రూ. 60 వేలకే బజాజ్ స్మాల్ కారు: ఈ వార్త వెనకున్న అసలు వాస్తవం ఏమిటి?

Written By:

ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విరివిగా అందుబాటులోకి వచ్చాక వాస్తవానికంటే అవాస్తవాలే వేగంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగం విరివిగా పెరిగిపోయింది. దీంతో ఒక్కచోట పుట్టే వార్త ఒకరినుండి మరొకరికి అనతి కాలంలో వ్యాపిస్తుంది. ఇందుకు ఉదాహరణ బజజ్ స్మాల్ కారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బజాజ్ క్యూట్

వరల్డ్స్ చీపెస్ట్ కార్ ఫ్రమ్ బజాజ్ అనే వాక్యంతో రెండు ఫోటోలతో ఎక్కడో మొదలైన అసత్యపు వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరి వాట్సాపుల్లోకి చేరిపోయింది. వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరు మరొకరితో పంచుకోవడం మరో విడ్డూరం. ఎందులో ఎంత వాస్తవం ఉందని ఆలోచించడంలో విఫలమవుతున్నామనడానికి ఇదే నిదర్శనం.

Recommended Video
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ క్యూట్

ఇదంతా ప్రక్కనపెడితే బజాజ్ స్మాల్ కారు ఇండియాలో విడుదలవుతుందా... లేదా...? బజాజ్ చిన్న కారు వెనుక ఉన్న అసలు సమాచారం ఏమిటనే సందేహం చాలా మందికే ఉంటుంది. వీటిన్నింటికి సమాధానం ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

బజాజ్ క్యూట్

బజాజ్ ఆటో ఆరేళ్ల క్రితమే క్యూమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది, ఇప్పటికే వరకు ఎన్నో దశలలో పరీక్షిస్తూ, అభివృద్ది చేసుకుంటూ వచ్చింది. క్యూట్ అనే పేరుతో పిలువబడే ఇది నిజానికి కారు కాదు, సాంకేతికంగా దీనిని క్వాడ్రిసైకిల్ అంటారు.

బజాజ్ క్యూట్

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్‌ను తొలుత 2015 లో విడుదల చేసింది. ఇందులో నీటితో చల్లబడే సింగల్ సిలిండర్ డిటిఎస్ఐ 4-వాల్వ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 13బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. లీటర్ 36కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల దీని గరిష్ట వేగం గంటకు 70కిలోమీటర్లుగా ఉంది.

బజాజ్ క్యూట్

ఇండియాలో ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం, వ్యక్తిగత అవసరాలకు క్వాడ్రిసైకిల్స్‌ను వినియోగించరాదు. దీంతో బజాజ్ క్యూట్ ఇండియన్ మార్కెట్లో లభించేది కాదు. అయితే, క్వాడ్రిసైకిల్స్ అనుమతించే కొన్ని దేశాలకు బజాజ్ క్యూట్ కార్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది.

బజాజ్ క్యూట్

ఫ్రాన్స్ వంటి దేశాలలో క్వాడ్రిసైకిల్స్‌ వినియోగించేందుకు అనుమతి ఉంది. ఫ్రాన్స్‌లో క్వాడ్రిసైకిల్స్ నడపడానికి కనీస వయస్సు మరియు ప్రత్యేక పరిమితులు అవసరం. అంతే కాకుండా ఇలాంటి వాహనాలకు ప్రత్యేకమైన భద్రతా పరీక్షలు మరియు క్రాష్ పరీక్షలు ఉంటాయి.

బజాజ్ క్యూట్

బజాజ్ క్యూట్ విదేశాల్లో మినహాయిస్తే, ఇండియాలో లభించనప్పుడు దీని గురించి మళ్లీ ఎందుకు రాస్తున్నామని అనుకంటున్నారా...? నిజమే ఇండియాలో క్యూట్ విడుదలవ్వడం దాదాపు అసాధ్యమే. అయితే ఎందుకు అసాధ్యం అనేది పాఠకులతో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బజాజ్ క్యూట్

దేశీయంగానే ప్యాసింజర్ వాహనాలకు ఢీ మరియు భద్రత పరీక్షలు నిర్వహించి అందులో సానుకూల ఫలితాలనిచ్చేవాటికే భారత ప్రభుత్వం అనుమతులివ్వనుంది. మరో ఏడాదిలోపు ఈ సిస్టమ్ అమలయ్యే అవకాశం ఉంది. అయితే నాలుగు చక్రాల వాహనాలకు నిర్వహించే క్రాష్ టెస్టులో క్యూట్ విఫలమవుతుందనే విషయం బజాజ్‌కు కూడా తెలసిందే. దీంతో బజాజ్ క్యూట్ ఇండియా విడుదలపై ఆశలు వదిలేసింది.

బజాజ్ క్యూట్

ఏదేమైనప్పటికీ, దేశీయంగా తయారయ్యే బజాజ్ క్యూట్ ధర రూ. 60,000 లు ఉంటుంది అంటే, ఇండియాలో లభించే సగటు ఐఫోన్ 7 ధర కన్నా తక్కువగానే లభిస్తుందన్నమాట. బజాజ్ అధికారికంగా ప్రకటించే వరకు ఆధారం లేని వార్తలను నమ్మకండి. మరిన్ని తాజా ఆటోమొబైల్ వార్తల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు....

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu: Bajaj To Launch Small Car Is Fake
Story first published: Friday, August 4, 2017, 11:18 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark