికంటో ప్రక్కవైపు డిజైన్ పూర్తిగా గ్రాండ్ ఐ10 ను పోలి ఉంది. అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మీద గల సైడ్ ఇండికేటర్లు అద్బుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.

2017 పికంటో రియర్ ప్రొఫైల్ గమనిస్తే, రియర్ డిజైన్ కు కియా మోటార్స్ ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుంది. ఆంగ్లపు సి ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ లతో పాటు ఎరుపు మరియు నలుపు రంగు సొబగులతో కూడిన వెనుక వైపు బంపర్ గమనించవచ్చు. అధునాతన అల్లాయ్ వీల్స్ కూడా ప్రధానాకర్షణగా నిలిచాయి.

2017 పికంటో ఇంటీరియర్ విషయానకి వస్తే 2017 పికంటో హ్యాచ్‌బ్యాక్‌లో మల్టీ ఫంక్షనల్ త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్లోటింగ్ తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సీట్లు, గేర్‌నాబ్ మరియు డోర్ ప్యానల్ మీద ఆకర్షణీయ ఎర్రటి గుర్తులు కలవు.

2017 పికంటో హ్యాచ్‌బ్యాక్ యొక్క సాంకేతిక వివరాలను కియా వెల్లడించలేదు. అయితే ఇది సరికొత్త టుర్బో చార్జ్‌డ్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

2018 నాటికి విడుదలయ్యే అవకాశం ఉన్న 2017 పికంటో దేశీయ విపణిలోకి 5.5 నుండి 7 లక్షల మధ్య ప్రారంభం ఎక్స్ షోరూమ్‌ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ SUV
హ్యుందాయ్ మోటార్స్ తమ అప్‌‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి మీద పనిచేస్తోంది. దీనికి క్యుఎక్స్ఐ అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన డిజైన్ శైలిలో విడుదల కానున్న స్విఫ్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఫోటోల మీద క్లిక్ చేయండి....

English summary
Kia Reveals The 2017 Picanto; India Launch Likely By Late 2018
Please Wait while comments are loading...

Latest Photos