2018 ఎలంట్రా జిటి స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరించిన హ్యుందాయ్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ సరికొత్త ఎలంట్రా జిటి హాట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది. చికాగో ఆటో షో వేదిక మీద గరిష్టంగా 201బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల ఈ 2018 ఎలంట్రా హ్యాచ్‌బ్యాక్‌ను కొలువుదీర్చింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

హ్యుందాయ్ వారి తాజా హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఉన్న వోక్స్‌‌వ్యాగన్ గోల్ఫ్, ఫోర్డ్ ఫోకస్ మరియు హోండా సివిక్ హ్యాచ్‌‌బ్యాక్ లకు బలమైన పోటీనివ్వనుంది.

హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

సరికొత్త ఎలంట్రా జిటి దీనికి తోబుట్టువుగా ఉన్న ఎలంట్రా సెడాన్ యొక్క డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. యూరోపియన్ మార్కెట్లో ఉన్న ఐ30 హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా, యూరోప్‌లో అభివృద్ది చేసారు.

హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

హ్యుందాయ్ యూరోపియన్ మోడల్ ఐ30 హ్యాచ్‌బ్యాక్ తరహాలో ఇందులో ముందు వైపున విశాలమైన చతురస్రాకారంలో ఉన్న క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ కలిగి అందివ్వడం జరిగింది. ఇదే ఫ్రంట్ డిజైన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లను గమనించవచ్చు.

హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా అన్ని హ్యాచ్‌బ్యాక్‌లతో పోల్చుకుంటే ఎలంట్రా జిటి స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ అత్యధిక విశాలమైన క్యాబిన్ స్పేస్ కలిగి ఉంది. పెద్ద పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8-అంగుళాల తాకే తెర కలదు.

హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

హ్యుందాయ్ మోటార్స్ గత ఏడాది ఆరవ తరానికి చెందిన ఎలంట్రా సెడాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 1.6-లీటర్ సామర్థ్యం గల టుర్బో ఛార్జ్‌జ్ ఇంజన్ కలదు. అయితే ఇది ఎలంట్రా స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కూడా రానుంది.

హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

ఎలంట్రా స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో పరిచయం చేయనున్న ఇంజన్ గరిష్టంగా 201బిహెచ్‌పి పవర్ మరియు 264ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

సాధారణ ఎలంట్రా జిటి హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కలిగి ఉంది. ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 162బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

కొనుగోలుదారులు ఈ సాధారణ ఎలంట్రా జిటి హ్యాచ్‌బ్యాక్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకునే అవకాశం కలదు.

హ్యుందాయ్ ఎలంట్రా జిటి స్పోర్ట్

ఎలంట్రా జిటి మరియు ఎలంట్రా జిటి స్పోర్ట్ రెండు వేరియంట్లు కూడా ఏ దానికి అది ప్రత్యేకం. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేసిన ఎలంట్రా జిటి స్పోర్ట్ వేరియంట్ మరింత అగ్రెసివ్ డిజైన్‌తో ఎక్కువ పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ ఆప్షన్‌తో మరియు విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ కల్పించడం జరిగింది.

 

English summary
201bhp Hyundai Elantra GT Sport Unveiled
Story first published: Tuesday, February 14, 2017, 11:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark