2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ అప్‌డేట్స్

Written By:

దక్షిణ్ డేర్ 2017 ఎడిషన్‌లో నాలుగవ రోజు ర్యాలీ తొలసారి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. గతంలో నిర్వహించిన అన్ని దక్షిణ్ డేర్ ర్యాలీలో భారత దేశపు సౌత్ పార్ట్‌లో ఆగిపోయేవి. అందుకే ఈ ర్యాలీని దక్షిణ్ డేర్ గా పిలుస్తున్నారు.

కుడురేమని ప్రాంతంలో ర్యాలీలో పాల్గొన్నవారందరికీ నాలుగవ రోజు ర్యాలీలో భారీ వర్షాల్లోనే సూపర్ స్పెషల్ స్టేజ్(SSS) నిర్వహించారు. ఉదయం తొలి రౌండ్ మరియు సాయంకాలం ఫైనల్ రౌండ్ SSS ముగిసింది.

మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

నాలుగవ రోజు ర్యాలీ మరింత పోటీతో అత్యంత కఠినంగా సాగింది. గత మూడు రోజుల నుండి అల్టిమేట్ కార్స్ మరియు అల్టిమేట్ బైక్స్ కెటగిరీలో తొలి మూడు స్థానాల్లో ఉన్న రైడర్లు డే 4 లో 329కిలోమీటర్ల దూరాన్ని చేధించి అలాగే కొనసాగారు.

Recommended Video - Watch Now!
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

మారుతి సుజుకి బృందంలోని సురేశ్ రాణా మరియు కో-డ్రైవర్ అశ్విన్ నాయక్ మారుతి సుజుకి గ్రాండ్ వితారా వెహికల్‌తో 7 గంటల 21 నిమిషాల 13 సెకండ్ల కాలంలో మొత్తం దూరాన్ని చేధించి తొలి స్థానంలో నిలిచాడు.

మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

సామ్రాట్ యాదవ్ మరియు కో-డ్రైవర్ ఎస్ఎన్ నిజామి మారుతి జిప్సీ వెహికల్‌తో 7:21:51 సమయంతో రెండవ స్థానంలో అదే విధంగా సందీప్ శర్మ, కో-డ్రైవర్ కరణ్ ఆర్య మారుతి జిప్సీ వాహనంతో 07:37:27 సమయంలో ర్యాలీ పూర్తి చేసి మూడవ స్థానంలో నిలిచారు.

మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

అల్టిమేట్ బైక్స్ కెటగిరీలో ఆర్ నటరాజ్ 329కిలోమీటర్ల రైడింగ్ అనంతరం 04:489:25 వ్యవధిలో తొలి స్థానంలో, అబ్దుల్ వహీద్ మరియు సంజయ్ కుమార్ వరుసగా 04;51:58 మరియు 04:58;56 వ్యవధిలో ర్యాలీ పూర్తి చేసి రెండవ మరియు మూడవ స్థానంలో నిలిచారు.

మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

నాలుగవ రోజు ర్యాలీ ముగిసే నాటికి, ఆర్ నటరాజ్ స్పందిస్తూ, భారీ వర్షాలతో ట్రాక్ మొత్తం చిత్తడి చిత్తడిగా మారిపోయింది. నీటితో నిండిన గుంటలను అధిగమిస్తూ, గమ్యాన్ని చేరడంలో అనేక సవాళ్లను ఎదుర్కోవడం జరిగింది. అయితే టూ వీలర్ రైడర్లకు ఇది మరింత ఇబ్బదికరంగా మారిందని చెప్పుకొచ్చాడు.

English summary
Read In Telugu: 2017 Maruti Suzuki Dakshin Dare: Day 4 - Top 3 Positions Remain The Same As On Day 3
Story first published: Friday, July 21, 2017, 19:44 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark