సరికొత్త కాంటినెంటల్ జిటి కారును ఆవిష్కరించిన బెంట్లీ

Written By:

లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బెంట్లీ తమ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ కాంటినెంటల్ జిటి కూపే కారును అతి త్వరలో జరగనున్న 2017 ఫ్రాంక్‌ఫర్ మోటార్ షో వేదిక మీద 2018 ఎడిషన్‌గా ఆవిష్కరించనుంది. ఈ తరుణంలో బెంట్లీ 2018 కాంటినెంటల్ జిటి కారును రివీల్ చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బెంట్లీ కాంటినెంటల్ జిటి

మూడవ తరానికి చెందిన కాంటినెంటల్ జిటి ముందు మరియు రియర్ డిజైన్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనిని వోక్స్‌వ్యాగన్ వాకి ఎమ్‌ఎస్‌బి ప్లాట్‌ఫామ్ ఆధారంగా బెంట్లీ అభివృద్ది చేసింది.

Recommended Video
2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
బెంట్లీ కాంటినెంటల్ జిటి

పోర్షే తాజాగా విడుదల చేసిన పానమెరా కారు నుండి అనేక విడిభాగాలను సేకరించి ఇందులో అందివ్వడం జరిగింది. వోక్స్‌వ్యాగన్ సంస్థ 1998 లో బెంట్లీ సంస్థను కొనుగోలు చేసింది. సరిగ్గా ఐదేళ్ల తరువాత కాంటినెంటల్ జిటి కారును ప్రవేశపెట్టింది.

బెంట్లీ కాంటినెంటల్ జిటి

న్యూ వెర్షన్ 2018 బెంట్లీ కాంటినెంటల్ జిటి కూపే కారులో 6.0-లీటర్ల సామర్థ్యం గల డబ్ల్యూ12 పెట్రోల్ ఇంజన్ కలదు. 626బిహెచ్‌పి పవర్ మరియు 900ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఇందులో గేర్లను మృదువుగా మార్చేందుకు డ్యూయల్ క్లచ్ 8-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

బెంట్లీ కాంటినెంటల్ జిటి

సరికొత్త బెంట్లీ కాంటినెంటల్ జిటి కేవలం 3.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మునుపటి కాంటినెంటల్ జిటితో పోల్చుకుంటే 0.8 సెకండ్ల వేగవంతమైనది. దీని వేగం గంటకు 333కిలోమీటర్లుగా ఉంది.

బెంట్లీ కాంటినెంటల్ జిటి

విడుదల సమయానికి, బెంట్లీ కాంటినెంటల్ జిటి కేవలం డబ్ల్యూ 12 ఇంజన్ మాత్రమే లభించనుంది. అయితే, ట్విన్-టుర్బో 4.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఆలస్యంగా విడుదల చేయనుంది. వి8 ఇంజన్ రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే అవకాశం ఉంది.

బెంట్లీ కాంటినెంటల్ జిటి

పోర్షే పానమెరా 4 ఇ-హైబ్రిడ్ తరహాలో పెట్రోల్-ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో బెంట్లీ కాంటినెంటల్ వచ్చే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్స్ తెలిపాయి. పెట్రోల్ ఎలక్ట్రిక్ వేరియంట్ 450బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. మరియు ఎలక్ట్రిక్ మోటార్ ఆధారంతో 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

బెంట్లీ కాంటినెంటల్ జిటి

బెంట్లీ కాంటినెంటల్ జిటి ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, 12.3-అంగుళాల పరిమాణం గల డిస్ల్పే కలదు. ఇది సాధారణ డిస్ల్పే కాదు. 40 వరకు కదిలే పరికరాలను కలిగి ఉన్న డిస్ల్పే, విభిన్న సమాచారాన్ని అందించేందుకు ఇది మూడు భాగాలు విడిపోతుంది. కారు బయట మరియు లోపలి ఉష్ణోగ్రత సూచించడం మరియు ఆటోమేటిక్ ఏ/సి నియంత్రణ వంటివి దీని ఆధీనంలోనే ఉంటాయి.

బెంట్లీ కాంటినెంటల్ జిటి

బెంట్లీ ఈ 2018 కాంటినెంటల్ జిటి కారును ఈ ఏడాది చివర్లో ప్రొడక్షన్‌కు సిద్దం చేయనుంది. అయితే వీటి డెలివరీలు మాత్రం 2018 నుండే ఉండనున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లగ్జరీ మరియు ఫీచర్ల విషయంలో నూతన బెంట్లీ కాంటినెంటల్ జిటి సరికొత్త అంచులను తాకిందని చెప్పవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఇంటీరియర్ ఫీచర్లు, త్వరగా స్పందించే వివేకవంతమైన ఇంజన్ ఆప్షన్స్ మరియు అధునాతన డిజైన్ ఇందులో ప్రత్యేకంగా నిలిచాయి.

English summary
Read Telugu: All-New Bentley Continental GT Revealed With New Tech And Power
Story first published: Thursday, August 31, 2017, 17:36 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark