2018 కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన హ్యుందాయ్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ 2017 లాస్ ఏంజిల్స్ ఆటో షో వేదిక మీద కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

హ్యుందాయ్ కోనా చిన్న క్రాసోవర్ ఎస్‌యూవీని ఇదివరకే యూరోపియన్ మార్కెట్ కోసం రివీల్ చేసింది. ఇప్పుడు, యుఎస్ మార్కెట్ కోసం రూపొందించిన మోడల్‌ను ఆవిష్కరించింది.

హ్యుందాయ్ కోనా

అమెరికన్ స్పెక్ మోడల్ హ్యుందాయ్ కోనా ఎక్ట్సీరియర్ డిజైన్ చూడటానికి అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంది. ఇదివరకెన్నడూ పరిచయం కాని విధంగా సరికొత్త రూపంలో ఉన్న ఫ్రంట్ బంపర్ మరియు హెడ్ ల్యాంప్ సెటప్ ఇందులో ఉన్నాయి. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, సిగ్నేచర్ క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, బంపర్‌కు ఇరువైపులా ఒదిగిపోయిన ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా

కండలు తిరిగిన శరీరాకృతిలో ఉన్న కోనా ఫ్రంట్, సైడ్ మరియు రియర్ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. బాడీ చుట్టూ అంచుల వద్ద ప్లాస్టిక్ క్లాడింగ్, ఆకర్షణీయమైన డోర్ హ్యాండిల్స్ మరియు అధునాతన టెయిల్ సెక్షన్ కోనా ఎస్‌యూవీ సొంతం.

హ్యుందాయ్ కోనా

హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో స్పోర్ట్స్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్లున్నాయి. ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, రియర్ స్పాయిలర్, రూఫ్ రెయిల్స్ వంటివి కోనా ఎస్‌యూవీకి క్రాసోవర్ రూపాన్ని తీసుకొచ్చాయి.

హ్యుందాయ్ కోనా

హ్యుందాయ్ మోటార్స్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీని సరికొత్త ఫ్లాట్‌ఫామ్ మీద క్రాసోవర్ స్టైల్లో నిర్మించింది. అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన ఇంటీరియర్ మరియు అత్యుత్తమ డ్రైవింగ్ పొజిషన్ కోనా క్రాసోవర్‌లో ప్రత్యేకంగా ఉన్నాయి. అమెరికా విపణిలోకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్‌లలో కోనా ఎస్‌యూవీ అందుబాటులోకి రానుంది.

హ్యుందాయ్ కోనా

అమెరికన్ స్పెక్ కోనా ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. 145బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 2-లీటర్ల కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇంజన్ మరియు 172బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్. 2-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు 1.6-లీటర్ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించనుంది.

హ్యుందాయ్ కోనా

హ్యుందాయ్ కోనా ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, సిరియస్ ఎక్స్ఎమ్ రేడియో, హెచ్‌డి రేడియో బ్లూ లింక్ ఎల్‌టిఇ కనెక్టివిటి సర్వీసులను సపోర్ట్ చేయగల 8-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కలదు. వీటికి అదనంగా హెడ్సప్ డిస్ల్పే, వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు స్మార్ట్ ఫోన్ అనుసంధానం వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా

సేఫ్టీ కోసం హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీలో ఫార్వర్డ్ కొల్లిషన్-అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ అప్రమత్తం చేసే వ్యవస్థ, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి భద్రతాపరమైన ఫీచర్లున్నాయి.

హ్యుందాయ్ కోనా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కోనా ఎస్‌యూవీతో హ్యుందాయ్ స్మాల్ క్రాసోవర్ వెహికల్ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్దమైంది. తొలుత అమెరికా విపణిలోకి విడుదల కానున్న కోనా ఎస్‌యూవీ కొలతల పరంగా చిన్నగా ఉండటంతో పట్టణ కొనుగోలుదారులను ఆకట్టుకోనుంది.

భారత్‌లో విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. అయితే, 2018 తొలి త్రైమాసికంలోపు పూర్తి స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: 2017 Los Angeles Auto Show: 2018 Hyundai Kona Unveiled

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark