ప్రదర్శనలు, రైడింగ్‌లు, డ్రిఫ్టిం‌గ్‌లతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న 2017 మోటోరిగ్ వేడుకలు

Written By:

దక్షిణ కర్ణాటకలోని మంగళూరు నగర సమీపంలో మూడి‌బిదిరి ప్రాంతంలోని మిజార్‌లో ఉన్న శోభవాన ఓ సుదరమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన వాతావరణం. వీటి మధ్య రేసింగ్ ప్రేమికుల మదిలో ఉత్సాహాన్ని నింపుతూ అద్బుతమైన బైక్ రేసింగ్ విన్యాసాలతో ప్రారంభమయ్యాయి అల్వాస్ మోటోరిగ్ 2017వేడుకలు. ఆల్వాస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వరుసగా మూడు పర్యాయాలు ముగించుకుని నాలుగవ ఎడిషన్ మోటోరింగ్‌ను నిర్వహించింది.

అల్వాస్ మోటోరిగ్ 2017

ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా, బెద్రా అడ్వెంచరస్ క్లబ్, కెఎల్14, TASC, టీమ్ బేద్రా యునైటెడ్ మరియు కోస్టల్ రైడర్స్ సంయుక్త భాగస్వామ్యంతో అల్వాస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ మోటోరిగ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

అల్వాస్ మోటోరిగ్ 2017

సూపర్ బైకులు, సూపర్ కార్లు, లగ్జరీ కార్లు, వింటేజ్ కార్లు, మరియు కస్టమైజ్‌డ్ వెహికల్స్‌ను ఒకే చోట చేర్చి ప్రదర్శించడానికి అల్వాస్ మోటోరిగ్ 2017 ఓ ఘనమైన వేదికను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా సుమారుగా 100కు పైగా కార్లు మరియు బైకులు ఇందులో ప్రదర్శించబడ్డాయి.

అల్వాస్ మోటోరిగ్ 2017

2017 మోటోరిగ్ వాహన ప్రదర్శన వేదిక మీద యమహా మిడ్‌నైట్, సుజుకి హయాబుసా, హార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్ టెర్మినేటర్ 2, హార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్ బాబర్, ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800, కవాసకి జడ్ఎక్స్ 10ఆర్, కవాసకి జడ్ఎక్స్14ఆర్, బెనెల్లీ షాట్‌గన్, ట్రయంప్ టైగర్, యమహా ఆర్1, మరియు యెజ్డి వంటి బైకులు కొలువుదీరాయి.

అల్వాస్ మోటోరిగ్ 2017

లగ్జరీ మరియు వింటేజ్ కార్ల విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ జడ్4, ఆడి ఆర్8, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్, బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్, ఆడి ఏ6 లను ప్రదర్శించారు.

అల్వాస్ మోటోరిగ్ 2017

వింటేజ్ కార్ల సెగ్మెంట్లో 1991 కాలం నాటికి చెందిన ఫోర్డ్ కంపెనీ యొక్క లింకన్ టౌన్ కారు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అల్వాస్ మోటోరిగ్ 2017

రైడింగ్ మరియు డ్రైవింగ్‌లో అపార అనుభవం గల నిపుణులు ప్రేక్షకుల మతిపోగొట్టే విధంగా అనేక స్టంట్లు చేశారు. నాలుగవ ఎడిషన్ మోటోరిగ్ 2017 వేడుకుల్లో మంగళూరుకు చెందిన ఇండియన్ ర్యాలీ ఛాంపియన్స్ అర్జున్ రావు మరియు రాహుల్ కంథ్రజ్ పాల్గొన్నారు.

అల్వాస్ మోటోరిగ్ 2017

ఇండియన్ మోటార్ ర్యాలీ సూపర్‌క్రాస్ ఛాంపియన్స్ అదనన్ మరియు సుదీప్ కొటారి ఇందులో పాల్గొనగా, ఉడుపికి చెందిన పిస్టన్స్ బృందం రెండు చక్రాలు గాల్లోకి లేపి తమ ఫ్రీస్టైల్ స్టంట్లతో చూపరుల మతిపోగొట్టారు.

అల్వాస్ మోటోరిగ్ 2017

మోటోరిగ్ ఈవెంట్‌ను జైపూర్‌కు చెందిన గౌరవ్ ఖాత్రి తన అద్బుతమైన రైడింగ్ నైపుణ్యాలతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఒకదానిప్రక్కన ఒకటి నిలిపిన వరుసగా ఐదు బస్సుల మీదుగా ఫ్రీస్టైల్ జంప్ చేశాడు. సుమారుగా 75 అడుగులు దూరం పాటు గాలిలో స్టంట్ చేశాడు.

అల్వాస్ మోటోరిగ్ 2017

వొళ్లు గగుర్పొడిచే ఆ విన్యాసానంతరం, గ్రౌరవ్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ, మన లైఫ్‌తో ఆడుకోవడానకి మనకు హక్కు ఉంది, కానీ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు మనకు లేదు. కాబట్టి మీరు ఇలాంటి స్టంట్లు చేసే ముందు దానికి సరైన శిక్షణ తీసుకోండి మరియు భద్రత పరంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని సూచించాడు.

అల్వాస్ మోటోరిగ్ 2017

అల్వాస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్టీ వివేక్ అల్వా, విశ్వాస్ బవా బిల్డర్స్ ప్రొప్రైటర్ అబుల్ పుతిగె, బెద్రా అడ్వెంచరస్ క్లబ ప్రెసిడెంట్ అక్షయ్ జైన్, నేషనల్ లెవల్ మోటార్‌స్పోర్ట్ రైడర్ అశ్విన్ నాయక్, మండోవి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ రావ్ మరియు పారిశ్రామికవేత్త నారాయన్ పిఎమ్ ఈ వేడుకలకు ప్రముఖులుగా హాజరయ్యారు.

అల్వాస్ మోటోరిగ్ 2017

అల్వాస్ మోటోరిగ్ 2017 వేడుకల్లో కీలకంగా వ్యవహరించిన అల్వాస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌ నుండి అల్వాస్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ పీటర్ ఫెర్నాండెస్ మరియు ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్ట్ హరీష్ భట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అల్వాస్ మోటోరిగ్ 2017

ఆల్వాస్ మోటోరిగ్ నాలుగవ ఎడిషన్ ఈవెంట్‌కు అఫీషియల్ మీడియా పార్ట్‌నర్‌గా డ్రైవ్‌స్పార్క్ నిలిచింది. తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు.

English summary
Read In Telugu Alvas Motorig 4 Event Highlights

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark