అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ ట్రక్కు విడుదల

Written By:

భారతదేశపు దిగ్గజ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ విపణిలోకి దోస్త్ ప్లల్ ట్రక్కును విడుదల చేసింది. అశోక్ లేలాండ్ విడుదల చేసిన లేటెస్ట్ కమర్షియల్ వెహికల్ ప్రారంభ ధర రూ. 5,65,360 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కస్టమర్ల అన్ని అవసరాలకు అనుగుణంగా దోస్త్ ప్లస్ ను తీర్చిదిద్దారు.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్

దోస్త్ కమర్షియల్ వెహికల్ ఆధారంగా దోస్త్ ప్లస్ వాహనాన్ని అభివృద్ది చేసింది. చెన్నై ఆధారిత, భారతదేశపు అతి పెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మొట్టమొదటిసారిగా తేలిక పాటి వాణిజ్య వాహన విభాగంలోకి దోస్త్ వాహనాన్ని పరిచయం చేసింది.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్

తాజాగా అశోక్ లేలాండ్ విడుదల చేసిన దోస్త్ వాహనం, సాధారణ దోస్త్ తో పోల్చుకుంటే అధిక బరువును మోయగలదు. మరియు హెవీ లోడ్ ఉన్నప్పుడు కూడా డ్రైవర్‌కు అత్యుత్తమ హ్యాండ్లింగ్ అనుభవాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం తేలికపాటి కమర్షియల్ వెహికల్ విపణిలో దోస్త్‌కు మంచి పేరుంది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్

దోస్త్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించిన దోస్త్ ప్లస్ వాహనంలో కూడా అదే మునుపటి 1.5-లీటర్ సామర్థ్యం గల టిడిసిఆర్ డీజల్ ఇంజన్ కలదు. 60బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఇది బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ ఇవ్వగలదు.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్

అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ మునుపటి దోస్త్ తో పోల్చుకుంటే 18 శాతం అధికంగా బరువును లాగే సామర్థ్యం కలిగి ఉంది. మరియు అదనపు బరువును తట్టుకునేందుకు మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ ఇందులో కలదు. అయితే, ఇప్పటికీ దోస్త్ శ్రేణి వాహనాలలో లీఫ్ స్ప్రింగ్‌లు మాత్రమే ఉన్నాయి. మునుపటి దోస్త్‌తో పోల్చుకుంటే ఎక్కువ లీఫ్ స్ప్రింగ్‌లు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా 14-అంగుళాల చక్రాల స్థానంలో 15-అంగుళాల వీల్స్ ఉన్నాయి.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్

చిన్న వాహనంతో అధిక లోడ్‌ను రవాణా చేసేందుకు కస్టమర్లను దోస్త్ ప్లస్ ను ఎంచుకోవచ్చు. దోస్త్ ప్లస్ మొత్తం పొడవు 2645ఎమ్ఎమ్ మరియు వెడల్పు 1620ఎమ్ఎమ్ కలదు. అర్బన్ మరియు రూరల్ ఏరియాల్లో అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్‌ అత్యుత్తమ పికప్ వెహికల్.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్

దోస్త్ ప్లస్ ఎంచుకునే వారికి రెండు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. అశోక్ లేలాండ్ దోస్త ప్లస్ టన్నేజ్ కెపాసిటి 2 నుండి 3.5 టన్నుల కెపాసిటి ఉంది. దోస్త ప్లస్‌ను కస్టమర్లు మూడు విభిన్న కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. అవి, వైట్, ఐరిష్ క్రీమ్ మరియు గ్రే బీజి. దోస్త్ ప్లస్ మూడు వేరియంట్లలో లభించును, టాప్ వేరియంట్లో ఎయిర్ కండీషన్, పవర్ స్టీరింగ్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో అశోక్ లేలాండ్ 40 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకుంది. అశోక్ లేలాండ్ లైనప్‌లో ఉన్న దోస్త్ మరియు దోస్త్ ప్లస్ వాహనాలతో లైట్ కమర్షియల్ వెహికల్(LCV) సెగ్మెంట్లోకి ప్రవేశించింది. దీంతో LCV మార్కెట్లో కూడా అశోక్ లేలాండ్ రాణించనుంది.

English summary
Read In Telugu: Ashok Leyland Dost Plus Launched In Bangalore At A Starting Price Of Rs 5.68 Lakh
Story first published: Thursday, September 28, 2017, 11:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark