ప్రారంభమైన 2017 నిస్సాన్ మైక్రా ప్రొడక్షన్

Written By:

యూరోప్ లోని ఫ్రాన్స్‌లో గల నిస్సాన్-రెనో భాగస్వామ్యపు ప్రొడక్షన్ ప్లాంటులో 2017 మైక్రా హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని ఈ వారం నుండి ప్రారంభించినట్లు తెలిసింది. బి-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి సుమారుగా ఏడు సంవత్సరాల తరువాత భారత్ లో ఉన్న చెన్నై ప్లాంటు నుండి యూరోప్ ప్లాంటులో ప్రారంభమైంది.

ఫ్రాన్స్ లోని ప్లిన్స్ నగరంలో నిస్సాన్ భాగస్వామ్యం గల రెనో ఉత్పత్తి ప్లాంటులో ఐదవ తరానికి చెందిన మైక్రా కారు ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించింది. మరియు రెనో ప్లాంటులో నిస్సాన్ ఉత్పత్తి చేస్తున్న మొదటి కారు ఈ మైక్రానే.

రెనో-నిస్సాన్ భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన సిఎమ్ఎఫ్-బి వేదిక ఆధారంగా దీనిని రూపొందించినట్లు తెలిసింది, అయితే జపాన్ ఆధారిత నిస్సాన్ 2010 నుండి వినియోగిస్తూ వచ్చిన వి-ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే దీనిని అభివృద్ది చేసినట్లు మరో వార్త కూడా ఉంది.

సరికొత్త మైక్రా హ్యాచ్‌బ్యాక్ ముందు వైపున స్వెప్ట్ బ్యాక్ హెడ్‌లైట్లు, ఆంగ్లపు వి-ఆకారంలో ఉన్న ప్రంట్ గ్రిల్, పదునైన ఆకృతిలో ఉన్న ఫ్రంట్ బంపర్ వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి.

2017 మైక్రా ఇంటీరియర్ లో ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. సాంకేతికంగా మైక్రా హ్యాచ్‌బ్యాక్ మూడు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

2017 నిస్సాన్ మైక్రా లోని ఇంజన్ ఆప్షన్లు

  • 1-లీటర్ సామర్థ్యమున్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్,
  • 0.9-లీటర్ సామర్థ్యం గల టర్బోచార్జ్‌డ్ పెట్రోల్, 
  • 1.5-లీటర్ సామర్థ్యం గల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ వంటివి కలవు.
వీటిన్నింటిలో కూడా ట్రాన్స్‌మిషన్ డ్యూటీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ నిర్వర్తించనున్నది.

2017 లో విడుదల కానున్న నాలుగు సబ్ కాంపాక్ట్ SUVలు
నాలుగు మీటర్ల లోపు పొడవున్న నాలుగు కాంపాక్ట్ ఎస్‌యువిలు 2017 ఏడాదిలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.

 

English summary
2017 Nissan Micra Production Begins In Europe
Please Wait while comments are loading...

Latest Photos