ఇండియన్ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన ఆటోమేటిక్ కార్లు

Written By:

ఇండియన్ రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ జామ్‌లలో మరియు నిత్యావసరానికి మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో డ్రైవ్ చేయడం చాలా మందికి అంత సులభం కాదు. దీనికి పరిష్కారం ఆటోమేటిక్ కార్లు. బడ్జెట్ ధరలో ఉన్న అత్యుత్తమ ఆటోమేటిక్ కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగులో ప్రత్యేక కథనం.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కార్లతో పోల్చుకుంటే దేశవ్యాప్తంగా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న కార్లే ఎక్కువగా ఉన్నాయి. నిజమే, మంచి డ్రైవింగ్ అనుభూతి కలగాలనుకునేవారంతా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లకే మొగ్గు చూపుతారు.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

అయితే, మన ఇండియన్ రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ జామ్‌లలో మరియు నిత్యావసరానికి మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో డ్రైవ్ చేయడం చాలా మందికి అంత సులభం కాదు. దీనికి పరిష్కారంగా ఆటోమొబైల్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు - ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్. ఈ రోజుల్లో గేర్లు మార్చకుండానే సులభంగా కార్లను నడపగలుగుతున్నాం.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఆటోమొబైల్ రంగంలోకి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ చాలా కాలమే అయినప్పటికీ, ఇది ఇండియాకు వచ్చే సరికి ఎన్నో ఏళ్లు పట్టింది. అందులో కూడా ఆటోమేటిక్ కార్లంటే ఖరీదైనవనే ముద్ర వేసుకున్నాయి.

ఒక్కో కార్ల కంపెనీ నెమ్మదిగా తమ కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేయడంతో ఇప్పుడు ఆటోమేటిక్ కార్ల మధ్య తీవ్రమైంది. ప్రత్యేకించి అన్ని చిన్న కార్లలో కూడా ఏఎమ్‌టి(ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) అందుబాటులోకి వచ్చింది. కాబట్టి, ఇవాళ్టి కథనంలో బడ్జెట్ ధరలో ఉన్న అత్యుత్తమ ఆటోమేటిక్ కార్లను చూద్దాం రండ....

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

టాటా నానో

ఇండియాలో అత్యంత సరసమైన కారు టాటా నానో. కారు కొనుక్కోవాలనుకునే సామాన్యుడి కోసం టాటా నానో కారును పరిచయం చేసింది. దీని తోడు దీనిని అప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్న మహిళా కస్టమర్లు ఎక్కువగా ఎంచుకోసాగారు. దీంతో తొలుత మ్యాన్యువల్‌తో పరిచయమైన టాటా ఆటోమేటిక్ వేరియంట్లో లాంచ్ అయ్యింది.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

టాటా నానో 4-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‍‌లో లభిస్తోంది. సాంకేతికంగా రెండు ఆప్షన్‌లలో కూడా 624సీసీ కెపాసిటి గల రెండు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 38బిహెచ్‌పి పవర్ మరియు 51ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల దీని మైలేజ్ ఏఆర్ఏఐ ప్రకారం లీటర్‌కు 21.9కిమీలుగా ఉంది.

నానో ధరల శ్రేణి రూ. 2,54,346 ల నుండి 3,58,634 ల మధ్య ఉంది.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

రెనో క్విడ్

ఫ్రెంచ్ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లోకి క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విడుదల చేశాక మారుతి ఆల్టో మరియు ఇతర చిన్న కార్లకు గట్టి పోటీని సృష్టించింది. తొలుత 800సీసీ ఇంజన్‌ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో విడుదలైన క్విడ్ కొంతలానికి 1.0-లీటర్ ఇంజన్ మరియు 5-ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదలయ్యింది.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

సెప్టెంబర్ 2017 అమ్మకాల్లో క్విడ్ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. క్విడ్ ధరల శ్రేణి రూ. 2,94,860 - రూ. 4,400,702 ల మధ్య ఉంది. క్విడ్‌లో ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఒక్క వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. దీని ధర రూ. 4,40,702 లుగా ఉంది.

క్విడ్ 800సీసీ మైలేజ్ - 25.18కిమీ/లీ మరియు క్విడ్ 1.0-లీటర్ మైలేజ్ - 23.01కిమీ/లీ

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఆల్టో కె10

ఆల్టో 800 తర్వాత రెండవ ఎంట్రీ లెవర్ కారు ఆల్టో కె10. ఇందులో 998సీసీ గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఆల్టో కె10 మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఆల్టో కె10 లోని శక్తివంతమైన ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు దీని మైలేజ్ లీటర్‌కు 24.07కిమీలుగా ఉంది.

ఆల్టో కె10 ధరల శ్రేణి రూ. 3.40 లక్షల నుండి 4.26 లక్షల మధ్య ఉంది.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

మారుతి సెలెరియో

ఆల్టో మరియు స్విఫ్ట్ మధ్య ఉన్న స్థానాన్ని భర్తీ చేస్తూ మారుతి సెలెరియోను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇండియన్స్‌కు పరిచయమైన తొలి ఆటోమేటిక్ కారు సెలెరియో. దీని తర్వాతమే ఎన్నో కంపెనీలు తమ కార్లలో ఏఎమ్‌టి ప్రవేశపెట్టాయి. సెలెరియో పెట్రలో, డీజల్ మరియు సిఎన్‌జి వేరియంట్లలో లభిస్తోంది. అయితే, ఏఎమ్‌టి పెట్రోల్ ఇంజన్‌లోనే కలదు.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

సెలెరియో ధరల శ్రేణి రూ. 4,36,018 నుండి రూ. 6,42,869 ల మధ్య ఉంది. సెలెరియో పెట్రోల్ మైలేజ్ 23.1కిమీ/లీ, సెలెరియో డీజల్ మైలేజ్ 27.62కిమీ/లీ మరియు సెలెరియో సిఎన్‌జి మైలేజ్ 31.79కిమీ/కేజీ.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

మారుతి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను తొలుతల 1999లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరులేని విక్రయాలు జరుపుతోంది. డిమాండ్ మరియు అవసరానికి అనుగుణంగా మారుతి వ్యాగన్‌ఆర్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ప్రవేశపెట్టింది.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

మారుతి వ్యాగన్ఆర్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభిస్తోంది. రెండింటిలో 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. లీటర్‌కు 20.5కిమీల మైలేజ్ ఇవ్వగల ఇది 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

వ్యాగన్ఆర్ ధరల శ్రేణి రూ. 4.23 లక్షలు - 5.44 లక్షల మధ్య ఉంది.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

టాటా టియాగో

టియాగో విడుదలతో టాటా మునుపెన్నడూ లేని విధంగా సంచలనాలు సృష్టిస్తోంది. గతంలో టాటాకు సాధ్యం కాని సేల్స్ ఇప్పుడు టియాగో సాధిస్తోంది. నిర్మాణ నాణ్యత, విశ్వసనీయత మరియు అత్యుత్తమ ఇంజన్ ఆప్షన్స్ టియాగో సొంతం.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

టాటా టియాగో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టియాగో ధరల శ్రేణి రూ. 3.33 నుండి 5.85 లక్షల మధ్య ఉంది.

టియాగో పెట్రోల్ మైలేజ్ - 23.84కిమీ/లీ మరియు టియాగో డీజల్ మైలేజ్ - 27.28కిమీ/లీ

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

హోండా బ్రియో

హోండా బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను మహిళలు అధికంగా ఎంచుకుంటున్నారు. బ్రియో నాలుగు వేరియంట్లలో, కేవలం సింగల్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభించనుంది. అయితే, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఇందులోని శక్తివంతమైన 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 87బిహెచ్‌పి పవర్ మరియు 107ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్రియో మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 18.5కిమీ/లీ మరియు ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ 16.5కిమీ/లుగా ఉంది.

బ్రియో ధరల శ్రేణి రూ. 4.74 లక్షల నుండి 6.82 లక్షల మధ్య ఉంది.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా మరియు అన్ని మైలేజ్ వివరాలు ఏఆర్ఏఐ మేరకు ఇవ్వబడ్డాయి.

English summary
Read In Telugu: Affordable automatic cars in india
Story first published: Friday, October 13, 2017, 18:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark