నలుగురు వైద్యవిద్యార్థుల మృత్యుఘోష: ఆ రాత్రి అసలేం జరిగింది?

Written By:

భారత రోడ్ల మీద జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి రోజు కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. అందులో తెలిసేవి కొన్నయితే, తెలియనివి మరెన్నో... ఇలాంటి సంఘటన కర్ణాటకలో ఒకటి చోటు చేసుకుంది. ఎంతో అందమైన భవిష్యత్తు గల నలుగురు వైద్య విద్యార్థుల ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి.

అసలేం ఏం జరిగిందో చూద్దాం రండి...

దుర్మరణం చెందిన వైద్య విద్యార్థులు

గతం శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న హ్యుందాయ్ వెర్నా కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదం బెంగళూరు-మైసూరు జాతీయ రహదారి మీద జరిగింది.

దుర్మరణం చెందిన వైద్య విద్యార్థులు

హ్యుందాయ్ కారులో చనిపోయిన వారిలో జోయెల్ జాకోబ్, జీన దివ్య, నికిత్ మరియు మరొకరిని గుర్తించాల్సి ఉంది. వీరందరు వేరు వేరు మెడికల్ కాలేజీలకు చెందిన వారు. కేరళ రాష్ట్రానికి చెందిన నలుగురు రోడ్డు ట్రిప్పులో భాగంగా మైసూరు నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్నారు.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
దుర్మరణం చెందిన వైద్య విద్యార్థులు

మైసూర్ నుండి బెంగళూరు మార్గంలో ప్రయాణస్తున్న కారు అధిక వేగంతో డివైడర్‍‌ను డీకొని వ్యతిరేక దిశలో ఉన్న మీదకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారు టాప్ మొత్తం ఓపెన్ అయిపోవడంతో మృతులంతా రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయారు. అయితే, సంఘటనా స్థలి నుండి లారీ డ్రైవర్ పారిపోయాడు. సమీప పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దుర్మరణం చెందిన వైద్య విద్యార్థులు

కార్లు అదుపు తప్పడానికి గల కారణాలు ఏంటి ?

అధిక వేగం మీద ఉన్నపుడు కార్లు అదుపు తప్పడం చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి సంఘటనలో ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కార్లు ఇలా అదుపు తప్పడానికి గల కారణాలేంటో తెలుసుకుని, మీరు కారు నడుపుతున్నపుడు ఇలాంటి అవాంతరాలు ఎదురైతే వాటిని అధిగమించండి.

దుర్మరణం చెందిన వైద్య విద్యార్థులు

టైర్లు పేలడం

దూర ప్రాంత ప్రయాణాలలో టైర్లు నిర్వహణం చక్కగా ఉండాలి. లేదంటే ఆ ప్రయాణం చేదు అనుభవాలను మిగల్చడం ఖాయం. అధిక వేగం మీద ఉన్నపుడు ఉన్నట్లుండి టైర్లు పేలిపోవడంతో వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ప్రయాణానికి ముందు టైర్లను చెక్ చేసుకోవడం మరువకండి.

దుర్మరణం చెందిన వైద్య విద్యార్థులు

పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం

పాదం క్రింద యాక్సిలరేటర్ ఉంది కదా అని తొక్కితే, పరిమితికి మించన వేగంతో ప్రయాణించవచ్చు. కానీ, అదుపు చేయలేని వేగాన్ని చేరుకుంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. కాబట్టి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడంలో ఓ పరిమిత వేగంలోపు మాత్రమే ప్రయాణించడం మంచిది.

దుర్మరణం చెందిన వైద్య విద్యార్థులు

మత్తులో నడపడం

మద్యం సేవించి మరియు మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నపుడు డ్రైవ్ చేయడం అత్యంత ప్రమాదకరం. ఇలాంటి సందర్భంలో ప్రతిస్పందించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వివేకంతో స్పందించేందుకు శరీరం సహకరించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.

దుర్మరణం చెందిన వైద్య విద్యార్థులు

నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం

ప్రమాదాలు రాత్రి సమయాల్లోనే అధికంగా జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నిద్ర మత్తులో వాహనాలను నడపడం. ఎక్కువ దూరం వాహనాన్ని నడిపేవారు అలసట కారణంగా నిద్రలోకి జారుకుంటారు. అధిక వేగంతో ప్రయాణిస్తున్నపుడు కునుక తీయడంతో భారీ ప్రమాదాలు జరుగుతాయి. ప్రత్యేకించి ఉదయం 1 నుండి 4 గంటల మధ్య డ్రైవ్ చేయడాన్ని మానుకోండి.

English summary
Read In Telugu: 4 MBBS students killed as sedan hits truck
Story first published: Monday, October 9, 2017, 18:31 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark