ఆ పిచ్చితనానికి 70 ఏళ్లు: ఇంకా కొనసాగుతూనే ఉంది...!!

Written By:

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సూపర్ కార్ల తయారీ సంస్థగా కొనసాగుతున్న ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారి అధికారిక కార్యకలాపాలు మొదలై దాదాపుగా 70 వసంతాలు గడిచిపోయాయి. ఫెరారి నిర్మించిన మొదటి కారు "ప్రాన్సింగ్ హార్స్" కు ఇప్పుడు 70 ఏళ్లు.

ఎంజో ఫెరారికి మోటార్ స్పోర్ట్స్ అంటే అమితమైన ఇష్టం మరియు రేస్ కార్ల తయారీలో అద్బుతమైన పరిజ్ఞానం కలగిన వాడు. తరువాత తన కెరీర్‌ను పూర్తిగా రేసింగ్ మీదకు మార్చుకొన్నాడు. ఎంజో అనేక రోడ్ కార్లను నిర్మించాడు. తరువాత అతని రేసింగ్ బృందం స్కుడేరియా ఫెరారి అనేక రేసుల్లో మరియు ఛాంపియన్‌షిప్ లలో భారీ విజయాలు సాధించాయి.

కొన్నాళ్లకు ఎంజో ఓ రేసింగ్ బృందాన్ని స్థాపించాడు. అనతి కాలంలో ఎంజో రోడ్ కార్లను విరివిగా నిర్మించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఫెరారి మొత్తం 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఫెరారి సంస్థ ఇప్పుడు ఈ 70 వసంతాల వేడుకలను జరుపుకోనుంది. ఈ కార్యక్రమంలో ఫెరారి నిర్మించిన అద్బుతమైన ఇంజనీరింగ్ మాస్టర్ పీసెస్‌ను లండన్ క్లాసిక్ కార్ షో వేదిక మీద ప్రదర్శించడానికి సిద్దమైంది.

1970 నుండి ఫెరారి సంస్థ కార్ల తయారీని పెంచేసింది. అప్పటి నుండి 2015 నాటి వరకు 7,664 యూనిట్ల ఫెరారి కార్లు అమ్ముడుపోయాయి. అదే ఏడాదిలో ఫెరారి వి8 మరియు వి12 మోడళ్లను విరివిగా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.

ఫెరారి తమ చరిత్రలో అనేక లిమిటెడ్ ఎడిషన్ కార్లను కూడా ఉత్పత్తి చేసింది. అందులో కొన్ని, లాఫెరారి, లాఫెరారి అపేర్టా మరియు ఎఫ్12టిడిఎఫ్. ఫెరారి ఉత్పత్తి చేసిన మొట్టమొదటి హైబ్రిడ్ కారు లాఫేరారి.

నూతన కాంపాక్ట్ ఎస్‌యూవీకి "కోనా" పేరును ఖరారు చేసిన హ్యుందాయ్

  

English summary
70 Years Of Ferrari Madness; The Thrill Continues
Story first published: Monday, February 6, 2017, 10:23 [IST]
Please Wait while comments are loading...

Latest Photos