ఎదురుచూపులకు పులిస్టాప్ పెట్టండి: సరికొత్త 2018 స్విఫ్ట్ వచ్చేసింది!!

Written By:

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ సరికొత్త 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. న్యూ స్విఫ్ట్‌ను వచ్చే ఏడాది విపణిలోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
2018 మారుతి సుజుకి స్విఫ్ట్

కొత్త తరం స్విఫ్ట్ టెలివిజన్ అడ్వర్టైజ్‌మెంట్ కోసం ముంబాయ్ లోని లోనవాలా ప్రాంతంలో షూటింగ్ నిర్వహస్తుండగా, మీడియా కెమెరా కంటికి చిక్కింది. షూటింగ్‌ నిమిత్తం రహస్యంగా తీసుకొచ్చిన స్విఫ్ట్ కంప్లీట్‌గా కొత్త రూపాన్నికలిగి ఉంది.

Recommended Video - Watch Now!
Lakshadweep Airport Gets A Sea-Bridge Runway - DriveSpark
2018 మారుతి సుజుకి స్విఫ్ట్

2018 జనవరిలో మారుతి సిఫ్ట్ విడుదలకు ముందస్తుగా మీడియా కార్యకలాపాలు నిర్వహించనుంది. వచ్చే జనవరిలో లేదా ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద లాంచ్ చేయనుంది.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

షూటింగ్ కోసం వచ్చిన కొత్త స్విఫ్ట్ రెడ్ కలర్ పెయింట్ స్కీములో ఉంది. ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్ చూడటానికి అచ్చం అంతర్జాతీయ విపణిలో ఉన్న మోడల్‌నే పోలి ఉంది. ఇందులో, ఫ్లోటింగ్ రూఫ్ లైన్, బ్లాక్డ్ ఔట్ పిల్లర్స్, అల్లాయ్ వీల్స్ మరియు స్పోర్టివ్ లుక్ కలిగి ఉంది.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి తమ కొత్త తరం 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును మారుతి తేలికపాటి బరువున్న కార్లను రూపొందింతే హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. ఇదే వేదిక మీద న్యూ డిజైన్ మరియు బాలెనో కార్లను మారుతి అభివృద్ది చేసింది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్‌తో పోల్చుకుంటే నూతన స్విఫ్ట్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మారుతి వద్దే ఇదివరకే ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో వస్తున్నాయి.

Trending On DriveSpark Telugu:

2018 ఫిబ్రవరిలో మారుతి తీసుకొస్తున్న కొత్త కార్లు

బాలెనో మరియు ఐ20 లకు నిఖార్సయిన పోటీని తెస్తున్న నిస్సాన్

ఫలించిన ఎనిమేదళ్ల నిరీక్షణ: చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్‌ ఎక్ట్సీరియర్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. భారీ ఎత్తున అప్‌డేట్స్‌కు గురైన ఇంటీరియర్‌లో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు రానున్నాయి.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి ఈ ఏడాది విడుదల చేసిన న్యూ డిజైర్ ద్వారా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు న్యూ స్విఫ్ట్ విడుదలతో కూడా అదే తరహా ఫలితాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రాజీలేని ప్రపంచ స్థాయి డిజైన్ మరియు ప్రతి ఇండియన్ కస్టమర్‌ను ఆకట్టుకునేలా అధునాతన ఇంటీరియర్ ఫీచర్లను అందిస్తోంది.

Spy Image Source: Instagram

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: 2018 Maruti Swift Spotted During TVC Shoot In India
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark