2017 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ స్టేజ్ 3: పూర్తి వివరాలు

Written By:

మారుతి సుజుకి 2017 డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 3 ర్యాలీ విజయవంతంగా పూర్తయ్యింది. ఈ ర్యాలీ ముగిసే సమయానికి ఎక్ట్ర్సీమ్ కెటగిరీలో సురేష్ రాణా మరియు మోటో కెటగిరీలో సిఎస్ సంతోష్ ముందంజలో ఉన్నారు.

జైసల్మీర్ నుండి ప్రారంభమైన స్టేజ్ ర్యాలీ అత్యంత కఠినమైన ఇసుక ఎడారుల గుండా బారీ వేడిగాలుల మధ్య 350కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని మారుతి సుజుకి 15 వ ఎడిషన్ 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ లోని స్టేజ్ 3 పూర్తయ్యింది.

ఎక్ట్స్రీమ్ కెటగిరీలో సురేష్ రాణా మరియు ఇతని న్యావిగేటర్ అశ్విన్ నాయక్ తమ గ్రాండ్ వితారా వెహికల్‌తో మొదటి స్థానంలో మరియు సందీప్ శర్మ మరియు ఇతని న్యావిగేటర్ కరన్ ఆర్య మారుతి సుజుకి జిప్సీ తో రెండవ మరియు నిజు పాడియా ఇతని న్యావిగేటర్ నిరవ్ మెహ్తా తమ పజేరో వాహనంతో మూడవ స్థానంలో నిలిచారు.

ఇక మోటో కెటగిరీ విషయానికి వస్తే భారత దేశపు మొట్టమొదటి డకార్ ర్యాలీ పోటీదారుడు సిఎస్ సంతోష్ ఎప్పటిలాగే మూడవ రోజు ర్యాలీలో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మిగిలిన రెండు మరియు మూడవ స్థానాల్లో వరుసగా ఆర్.నటరాజ్ మరియు తన్వీర్ అబ్దుల్ వహీర్ నిలిచారు.

ఎన్‌డ్యూర్ కెటగిరీలో పోటీదారులు 4X4 వాహనాలను వినియోగించారు. ర్యాలీలో నియమాలను పాటించకపోతే విధించే జరిమానాలకు దూరంగా ఇచ్చిన కాల వ్యవధిలో నిర్ణీత వేగం మరియు దూరాన్ని పాటిస్తూ ర్యాలీ పోటీచేశారు.

ఎన్‌డ్యూర్ క్లాస్ కెటగిరీలో అర్పిత్ గుప్తా మొదటి మరియు టి.నాగరాజన్ వరుసగా రెండవ స్థానంలో నిలిచారు.

ఎక్స్‌ప్లోర్ కెటగిరీలో అలీ అజ్గర్ మరియు మొహ్మద్ ముస్తఫా లు సంయుక్తంగా టైటిల్‌ను దక్కించుకున్నారు. కార్తీక్ మారుతి మరియు శంకర్ ఆనంద్, అనుపమ్ చంద్ర మరియు అదీష్ అగర్వాల్ జోడీలు వరుసగా ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో నిలిచారు.

2017 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ఫలితాలు - స్టేజ్ 3

ఎక్స్‌స్ట్రీమ్ కెటగిరీ
1. సురేష్ రాణా/అశ్విన్ నాయక్ - 06:37:29
2. సందీప్ శర్మ/ కర్యన్ ఆర్య - 06:42:47
3. నిజు పాడియా/ నిరవ్ మెహ్తా - 16:44:34

మోటో కెటగిరీ

1. సిఎస్ సంతోష్ - 05:26:00
2. ఆర్ నటరాజ్ - 05:26:42
3. తన్వీర్ అబ్దుల్ వహీద్ - 05:46:36

మారుతి సుజుకి 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీని మొబిల్ కంపెనీ యొక్క భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. ఈ ర్యాలీకి మొబిల్1 అధికారిక ఫ్యూయల్ మరియు లుబ్రికేషన్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.

 

English summary
2017 Maruti Suzuki Desert Storm: Suresh Rana And CS Santosh Lead After Leg 3
Please Wait while comments are loading...

Latest Photos