ముగిసిన 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ విజేతలు వీరే!

Written By:

నాలుగు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన తొమ్మిదవ ఎడిషన్ 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఐదవ రోజున విజయవంతంగా ముగింపు దశకు వచ్చింది. 21 జూలై శుక్రవారం నాడు ఐదవ స్టేజ్ ర్యాలీ ముగిసింది. మరియు 22 జూలై శనివారం నాడు పూనేలో నిర్వహించిన గ్రాండ్ ఫినాలే వేదిక మీద విజేతలకు బహుమానం ప్రధానం చేశారు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఫలితాలు

ర్యాలీలోని మారుతి సుజుకి బృందం నుండి సురేశ్ రాణా మరియు అశ్విన్ నాయక్ అల్టమేట్ కార్స్ కెటగిరీలో తొలిస్థానంలో నిలిచారు. మరియు అల్టిమేట్ బైక్స్ కెటగిరీలో టీవీఎస్ మోటార్‌స్పోర్ట్స్ నుండి ఆర్ నటరాజ్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Recommended Video - Watch Now!
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఫలితాలు

అల్టిమేట్ కార్స్ కెటగిరీలో సామ్రాట్ యాదవ్ మరియు ఎస్ఎన్ నిజామి రెండవ స్థానంలో, సందీప్ శర్మ మరియు కరణ్ ఆర్య మూడవ స్థానంలో నిలించారు. రెండు బృందాలు కూడా మారుతి జిప్సీ వెహికల్‌నే ఉపయోగించాయి.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఫలితాలు

అల్టిమేట్ బైక్స్ కెటగిరీలో మొదటి రెండు స్థానాల్లో టీవీఎస్ మోటార్‌స్పోర్ట్ తరపున్న పాల్గొన్నవారు విజేతలుగా నిలిచారు. ఆర్ నటరాజ్ మరియు అబ్దుల్ వహీద్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, మూడవ స్థానంలో సంజయ్ కుమార్ నిలిచాడు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఫలితాలు

ఆరు రోజుల పాటు సాగిన 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ 16 జూలై, ఆదివారం నాడు బెంగళూరు నుండి ప్రారంభమైంది. 2,000 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ ర్యాలీలో విజేతలుగా నిలిచేందుకు సుమారుగా 180 మంది పోటీదారులు పాల్గొన్నారు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఫలితాలు

ప్రతి సంవత్సరం జరిగే 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ తొమ్మిదవ ఎడిషన్ ర్యాలీ తొలిసారిగా భారతదేశపు దక్షిణ భాగం నుండి కఠిమైన పశ్చిమ భూబాగాల మీదుగా మహారాష్ట్రలోని పూనే‌లో ముగిసింది. ఈ మొత్తం ర్యాలీలో రైడర్ల నైపుణ్యాలను పెంచేందుకు చిత్రదుర్గ మరియు కోల్హా‌పూర్‌లలో రెండు సూపర్ స్పెషల్ స్టేజ్‌లను కూడా నిర్వహించారు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఫలితాలు

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తరణ్ మాట్లాడుతూ," గత తొమ్మిది సంవత్సరాలు పాటు జరుగుతున్న దక్షిణ్ డేర్ ర్యాలీకి విశేష స్పందన లభిస్తోంది. దక్షిణ భారతదేశంలో ప్రతి ఏటా నిర్వహించే అతి పెద్ద ర్యాలీలలో మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ఇప్పుడు పెద్ద ర్యాలీగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది ఔత్సాహిక రైడర్లు ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఆసక్తికనబరుస్తున్నారని పేర్కొన్నాడు."

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఫలితాలు

అల్టిమేట్ బైక్స్ మరియు అల్టిమేట్ కార్స్ కెటగిరీలతో పాటు ఎండ్యూరెన్స్ అనే కెటగిరీ కూడా ఈ ర్యాలీలో ఉంది. ఈ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్ నడిపిన సుబీర్ రాయ్ మరియు నిరవ్ మెహ్తా తొలిస్థానంలో నిలిచారు. అయితే తరువాత రెండు స్థానంలో వరుసగా కార్తీక్ మారుతి మరియు శంకర్ ఎస్ ఆనంద్ జోడి మరియు రఘు నందన్ మరియు ప్రకాశ్ ఎమ్ నిలించారు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ఫలితాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సౌత్ ఇండియాలో జరుగుతున్న మోటార్‌స్పోర్ట్స్‌లలో అతి పెద్ద ఈవెంట్ మారుతి సుజుకి దక్షిణ్ డేర్. ఈ ర్యాలీ ప్రతి ఏడాది ఎంతకంతకు ప్రత్యేకతను చాటుకుంటోంది. దీంతో అనేక సవాళ్లతో కూడిన ర్యాలీలో పాల్గొనేందుకు యువ రైడర్లు అమితాసక్తితో ఉన్నారు. దీనికి తోడు వచ్చే ఏడాది 10 వ ఎడిషన్ ర్యాలీలో మరిన్ని ప్రాంతాలను చేర్చి ర్యాలీ పొడవును పెంచనున్నట్లు తెలిసింది.

English summary
Read In Telugu: 2017 Maruti Suzuki Dakshin Dare Concludes with Suresh Rana and R Nataraj As Winners
Story first published: Monday, July 24, 2017, 13:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark