రూ. 3.5 లక్షల ప్రారంభ ధరతో హ్యుందాయ్ శాంట్రో

Written By:

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ తమ మొదటి ఉత్పత్తి శాంట్రోతో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే 2014 లో తక్కువ అమ్మకాలు సాగిస్తోందనే నెపంతో మార్కెట్ నుండి తొలగించింది. అయితే శాంట్రో తరువాత తరం ఉత్పత్తిని 2018 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న హ్యుందాయ్ షోరూమ్‌లకు చేరవేయనున్నట్లు సమాచారం.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

గతంలో హ్యుందాయ్ ప్లాంటులో ఇయాన్ మరియు ఎలైట్ ఐ20 కార్ల ఉత్పత్తి ఆలస్యం అవుతోందనే కారణం చేత శాంట్రో ఉత్పత్తిని నిలిపివేసి, మార్కెట్ నుండి తొలగించింది. అయితే 2018 నాటికి ఐ10 మోడల్‌ను నిలిపివేసి నెక్ట్స్ జనరేషన్ 2018 శాంట్రోను విడుదల చేయాలని చూస్తోంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 2018 నాటికి విడుదల కానున్న శాంట్రో రూ. 3.5 నుండి 5 లక్షల మధ్య ధరతో వచ్చే అవకాశం ఉంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

దీనిని 2018ఏహెచ్ అనే పేరుతో హ్యుందాయ్ అభివృద్ది చేస్తోంది. 2018 అక్టోబర్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉన్న ఇది డిజైన్ పరంగా పూర్తి స్థాయిలో మార్పులకు గురవుతోంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

2018 శాంట్రో పూర్తి స్థాయిలో స్పోర్టివ్ తరహాలో రానుంది. ముందు మరియు వెనుక వైపు భాగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రస్తుత యువతను టార్గెట్ చేసే విధంగా డిజైన్ చేయనుంది, ఇంటీరియర్ పరంగా ఎక్కువ క్యాబిన్ స్పేస్ మీద కూడా దృష్టి సారిస్తోందని తెలిసింది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

అదే బాక్స్ రూపంలో ఉన్న ఆకారాన్ని ఇందులో కొనసాగిస్తూ హ్యుందాయ్ లైనప్‌లో శక్తివంతమైన మరియు అత్యుత్త మైలేజ్ ఇవ్వగలిగే 1.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్‌ను పరిచయం చేయనుంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

ఇంజన్, డిజైన్ మరియు ఫీచర్ల మార్పులతో పాటు 2018 శాంట్రో హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

ప్రస్తుత సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి సెలెరియో, టాటా టియాగో మరియు షెవర్లే బీట్ వంటి వాటితో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

డాట్సన్ రెడి గో సక్సెస్ స్టోరీ - ప్రతి రెడి గో ఓనర్ కోసం తెలుగులో

జపాన్ ఆధారిత చవక కార్ల తయారీ సంస్థ డాట్సన్ యొక్క భారత దేశపు మొదటి అర్బన్ క్రాసోవర్ రెడి గో సక్సెస్ స్టోరీ....

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ శాంట్రో

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు SUVలు

ఇండియన్ పొలిటీషియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న ఏడు ఎస్‌యువిల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

 
English summary
2018 Hyundai Santro Might Be Launched At Just Rs 3.5 Lakh
Story first published: Wednesday, January 18, 2017, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos