బెస్ట్ మైలేజ్ మరియు బడ్జెట్ ధరలో ఉన్న 5 మోస్ట్ పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

మనం ఎంచుకునే కారు అత్యంత శక్తివంతమైనదిగా మరియు ఎక్కువ మైలేజ్ ఇవ్వగలిగేలా బడ్జెట్ ధరలో లభించాలని భావిస్తారు. నిజమే, ప్రతి కారులో ఈ మూడు అంశాలు తప్పనిసరి.

By Anil

రోడ్ల మీద తిరిగే అన్ని కార్లు ఒకేలా ఉండవు. ఒకటి మైలేజ్ కారైతే... మరొకటి పవర్‌ఫుల్ కారు ఉంటుంది. చూడటానికి రెండు కార్లు ఒకేలా ఉన్నప్పటికీ వాటిలో ఉన్న ఫీచర్ల మధ్య వ్యత్యాసం చాలానే ఉంటుంది. కస్టమర్ల అవసరాలను బట్టి విభిన్నంగా ఎంచుకునే వారి కోసం పలు రకాల కార్లు అందుబాటులో ఉంటాయి.

అయితే, మనం ఎంచుకునే కారు అత్యంత శక్తివంతమైనదిగా మరియు ఎక్కువ మైలేజ్ ఇవ్వగలిగేలా బడ్జెట్ ధరలో లభించాలని భావిస్తారు. నిజమే, ప్రతి కారులో ఈ మూడు అంశాలు తప్పనిసరి. మీకు ఇలాంటి కార్లు కావాలా...? పవర్‌ఫుల్, మైలేజ్ మరియు బడ్జెట్ ధరలో లభించే కార్లు గురించి నేటి స్పెషల్ స్టోరీ....

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

మారుతి సుజుకి బాలెనో

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మోస్ట్ పాపులర్ కారు బాలెనో. ఇదే శ్రేణిలో ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లకు పోటీగా మారుతి బాలెనో కారును పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టింది. అయితే, అత్యుత్తమ డిజైన్, ఫీచర్లు మరియు మైలేజ్ ఇవ్వగల బాలెనో కారును పవర్‌ఫుల్ వెర్షన్‌లో బాలెనో ఆర్ఎస్ పేరుతో 2016 లాంచ్ చేసింది.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

బాలెనో కారులో బిహెచ్‌పి 83పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ కె-సిరీపెట్రోల్, 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 1.3-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఇదే ఇంజన్ స్విప్ట్‌లో కూడా ఉన్నప్పటికీ బాలెనో కారును తేలికపాటి బరువుతో నిర్మించడంతో ఎక్కువ పవర్ ఉత్పత్తి చేయకలదు.

బాలెనో ఆర్ఎస్ కారులో 101బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ కెపాసిటి గల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హాటు కేకుల్లా అమ్ముడవుతున్న బాలెనో గరిష్ట వేగం గంటకు 160కిలోమీటర్లుగా ఉంది మరియు బాలోనో పెట్రోల్ వేరియంట్ మైలేజ్ 21కిమీ/లీ మరియు బాలెనో డీజల్ మైలేజ్ 27.39కిలోమీటర్లుగా ఉంది. మారుతి బాలెనో ధరల శ్రేణి రూ. 5.35 లక్షల నుండి రూ. 8.53 లక్షల మధ్య ఉంది.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఫోర్డ్ ఫిగో

ఫోర్డ్ ఫిగో ప్రతి అంశంలో కూడా విజేత అని చెప్పవచ్చు. అయితే, డిజైన్ విషయంలో కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. అంతే మరో ఆసక్తికరమైన అశం పవర్‌ట్రైన్(ఇంజన్). అంతే కాకుండా సేఫ్టీ అత్యుత్తమ ఫీచర్లు మరియు ఎక్కువ ఎయిర్ బ్యాగులను కలిగి ఉన్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ కారు ఫిగో.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో 88బిహెచ్‌పి పవర్ మరియు 112ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది మరియు ఫిగో టాప్ ఎండ్ వేరియంట్‌లో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 112బిహెచ్‌పి పవర్ మరియు 136ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

డీజల్ వెర్షన్ ఫిగో ఎంచుకునే వారి కోసం 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న ఇది 100బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫిగో గరిష్టం మైలేజ్ 25.83కిమీలుగా ఉంది. ఫిగో ధరల శ్రేణి రూ. 4.8 లక్షల నుండి 7.79 లక్షల మధ్య ఉంది.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఫియట్ పుంటో అబర్త్

పుంటో అబర్త్ హ్యాచ్‌బ్యాక్ కారులో ఫియట్ అభివృద్ది చేసిన 1.4-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బో జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. నిజానికి, దీనిని ఫియట్ లీనియా సెడాన్ నుండి సేకరించారు.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

నాలుగు సిలిండర్ల గల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 143బిహెచ్‌పి పవర్ మరియు 112ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ విధమైన పవర్ ఉత్పత్తి చేసే ఏకైక హ్యాచ్‌బ్యాక్ కారు ఇదే. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉండటంతో పుంటో అబర్త్ డ్రైవింగ్‌లో మరింత ఫన్ తోడవుతుంది.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఫియట్ పుంటో అబర్త్ పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కేవలం సింగల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అబర్త్ పుంటో పెట్రోల్ మైలేజ్ లీటర్‌కు 16.3కిమీలు మరియు అబర్త్ పుంటో ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.72 లక్షలుగా ఉంది.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

హోండా జాజ్

జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ గత ఏడాది కొత్త తరం జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారును పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో శక్తివంతమైన 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 90బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లోని 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 100బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

జాజ్ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ - 18కిమీ/లీ మరియు జాజ్ డీజల్ వేరియంట్ మైలేజ్ - 27కిమీ/లీ. హోండా జాజ్ ధరల శ్రేణి రూ. 5.96 లక్షల నుండి 9.27 లక్షల మధ్య ఉంది.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

వోక్స్‌వ్యాగన్ పోలో జిటి

బెస్ట్ పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో అస్సలు నిర్లక్ష్యం చేయలేని కారు వోక్స్‌వ్యాగన్ పోలో. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించే పోలో ఇండియాలోనే కాదు ప్రపంచ విపణిలో కూడా అత్యుత్తమ శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

పోలో జిటి టిఎస్ఐ వేరియంట్లో 103బిహెచ్‌పి పవర్ మరియు 175ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల ఎస్ఒహెచ్‌సి ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గుండా పవర్ మరియు టార్క్ ఫ్రంట్ వీల్స్‌కు అందుతుంది.

పోలో టిడిఐ వేరియంట్లో 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే నాలుగు సిలిండర్ల 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు. అయితే దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

1.5-లీటర్ డీజల్ వేరియంట్ పోలో మైలేజ్ - 21.49కిమీలు మరియు 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్ పోలో మైలేజ్ - 17.21కిమీలు. వోక్స్‌వ్యాగన్ పోలో ధరల శ్రేణి రూ. 5.47 లక్షల నుండి రూ. 9.67 లక్షల మధ్య ఉంది.

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ మరియు అన్ని మైలేజ్ వివరాలు ఏఆర్ఏఐ ప్రకారం ఇవ్వబడ్డాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Five powerful efficient hatchbacks worth buying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X